పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
ఢిల్లీ వాయు నాణ్యత సూచీ ఆకస్మిక పెరుగుదలపై అత్యవసర సమీక్ష సమావేశం
- ఎన్.సి.ఆర్. ప్రాంత రాష్ట్ర ప్రభుత్వాలు, కాలుష్య నియంత్రణ బోర్డుల అధికారులతో సీఏక్యూఎం అత్యవసర సమీక్ష సమావేశం
- తనిఖీ బృందాలను తగినంతగా నియమించడం ద్వారా జీఆర్ఏపీ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని హామి
- కాలుష్య నియంత్రణ మరియు ఉపశమన చర్యలను ముమ్మరం దిశగా కాలుష్య నియంత్రణ బోర్డులు
Posted On:
09 JAN 2023 6:14PM by PIB Hyderabad
కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సి.పి.సి.బి) సాయంత్రం నాలుగు గంటలకు అందించిన వాయు నాణ్యత సూచి బులెటిన్ ప్రకారం ఢిల్లీ యొక్క మొత్తం వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) ఈ రోజు 434గా నమోదయింది, ఇది నిన్న (371) నమోదైన ఏక్యూఐ కంటే 63 పాయింట్లు ఎక్కువ. ఆదివారం (08/01/2023), ఈరోజు (09/01/2023) సాయంత్రం ఢిల్లీ సగటు ఏక్యూఐలో ఆకస్మిక పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని, ఎన్సీఆర్ & పరిసర ప్రాంతాలలో వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (సీఏక్యూఎం) అత్యవసర సమీక్షను నిర్వహించింది. జి.ఎన్.సి.టి.డి / ఎన్.సి.ఆర్. రాష్ట్ర ప్రభుత్వాలు/ అధ్యక్షులు/ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులు (పీసీబీలు)/ డీపీసీసీ సభ్య కార్యదర్శులు అధికారులతో సమావేశం ఈ సమీక్షా సమావేశం నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు/ ఎన్.సి.ఆర్ పీసీబీలు/ డీపీసీసీ ఛైర్పర్సన్లు మరియు సభ్య కార్యదర్శులు ప్రస్తుత 'తీవ్ర' స్థాయి వాయు నాణ్యత మరింత క్షీణించకుండా నిరోధించడానికి, ఢిల్లీ యొక్క మొత్తం వాయు నాణ్యత సూచి తగ్గించడానికి రంగంలో జీఆర్ఏపీ నిబంధనలను మరింత శక్తివంతంగా అమలు చేయవలసిన అత్యవసరాన్ని, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా జి.ఆర్.ఎ.పి అమలును నిర్ధారించడానికి తగిన సంఖ్యలో తనిఖీ బృందాలను నియమించాల్సిన అవసరాన్ని కూడా ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ అధికారులు/ ఎన్.సి.ఆర్ కాలుష్య నియంత్రణ బోర్డులు/ డీపీసీసీ జీఆర్ఏపీ అమలును సమీక్షిస్తామని మరియు మొత్తం సూచీలో ఆకస్మిక పెరుగుదలకు దారితీసిన వివిధ వనరుల సహకారాన్ని తగ్గించడానికి బహిరంగ దహన నివారణతో సహా కాలుష్య నియంత్రణ మరియు ఉపశమన చర్యలను మరింత తీవ్రతరం చేస్తామని హామీ ఇచ్చారు.
*****
(Release ID: 1889955)
Visitor Counter : 168