ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
రెండు రోజుల పాటు మేఘాలయలో పర్యటించనున్న కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్
విద్యార్థులు, వ్యాపారులు & స్థానిక అధికారులతో సమావేశాలు
Posted On:
11 JAN 2023 5:20PM by PIB Hyderabad
నైపుణ్యాభివృద్ధి & నవపారిశ్రామికత్వం శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ రెండు రోజుల అధికారిక పర్యటన కోసం రేపు మేఘాలయ వెళ్లనున్నారు.
మంత్రి మొదట గౌహతికి చేరుకుని, అక్కడి నుంచి షిల్లాంగ్‌కు వెళ్తారు.
రామకృష్ణ మిషన్ నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని తొలుత మంత్రి సందర్శిస్తారు. ఆ తర్వాత స్థానిక వ్యాపార సంఘాల సభ్యులతో సమావేశం జరుగుతుంది. వ్యాపార అవకాశాలు, సవాళ్ల గురించి చర్చిస్తారు.
ఆ తర్వాత, పార్టీ రాష్ట్రాధ్యక్షుడు, ఆఫీస్ బేరర్లు, పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలతో మంత్రి సమావేశమవుతారు.
ఆ కార్యక్రమం అనంతరం, సామాజిక కార్యకర్తలతో సమావేశమై స్థానిక సమస్యలు, సమస్యలపై మంత్రి చర్చిస్తారు.
శుక్రవారం, మవ్రేమ్‌లో మహిళలను ఉద్దేశించి మంత్రి ప్రసంగిస్తారు. ఆ తర్వాత 'చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా'ను సందర్శిస్తారు.
మేఘాలయ నైపుణ్యాభివృద్ధి శాఖ కార్యదర్శితోనూ శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ సమావేశమవుతారు, రాష్ట్రంలో చేపడుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చిస్తారు.
ఆ రోజు చివరిలో, స్థానిక మీడియాతో ముఖాముఖి కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొంటారు.
శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ఈశాన్య ప్రాంతంలో చేపడుతున్న నాలుగో పర్యటన ఇది. అంతకుముందు, నాగాలాండ్ (రెండు సార్లు), త్రిపురలోనూ పర్యటించారు. సాఫ్ట్‌వేర్ సాంకేతికత పార్క్ అయిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వర్దమాన వెదురు కళాకారుల కోసం ఒక పైలట్ ప్రాజెక్ట్ వంటి పదికి పైగా కార్యక్రమాలను ఆయన ప్రారంభించాడు.
జనవరి 13, 2023 సాయంత్రం మంత్రి దిల్లీకి తిరిగి వస్తారు.
***
(Release ID: 1890596)
Visitor Counter : 150