రైల్వే మంత్రిత్వ శాఖ

అయోధ్య – జనక్ పూర్ ‘భారత్ గౌరవ ఏసీ టూరిస్ట్ రైలు' ప్రారంభించనున్న భారతీయ రైల్వేలు

Posted On: 13 JAN 2023 5:16PM by PIB Hyderabad

రైల్వేల ప్రభుత్వ రంగ సంస్థ ఐ ఆర్ సీ టీ సీ నిర్వహణ

అత్యాధునిక భారత్ గౌరవ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైల్ లో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ క్లాసులు ;  2023 ఫిబ్రవరి 17 న ఈ వారం రోజుల రైలు ప్రారంభం  

యాత్రికులు అయోధ్య, జనక పూర్ ధామ ( నేపాల్) తో బాటుగా నందిగ్రామ్, సీతామడి, వారణాసి, ప్రయాగ్ సందర్శించటం యాత్రలో  ప్రధాన ఆకర్షణలుగా ఉంటాయి .

ఈ టూరిస్ట్ రైల్లో 4 ఫాస్ట్ ఏసీ కోచ్ లు, 2 సెకండ్ ఏసీ కోచ్ లు ఒక పాంట్రీ కార్, రెండు రైలు రెస్టారెంట్లు ఉంటాయి.  ఇందులో 156 మంది ప్రయాణించే వీలుంటుంది. 

ఆన్ లైన్ చెల్లింపు గేట్ వే ల ద్వారా ఈ ఎం ఐ సౌకర్యం అందుబాటు

ప్రధాని దూరదృష్టిని సాకారం చేయటానికి , సుసంపన్నమైన భారతదేశ సాంస్కృతిక సంపదను, అద్భుతమైన చారిత్రక ప్రదేశాలను భారతీయులకు భారతీయ రైల్వేలు “శ్రీ రామ-జానకి యాత్ర : అయోధ్య నుంచి జనకపురి” పేరుతో ఈ భారత్ గౌరవ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలును ప్రత్యేకంగా ప్రారంభించింది. ఇరుగు పొరుగు దేశాలలో ఉన్న రెండు అత్యంత ప్రధానమైన పర్యాటక ప్రదేశాలు  అయోధ్య, జనకపురి చూసే అవకాశం కలుగుతుంది.  ఈ రైలు ఢిల్లీలో 2023 ఫిబ్రవరి 17 న ప్రారంభమవుతుంది. భారత్- నేపాల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను కూడా ఇది బలపరుస్తుంది.  

ఈ టూరిస్ట్ రైలు యాత్రలో నందిగ్రామ్, సీతామడి, కాశీ, ప్రయాగ రాజ్, ప్రత్యేక ఆకర్షణలుగా ఉంటాయి. రెండు రాత్రులు హోటళ్ళలో బస ఉంటుంది. ఒక రాత్రి జనకపూరి లో, మరో రాత్రి వారణాశిలో. అయోధ్య, సీతామడి, ప్రయాగ రాజ్ పగటి వేళ సందర్శన ఉంటుంది.  

ఈ అత్యాధునిక డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైల్లో    అనేక సదుపాయాలున్నాయి. రెండు రెస్టారెంట్లు, ఒక ఆధునిక వంటశాల, కోచ్ ల లోనే స్నానపు గదులు, సెన్సర్లతో పనిచేసే వాష్ రూమ్ లు, కాళ్ళ మసాజ్ పరికరాలతోబాటు రైలు మొత్తం పూర్తిగా ఎయిర్ కండిషన్ చేసి ఉంటుంది. సీసీటీవీ కెమెరాల వంటి ఆధునిక భద్రతా ఏర్పాట్లు కూడా ఉన్నాయి.  ప్రతి కోచ్ లోనూ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటారు.  

ఏడు రోజుల భారత్ గౌరవ టూరిస్ట్ రైలు మొదటగా రాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఆగుతుంది.  అక్కడ శ్రీరామ జన్మభూమి ఆలయాన్ని, హనుమంతుడి ఆలయాన్ని చూడవచ్చు.  నందిగ్రామ్ లో భరతుడి మందిరం చూస్తారు. అయోధ్యలో  బీహార్ లోని  సీతామడి స్టేషన్  చేరుకుంటుంది. ఆ తరువాత నేపాల్ లోణి జనకపురి చేరుతుంది. అక్కడ రామ జానకి ఆలయం, సీతారామ వివాహ మండపం, ధనుష్ ధామం చూస్తారు. మరునాడు  పునౌర ధామం చూసి కాశీకి బయలుదేరతారు. కాశీలో యాత్రికులు సారనాథ్, కాశీ విశ్వనాథ్ ఆలయం, తులసీ ఆలయం, సంకట మోచ హనుమాన్ ఆలయం చూస్తారు. వారణాసి నుంచి బస్సులో బయలుదేరి  ప్రయాగ రాజ్ వెళతారు.  అక్కడం సంగం, శంకర విమాన మండపం, హనుమాన్ ఆలయం, భరద్వాజ ఆశ్రమం చూస్తారు. ప్రయాగ రాజ్ తరువాత 7 వ రోజున  రైలు ఢిల్లీకి తిరిగి వస్తుంది. ఆ విధంగా యాత్రికులు దాదాపు 2500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వస్తుంది.  

ఈ పాకేజ్ మరింత ఆకర్షణీయంగా ఉండేలా చేసి ఎక్కువమంది ప్రజలకి అందుబాటులో ఉండేట్టు చూస్తూ  ఐ ఆర్ సీ టీ సీ  వారు పేటీఎమ్, రేజర్ పే  లాంటి పేమెంట్ గెట్ వే లతో కలిసి ఈఎం ఐ చెల్లింపు అవకాశాలను అందుబాటులో ఉంచింది. దీనివలన 3,6,9,12,18 లేదా 24 నెలవారీ ఈఎంఐ చెల్లింపులు వాడుకొని ఎక్కువమంది యాత్ర చేస్తారు.  ఈ చెల్లింపులు డెబిట్/క్రెడిట్ కార్డులు వాడుకోవచ్చు. 18 ఏళ్ళు పైబడ్డ యాత్రికులకు కోవిడ టీకాలు తప్పనిసరి.  

భారత్ గౌరవ టూరిస్ట్ రైలు ప్రారంభించటమన్నది స్వదేశీ పర్యాటకాన్ని ప్రోత్సహించటానికి భారత ప్రభుత్వం చేపట్టిన  ‘దేఖో అప్నా దేశ్’ కార్యక్రమంలో భాగం.  ఒక్కో వ్యక్తికి టికెట్ ధర రూ. 39,775/- ఉంటుంది. ఏడు రోజుల పాటు సాగే ఈ యాత్రలో రాత్రి బస, శాకాహార భోజనం, స్థానిక రవాణా, ప్రయాణ బీమా, గైడ్ ఖర్చు లాంటివి కలిసే ఉంటాయి.  

 

***

 


(Release ID: 1891179) Visitor Counter : 129


Read this release in: English , Urdu , Hindi