పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
విభిన్న సరఫరాలు, ఈ అండ్ పి ని పెంచడం, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు మరియు గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ, గ్రీన్ హైడ్రోజన్ తదితర అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ఇంధన భద్రత కల్పించే విధంగా 4 అంచెల వ్యూహం అమలు చేస్తున్న భారతదేశం
2040 నాటికి ప్రపంచ ఇంధన అవసరాల్లో 40% అవసరాలు తీర్చే శక్తిగా అభివృద్ధి కానున్న భారతదేశం .. శ్రీ హర్దీప్ సింగ్ పూరి
2025 నాటికి 20% ఇథనాల్ మిళిత పెట్రోల్ సరఫరా శ్రీ హర్దీప్ సింగ్ పూరి
Posted On:
10 JAN 2023 12:55PM by PIB Hyderabad
ఇంధన భద్రత కల్పించడం కోసం 4 అంచెల వ్యూహం అమలు చేసి ఇంధన సంక్షోభం నుంచి భారతదేశం బయట పడిందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. విభిన్న సరఫరాలు, ఈ అండ్ పి ని పెంచడం, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు మరియు గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ, గ్రీన్ హైడ్రోజన్ తదితర అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ఇంధన భద్రత కల్పించే విధంగా 4 అంచెల వ్యూహం అమలు చేసి ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా ఎదుర్కొన్నామని అన్నారు. 1973 తర్వాత ఇంధన రంగంలో ఇంత పెద్ద సంక్షోభం ఏర్పడలేదని మంత్రి అన్నారు.దేశ అవసరాలకు అవసరమైన ముడి చమురు 39 దేశాల నుంచి దిగుమతి అవుతున్నదని అన్నారు. 2006-07 లో 27 దేశాల నుంచి ముడి చమురు వచ్చేదని అన్నారు. కొలంబియా, రష్యా, లిబియా, గాబన్, ఈక్వటోరియల్ గినియా మొదలైన కొత్త సరఫరాదారులతో సహా 2021-22 నాటికి మొత్తం 39 దేశాల నుంచి ముడి చమురు వస్తున్నదని అన్నారు. అమెరికా, రష్యా లాంటి దేశాలతో పటిష్ట సంబంధాలు కొనసాగిస్తూ మరిన్ని దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు.
'2021 డిసెంబర్ 2021,2022 డిసెంబర్ నెలల మధ్య డీజిల్ ధరలు భారతదేశంలో కేవలం 3% మాత్రమే పెరిగాయి. ఇదే సమయంలో డీజిల్ ధరలు అమెరికాలో 34%, కెనడాలో 6%, స్పెయిన్ లో 25%, యూకే లో 10% పెరిగాయి.కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ 2022 మే, 2021 నవంబర్ నెలల్లో ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం ధరలపై ప్రభావం చూపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల లీటరు డీజిల్ ధర 13 రూపాయలు, పెట్రోల్ ధర 13 రూపాయల వరకు తగ్గింది. దీనికి అదనంగా కొన్ని రాష్టాలు వ్యాట్ రేటును గణనీయంగా తగ్గించాయి. దేశంలో ఇంధన అన్వేషణ ఎక్కువ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2025 నాటికి 0.5 మిలియన్ చదరపు కిలోమీటర్లు, 2025 నాటికి 1.0 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అదనంగా అన్వేషణ సాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 'నో గో' ప్రాంతాన్ని 99% మేరకు తగ్గించడంలో విజయం సాధించిన ప్రభుత్వం, .91 మిలియన్ చదరపు కిలోమీటర్ల ఎకరాలను గుర్తించించింది. నేషనల్ డేటా రిపోజిటరీ (ఎన్డీఆర్)ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్లౌడ్ ఆధారిత, ఏఐ/ఎంఎల్ ఆధారిత నేషనల్ డేటా ఎన్డీఆర్ 2.0 కోసం ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి' అని శ్రీ పూరి వివరించారు.
పెట్రోల్ లో ఇథనాల్ మిశ్రమ నిష్పత్తి ని భారతదేశం ఎక్కువ చేసింది. 2013-14 లో 1.53%గా ఉన్న నిష్పత్తి 2022 నాటికి 10.17%కి చేరింది. 2025-26 నాటికి పెట్రోల్ లో 20% మిథనాల్ మిశ్రమం చేసి సరఫరా చేయాలని భారతదేశం లక్ష్యంగా నిర్ణయించుకుంది. 2023 నుంచి దశలవారీగా ఈ 20 సరఫరా ప్రారంభం అవుతుంది. దేశంలో హర్యానాలోని పానిపట్ (పారాలి), పంజాబ్ లోని భటిండా, ఒడిశాలోని బార్గఢ్ (పారాలి), అస్సాంలోని నుమాలిఘర్ (వెదురు), కర్ణాటకలోని దేవాంగెరె వద్ద ఐదు 2 జి ఇథనాల్ బయో రిఫైనరీ లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
సటాట్ పథకం కింద కంప్రెస్డ్ బయోగ్యాస్ (సిబిజి) ప్లాంట్ల ధరను కిలోకు 46 రూపాయల నుంచి 54 రూపాయలకు కేంద్రం పెంచింది. సిబిజి ఉత్పత్తి సమయంలో ఉత్పత్తి అయ్యే యూరియా వంటి బయో ఎరువులను తరలించేందుకు చర్యలు తీసుకుంటోంది. వినూత్నమైన మరియు పేటెంట్ పొందిన స్టేషనరీ, రీచార్జబుల్ మరియు ఎల్లప్పుడూ వంటగది తో అనుసంధానం అయి ఉండే ఇండోర్ సోలార్ కుకింగ్ కుకింగ్ పరికరాన్ని ఐఒసిఎల్ అభివృద్ధి చేసింది. ఇది భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది.
గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏడాదికి కనీసం 5 మిలియన్ మెట్రిక్ టన్నుల వరకు అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లో 19,744 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతోంది. దేశ ఇంధన అవసరాలు తీర్చే సామర్థ్యాన్ని పెట్రోలియం రిఫైనరీలు కలిగి ఉన్నాయి. కొత్త పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన గ్రీన్ హైడ్రోజన్ సరఫరా చేయడానికి కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉంది. 2024 మే నాటికి 22,000 రిటైల్ అవుట్లెట్ లలో ప్రత్యామ్నాయ ఇంధన స్టేషన్లను (ఈవీ ఛార్జింగ్ / సిఎన్జి / ఎల్పిజి / ఎల్ఎన్జీ / సిబిజి మొదలైనవి) ఏర్పాటు చేయాలని ఒఎంసిలు లక్ష్యంగా నిర్ణయించుకున్నాయి.
***
(Release ID: 1890024)
Visitor Counter : 220