కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
“విమానం & క్షేత్ర విభాగం మధ్య భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ కాకుండా ఇతర సంస్థల ద్వారా సమాచార పంపిణీ సేవలు” సంప్రదింపుల పత్రం మీదస వ్యాఖ్యలు/ప్రతి వ్యాఖ్యల స్వీకరణకు చివరి తేదీని పొడిగించిన ట్రాయ్
प्रविष्टि तिथि:
09 JAN 2023 6:18PM by PIB Hyderabad
“విమానం & క్షేత్ర విభాగం మధ్య భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ కాకుండా ఇతర సంస్థల ద్వారా సమాచార పంపిణీ సేవలు” అనే అంశం మీద, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్), 10.12.2022న ఒక సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. ఈ సంప్రదింపుల పత్రంలో ప్రస్తావించిన అంశాల మీద సంబంధిత వర్గాల నుంచి రాతపూర్వక వ్యాఖ్యలను స్వీకరించడానికి చివరి తేదీగా 09.01.2023ను, ప్రతి వ్యాఖ్యలు స్వీకరించడానికి చివరి తేదీగా 23.01.2023ను నిర్ణయించింది.
వ్యాఖ్యలను సమర్పించడానికి మరికొంత సమయం కావాలని పరిశ్రమ సంఘాలు చేసిన అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని, రాతపూర్వక వ్యాఖ్యలు, ప్రతి వ్యాఖ్యలను సమర్పించడానికి చివరి తేదీలను వరుసగా 23.01.2023, 06.02.2023 వరకు పొడిగించాలని ట్రాయ్ నిర్ణయించింది.
ట్రాయ్ సలహాదారు (నెట్‌వర్క్, స్పెక్ట్రమ్ & లైసెన్సింగ్) శ్రీ అఖిలేష్ కుమార్ త్రివేదికి వ్యాఖ్యలు/ప్రతి వ్యాఖ్యలను పంపవచ్చు. advmn@trai.gov.inకు ఈ-మెయిల్ చేయవచ్చు. ఏదైనా వివరణ/సమాచారం కోసం టెలిఫోన్ నంబర్ +91-11-23210481 ద్వారా సంప్రదించవచ్చు.
***
(रिलीज़ आईडी: 1889953)
आगंतुक पटल : 224