వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్టార్టప్ ఇండియా నూతన ఆవిష్కరణల వారోత్సవాల 2వ రోజు వర్ధమాన పారిశ్రామికవేత్తల నుండి భాగస్వామ్యం


భారతీయ స్టార్టప్ పారిశ్రామికఆవరణం కోసం డీ పీ ఐ ఐ టీ (DPIIT) స్టార్టప్ ఇండియా నూతన ఆవిష్కరణల వారోత్సవాలను 10 జనవరి 2023 నుండి 16 జనవరి 2023 వరకు ఘనంగా నిర్వహిస్తోంది

Posted On: 11 JAN 2023 5:25PM by PIB Hyderabad

దేశం నలుమూలలకు చెందిన పారిశ్రామికఆవరణ లబ్దిదారులను మరియు కార్య నిర్వాహులను చేరుకోవాలనే లక్ష్యంతో, స్టార్టప్ ఇండియా నూతన ఆవిష్కరణల వారోత్సవాల 2వ రోజున అనేక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.

 

స్టార్టప్ ఇండియా, కేరళ స్టార్టప్ మిషన్ (KSUM) భాగస్వామ్యంతో 2023 జనవరి 10 మరియు 11 తేదీల్లో కొచ్చిలో మహిళల స్టార్టప్‌ల కోసం  రెండు రోజుల ప్రత్యక్ష వర్క్‌షాప్‌ను నిర్వహించింది. ఈరెండు రోజుల  వర్క్‌షాప్ ఇప్పటికే ఉన్న మరియు ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను లక్ష్యంగా చేసుకుంది . 75 మంది కి పైగా వర్ధమాన వ్యవస్థాపకులు మరియు మహిళా వ్యవస్థాపకుల నుండి అద్భుతమైన భాగస్వామ్యం తో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వర్క్‌షాప్ యొక్క తొలి రోజున వ్యవస్థాపకులచే ప్రస్థాన-భాగస్వామ్య సెషన్‌లు పరిశ్రమ నిపుణులచే 'ఉత్పత్తి ధ్రువీకరణ, మార్కెట్ ప్రవేశం మరియు నిర్మాణం' మరియు ' అభ్యర్థన , బేరసారాలు మరియు నిధుల సేకరణ'పై సామర్థ్య నిర్మాణ శిక్షణ  జరిగాయి . దీని తర్వాత వర్క్‌షాప్ 2వ రోజున ఎంపిక చేయబడిన మహిళా పారిశ్రామికవేత్తలకు పెట్టుబడిదారుల సంపర్కం, అభ్యర్థన సెషన్‌లు మరియు ఇష్టాగోష్టి కలయిక అవకాశాలు ఉన్నాయి.

 

ఈశాన్య ప్రాంతం లో మహిళా పారిశ్రామికవేత్తలను పెంపొందించాలనే ఉద్దేశ్యంతో, స్టార్టప్ ఇండియా  ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల నుండి ఇప్పటికే ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలందరికీ వర్చువల్ మాక్ పిచింగ్ సెషన్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్ ఇన్వెస్టర్లతో నేరుగా చర్చించడానికి మరియు వారినుంచే నేరుగా అభిప్రాయలు  స్వీకరించడానికి పాల్గొనేవారికి అవకాశం ఇచ్చింది. 80 కంటే ఎక్కువమంది మహిళల నేతృత్వంలోని స్టార్టప్‌ల నుండి దరఖాస్తులు స్వీకరించబడ్డాయి, వాటిలో 15 ఎంపిక చేసిన స్టార్టప్‌లు 10 మంది పెట్టుబడిదారులను నిధుల కోసం అభ్యర్థించడానికి అవకాశం పొందాయి.

 

స్టార్టప్ ఇండియా "బ్రిడ్జింగ్ ది బ్రిడ్జ్: గోయింగ్ గ్లోబల్" అనే అంశంపై వెబ్‌నార్‌ను నిర్వహించింది. రిపబ్లిక్ ఆఫ్ క్రొయేషియాలో భారత రాయబారి శ్రీ రాజ్ కుమార్ శ్రీవాస్తవ, స్టార్టప్‌ల కోసం మైక్రోసాఫ్ట్ కంట్రీ హెడ్ - శ్రీమతి మధురిమా అగర్వాల్ మరియు ఫిన్‌లాండ్‌లోని భారత రాయబారి శ్రీ రవీష్ కుమార్‌తో సహా ముగ్గురు నిపుణులు ఈ సెషన్‌కు నాయకత్వం వహించారు.

 

తెలంగాణలో అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా "ఇన్నోవేషన్ టు యాక్సిలరేషన్" అనే అంశంపై స్టార్టప్ కార్నివాల్‌ను నిర్వహించింది. కార్యక్రమంలో ఫైర్ సైడ్ చాట్; స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్, ఎగ్జిబిషన్ సదస్సు; విజయ గాథల ప్రదర్శన; ప్రత్యేక స్టార్టప్ అవార్డు; మరియు స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ (SISFS)పై అవగాహన వర్క్‌షాప్ జరిగాయి. కార్యక్రమంలో పాల్గొన్నవారు స్టార్టప్‌లు, మహిళా పారిశ్రామికవేత్తలు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, సంభావ్య పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, సంస్థలు మొదలైనవారు పాల్గొన్నారు.

 

కాంచీపురంలోని గోల్డెన్ జూబ్లీ బయోటెక్ పార్క్ ఫర్ ఉమెన్ సొసైటీలో ఇద్దరు మహిళా వ్యవస్థాపకులు నేతృత్వంలో ' విద్యావేత్త పారిశ్రామికవేత్తగా మారడం' మరియు '  క్లీన్ టెక్ పారిశ్రామికవేత్త ప్రస్థానం' అనే రెండు అంశాలపై వెబ్‌నార్‌ను నిర్వహించారు. వెబ్‌నార్ ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ సెషన్‌ జరిగాయి.100 మంది యువ ఆవిష్కర్తలు మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

కోయంబత్తూరులోని ఏ ఐ ఎస్ రైజ్ బిజినెస్ ఇంక్యుబేటర్ ప్రైవేట్ లిమిటెడ్ మూడు రోజుల ఈవెంట్, ‘స్టార్టప్ ఒడిస్సీ’ని నిర్వహించింది, దీని మొదటి దశ జనవరి 11న ప్రారంభమైంది. తమిళనాడు, పూణె మరియు ఒడిశాలోని 10 కళాశాలల నుండి విద్యార్థులు ఈ కార్యక్రమంలో చేరారు మరియు ఆన్‌లైన్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 1000 మంది విద్యార్థులు మరియు యువ ఆవిష్కర్తలు చురుకుగా పాల్గొన్నారు.

***


(Release ID: 1890587) Visitor Counter : 187


Read this release in: English , Urdu , Hindi