సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఎం.ఎస్.ఎం.ఈ. జాతీయ మండలి (ఎన్.బి.ఎం.ఎస్.ఎం.ఈ) 19వ సమావేశానికి అధ్యక్షత వహించిన - శ్రీ నారాయణ్ రాణే
గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మానిటర్ (జి.ఈ.ఎం) ఇండియా రిపోర్టు 2021-22 ని విడుదల చేసి, 8 లక్షల అనధికారిక మైక్రో ఎంటర్‌ప్రైజెస్ ని చేర్చడం ద్వారా క్రమబద్దీకరణ ప్రాజెక్టును ప్రారంభించిన - శ్రీ రాణే
Posted On:
11 JAN 2023 6:17PM by PIB Hyderabad
ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ఎం.ఎస్.ఎం.ఈ. మండలి (ఎన్.బి.ఎం.ఎస్.ఎం.ఈ) 19వ సమావేశానికి కేంద్ర ఎం.ఎస్.ఎం.ఈ. శాఖ మంత్రి శ్రీ నారాయణ్ రాణే అధ్యక్షత వహించారు. కేంద్ర ఎం.ఎస్.ఎం.ఈ. శాఖ సహాయ మంత్రి శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు, వివిధ పరిశ్రమల సంఘాల ఆఫీస్ బేరర్లు, ఇతర ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మానిటర్ (జి.ఈ.ఎం) ఇండియా రిపోర్టు 2021-22 ని కేంద్ర మంత్రి విడుదల చేశారు. జి.ఈ.ఎం. అనేది వ్యవస్థాపక కార్యకలాపాలు, దాని సంబంధిత భావనల పై అంతర్జాతీయంగా తులనాత్మక ప్రాథమిక సమాచారాన్ని సేకరించే లక్ష్యంతో జి.ఈ.ఎం. కన్సార్టియం నిర్వహించిన ప్రపంచ అధ్యయనం.
అనధికారిక సూక్ష్మ సంస్థలను అధికారిక పరిధిలోకి తీసుకు రావడానికి వీలుగా క్రమబద్ధీకరణ ప్రాజెక్టు అమలు చేయడం కోసం కేంద్ర ఎం.ఎస్.ఎం.ఈ. మంత్రిత్వ శాఖ, భారతీయ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (ఎస్.ఐ.డి.బి.ఐ) మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. 8 లక్షల అనధికారిక సూక్ష్మ సంస్థలను చేర్చడం ద్వారా క్రమబద్దీకరణ ప్రాజెక్టు ను కేంద్ర మంత్రి ప్రారంభించారు.
ఎం.ఎస్.ఎం.ఈ. ల అభివృద్ధికి సంబంధించి, 18వ సమావేశంలో చర్చించిన అన్ని అంశాలపై తీసుకున్న చర్యలను బోర్డు సమీక్షించింది. సమావేశంలో సభ్యులు చేసిన అన్ని విలువైన సూచనలను సముచితంగా పరిగణిస్తామని, ఐ.ఎం.ఈ. ల సమస్యలను పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెడతామని, సమావేశానికి అధ్యక్షత వహించిన శ్రీ నారాయణ్ రాణే, బోర్డుకు హామీ ఇచ్చారు. తలసరి ఆదాయాన్ని పెంచడం కోసం దేశీయ ఉత్పత్తిని పెంచడం పైన, అదేవిధంగా ప్రధానమంత్రి ఆత్మ-నిర్భర్-భారత్ కలను సాకారం చేయడం కోసం కృషి చేయడం పైన ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. వీటిని సాధించడం కోసం, ఎం.ఎస్.ఎం.ఈ. లకు ఆర్థిక సహకారం అందించడంతో పాటు, వారి చెల్లింపు అవసరాలను సులభతరం చేయడం గురించి నొక్కి చెప్పారు. వ్యవస్థాపక నైపుణ్యాలను పెంపొందించడానికి, మరింత ఉపాధిని సృష్టించడానికి సమావేశంలో పాల్గొన్న భాగస్వాములందరి మద్దతును కూడా ఆయన అభ్యర్థించారు.
*****
(Release ID: 1890595)
Visitor Counter : 157