భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం
యువ శాస్త్రవేత్తలను సాధికారత తో శక్తివంతం చేసే విధానానికి సిఫార్సుల కోసం అంతర్జాతీయ వెబ్‌నార్
Posted On:
11 JAN 2023 11:20AM by PIB Hyderabad
భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ (PSA) కార్యాలయం, ఇండియన్ నేషనల్ యంగ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (INYAS) మరియు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంయుక్తంగా "యువ శాస్త్రవేత్తలను సాధికారత కల్పించే విధానంపై సిఫార్సులు " అనే అంతర్జాతీయ వెబ్‌నార్‌ను బనారస్ హిందూ యూనివర్సిటీ లో నిర్వహించింది.
భారతదేశంలో పరిశోధన మరియు అభివృద్ధిని మరింతగా పెంపొందించడానికి శాస్త్రీయ మరియు సాంకేతిక నాయకత్వం అత్యుత్తమంగా రూపొందించడానికి తరువాతి తరం యువ శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులను (45 సంవత్సరాల వయస్సు లేదా అంతకంటే తక్కువ ) ప్రోత్సహించడానికి మరియు సాధికారత కల్పించేందుకు కొత్త విధాన పత్రం పై సిఫార్సులను క్రోడీకరించే లక్ష్యంతో యువ శాస్త్రవేత్తలను శక్తివంతం చేయడంపై ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఆఫీస్ చొరవలో భాగం గా జనవరి 9, 2023న వెబ్‌నార్ నిర్వహించారు.
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రొఫెసర్ టీ కే. ఊమెన్, మిచిగాన్, టెక్నలాజికల్ యూనివర్సిటీ, అమెరికా; డాక్టర్ మను వోరా, ఏ ఎస్ క్యూ ఫెలో, ఛైర్మన్ మరియు ప్రెసిడెంట్, బిజినెస్ ఎక్సలెన్స్, ఇంక్., అమెరికా; ప్రొఫెసర్ అనుప్మా ప్రకాష్, ప్రొవోస్ట్ మరియు ఎగ్జిక్యూటివ్ వైస్ ఛాన్సలర్, అలాస్కా విశ్వవిద్యాలయం; ప్రొఫెసర్ గణేష్ బోరా, అసోసియేట్ వైస్ ఛాన్సలర్ (రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్), ఫాయెట్‌విల్లే స్టేట్ యూనివర్శిటీ; ప్రొఫెసర్ మనోజ్ కె. శుక్లా, సాయిల్ ఫిజిక్స్ ప్రొఫెసర్, న్యూ మెక్సికో స్టేట్ యూనివర్శిటీ, అమెరికా; డాక్టర్ కేశవ్ స్వర్ంకర్, కన్సల్టెంట్ జనరల్ సర్జన్, రాయల్ గ్వెంట్ హాస్పిటల్, న్యూపోర్ట్, యూ కే; ప్రొఫెసర్ నితిన్ కే. త్రిపాఠి, ప్రొఫెసర్ (రిమోట్ సెన్సింగ్ మరియు జీ ఐ ఎస్), ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బ్యాంకాక్; ప్రొఫెసర్ సంజయ్ కె. శుక్లా, ఎడిత్ కోవాన్ యూనివర్సిటీ, పెర్త్, ఆస్ట్రేలియా; ప్రొఫెసర్ బిపాశ్యే ఘోష్, రీసెర్చ్ ఫెలో, డీప్ ట్రాన్సిషన్, యూనివర్శిటీ ఆఫ్ సస్సెక్స్, యూ కే; ప్రొఫెసర్ విక్రమ్ అల్వా, ప్రాజెక్ట్ లీడర్, మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంటల్ బయాలజీ, జర్మనీ వెబ్‌నార్‌లో వక్తలు గా పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు.
కెరీర్ ప్రారంభ పరిశోధకులకు నిధుల మద్దతు కోసం ; వారి ఆసక్తి ఉన్న ప్రాంతంలో పరిశోధన చేపట్టే స్వేచ్ఛ; నైపుణ్యం అభివృద్ధి ; నిర్ణయం తీసుకోవడంలో పాత్ర; అంతర్జాతీయ సహకారాన్ని చేపట్టడానికి పరిపాలనా విధానాలను సడలించడం; కెరీర్ ప్రారంభ శాస్త్రవేత్తలకు బహుమతులు మరియు గుర్తింపు మరియు యువ పరిశోధకులను నిలుపుకోవడానికి మరియు ప్రోత్సహించడానికి కెరీర్ వృద్ధికి అవకాశాల గురించి అవగాహన కల్పించడం; యువ శాస్త్రవేత్తల నెట్‌వర్కింగ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా సహకారం మరియు నిధుల కోసం అవకాశాలపై అవగాహన కల్పించడం; సలహాదారులకు మంచి మార్గదర్శకత్వ కార్యక్రమాలు మరియు ప్రోత్సాహకాలు; పరిశోధనా నీతిపై విద్య, పరిశోధనా పత్ర ప్రచురణలు మరియు పేటెంట్ దాఖలుకు మద్దతు ఇవ్వడం మొదలైన ముఖ్యమైన సిఫార్సులు వెబ్‌నార్ నుండి వచ్చాయి.
భారతదేశంలోని శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులతో సంప్రదింపులు మరియు భారతదేశం అంతటా శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులకు (≤ 45 సంవత్సరాల వయస్సు) వారి అభిప్రాయాన్ని పొందడానికి ప్రశ్నావళి ద్వారా చేసిన సంప్రదింపులు జనవరి 9, 2023న జరిగిన అంతర్జాతీయ వెబ్‌నార్ సిఫార్సులు దేశవ్యాప్తంగా ఉన్న యువకులు మరియు సీనియర్ శాస్త్రవేత్తలతో ఐ ఐ టీ బీ హెచ్ యూ లో జరగబోయే మేధోమథన సదస్సు లో వెలువడే తుది విధాన పత్రంలో చేర్చబడతాయి.
ఈ సందర్భంగా భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ అజయ్ కె సూద్ మాట్లాడుతూ, భారతదేశ భవిష్యత్తుకు పెట్టుబడిగా నిలిచే యువ శాస్త్రవేత్తలను సాధికారత తో శక్తివంతం చేసేందుకు మా నిరంతర ప్రయత్నం ఉంటుంది అని అన్నారు.
***
(Release ID: 1890291)
Visitor Counter : 222