సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

ముస్సోరీ క్యాంపస్ లోని ఎన్ సి జి జి లో సుపరిపాలనపై అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వోద్యోగులకు మొదటి సామర్థ్యపెంపు కార్యక్రమం ప్రారంభం


అలాగే, మాల్దీవులు, బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రెండు వారాల సామర్థ్య పెంపు కార్యక్రమం ప్రారంభం

పౌరుల అవసరాలను తీర్చేలా  సమర్థవంతమైనపాలనను అందించడానికి సాంకేతికతను అందిపుచ్చుకోవడం కీలకం 

ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో ప్రభుత్వోద్యోగులు అన్ని విధాలుగా కృషి చేయాలి: ఎన్ సి జి జి డిజి శ్రీ భరత్ లాల్

Posted On: 09 JAN 2023 6:24PM by PIB Hyderabad

నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్

(ఎన్ సి జి జి) ముస్సోరీ క్యాంపస్ లో బంగ్లాదేశ్, మాల్దీవులు ,అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వోద్యోగుల కోసం రెండు వారాల సామర్థ్య పెంపు కార్యక్రమం ఈ రోజు ప్రారంభమైంది. ఇందులో బంగ్లాదేశ్ కు చెందిన 39 మంది అధికారులు (56వ బ్యాచ్) ;మాల్దీవుల (20వ బ్యాచ్) నుంచి 26 మంది, అరుణాచల్ ప్రదేశ్ కు మొదటి సారి సామర్థ్య పెంపు కార్యక్రమం లో 22 మంది పాల్గొంటున్నారు. పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి వివిధ విధానాలు ,కార్యక్రమాల అమలును వేగవంతం చేయడానికి ఈ పౌర అధికారులు తమ విజ్ఞానం, నైపుణ్యాలను నవీకరించుకోవడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది. ప్రజలకు నిరంతరాయంగా సేవలను అందించడానికి వీలుగా వారిని సన్నద్ధం చేయడానికి ఈ శిక్షణ కార్యక్రమం సిలబస్ ను శాస్త్రీయంగా భాగస్వామ్య పద్ధతిలో రూపొందించారు.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశిస్తున్న 'వసుధైక కుటుంబం‘ 'పొరుగు వారు ముందు‘ అనే భావనలను ముందుకు తీసుకెళ్లేందుకు భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

సహకారంతో బాంగ్లాదేశ్ , మాల్దీవుల ప్రభుత్వ అధికారుల సామర్థ్య పెంపు కార్యక్రమాలను ఎన్ సి జి జి ప్రారంభించింది. ఈశాన్య , సరిహద్దు రాష్ట్రాల్లో పాలన , ప్రజా సేవలను మరింత మెరుగుపరచడానికి, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ అధికారుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు , పెన్షన్ల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆదేశించారు. ఎన్ సి జి జి ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వోద్యోగుల కోసం ఇటువంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోంది,

 

2024 నాటికి 1,800 మంది ప్రభుత్వోద్యోగుల సామర్థ్య పెంపుదల కోసం మాల్దీవుల సివిల్ సర్వీస్ కమిషన్, మాల్దీవులు, బంగ్లాదేశ్ ప్రభుత్వంతో

ఎన్ సి జి జి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 2022 లో సంతకం చేసిన ఎమ్ఒయు ప్రకారం మొదటి సారిగా అరుణాచల్ ప్రదేశ్ సివిల్ సర్వెంట్లకు కూడా ఎన్ సిజి జి సామర్థ్య నిర్మాణ కార్యక్రమం కింద శిక్షణ ఇస్తారు..

 

ప్రారంభ సమావేశానికి నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్ శ్రీ భరత్ లాల్ అధ్యక్షత వహించారు.

అధికారులను ఉద్దేశించి ఆయన

ప్రసంగిస్తూ, ప్రజా సేవలను సమర్థవంతంగా అందించాలని ఆయన స్ప ష్టం చేశారు. మెరుగైన సేవలు ప్రతి పౌరుడికి సమానంగా అందేలా అనువైన వాతావరణాన్ని కల్పించడంలో

ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ప్రజలకు తాగునీరు, విద్యుత్తు, శుభ్రమైన వంటగ్యాస్ కనెక్షన్లు, వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్లు వంటి అంతరాయం లేని సేవలను అందించడంలో సహాయపడిన సుపరిపాలన నమూనాల ఉదాహరణలను కూడా ఆయన ఇచ్చారు.

'ఎవరినీ అవకాశాలు పొందకుండా విడిచి పెట్టరాదు ‘ అని ప్రధాన మంత్రి చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. సుపరిపాలనలో నూతన ఆవిష్కరణలు, కొత్త దృక్పథాలను తీసుకురావడానికి, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం, ఆవిష్కరణలను తీసుకురావడం చాలా ముఖ్యం అని డిజి అన్నారు. ఈ కార్యక్రమం నుండి నేర్చుకున్న వాటిని వినియోగించుకొని, తమ సొంత కార్యాచరణను రూపొందించుకోవాలని, ఆయా దేశాలు/రాష్ట్రాల్లో తాము పని చేసే ప్రాంతాల్లో దీనిని అమలు చేయాలని ఆయన కోరారు.

 

బంగ్లాదేశ్, మాల్దీవులు, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వోద్యోగుల కోసం రెండు వారాల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వోద్యోగులు - మారుతున్న పాలనా దృక్పథం, భారతదేశ దార్శనికత-2047, పౌర సేవకుల పాత్ర, వికేంద్రీకృత మునిసిపల్ ఘన వ్యర్థాల నిర్వహణ, పరిపాలనను బలోపేతం చేయడానికి ప్రభుత్వ నియామక సంస్థ పాత్ర, మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ సేవలు , పరిపాలనలో నైతిక దృక్పథాలు, విపత్తు నిర్వహణ, భారతదేశంలో గ్రామీణాభివృద్ధి అవలోకనం, 2030 నాటికి ఎస్ డిజిల విధానం, భారతదేశంలో ఆరోగ్య పాలన, వాతావరణ మార్పు -జీవవైవిధ్యంపై దాని ప్రభావం - విధానాలు ,ప్రపంచ పద్ధతులు, అవినీతి నిరోధక పద్ధతులు, ఎల్ఐఎఫ్ఇ, సర్క్యులర్ ఎకానమీ వంటి వివిధ అంశాలపై నిపుణులతో సంభాషిస్తారు.

 

సుపరిపాలన, విధాన సంస్కరణలు, భారతదేశంతో పాటు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రభుత్వోద్యోగుల శిక్షణ, సామర్థ్య పెంపుపై పనిచేయడానికి దేశంలో అత్యున్నత స్థాయి సంస్థగా భారత ప్రభుత్వం 2014 లో నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ను ఏర్పాటు చేసింది. ఇది ప్రభుత్వ థింక్ ట్యాంక్ గా కూడా పనిచేస్తుంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో,

ఎన్ సి జి జి ఇప్పటివరకు బంగ్లాదేశ్, కెన్యా, టాంజానియా, ట్యునీషియా, సీషెల్స్, గాంబియా, మాల్దీవులు, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, లావోస్, వియత్నాం, భూటాన్, మయన్మార్ ,కంబోడియా మొదలైన 15 దేశాల సివిల్ సర్వెంట్లకు శిక్షణ ఇచ్చింది. కంటెంట్, డెలివరీకి ప్రసిద్ధి చెందిన సామర్థ్య అభివృద్ధి కార్యక్రమం పై ఆసక్తి పెరుగుతుండడం తో వివిధ దేశాల నుండి అధిక సంఖ్యలో సివిల్ సర్వెంట్లకు శిక్షణ ఇచ్చేలా ఎన్సిజిజి తన సామర్థ్యాన్ని విస్తరిస్తోంది.

 

కార్యక్రమం లో భాగంగా కార్యక్రమం లో పాల్గొంటున్న వారికి స్మార్ట్ సిటీ, ఇందిరా పర్యావరణ్ భవన్: జీరో ఎనర్జీ బిల్డింగ్, పార్లమెంట్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్, ప్రధాన మంత్రి సంఘాలయ వంటి వివిధ సంస్థలను సందర్శించే అవకాశం కూడా కల్పిస్తారు.

 

ఈ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాల్దీవుల కోర్సు కోఆర్డినేటర్ డాక్టర్ ఎ.పి.సింగ్, అరుణాచల్ ప్రదేశ్ కోర్సు కోఆర్డినేటర్ డాక్టర్ బి.ఎస్.బిష్త్, బంగ్లాదేశ్ కోర్సు కోఆర్డినేటర్ డాక్టర్ ముఖేష్ భండారి, ముస్సోరీ ఎన్ సి జి జి ఫ్యాకల్టీ డాక్టర్ సంజీవ్ శర్మ తదితరులు కూడా పాల్గొన్నారు

 

<><><>



(Release ID: 1889950) Visitor Counter : 130


Read this release in: English , Urdu , Hindi , Punjabi