శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు మరియు నిలకడతో కొనసాగే వృద్ధి కొత్త ఆలోచనల ద్వారా ఆవిష్కరణలు మరియు సృజనాత్మక స్టార్టప్‌లతో మిళితమైన సాంకేతికత కే భవిష్యత్తు అని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
Posted On:
08 JAN 2023 5:56PM by PIB Hyderabad
అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు మరియు నిలకడతో కొనసాగే వృద్ధి కొత్త ఆలోచనల ద్వారా ఆవిష్కరణలు మరియు సృజనాత్మక స్టార్టప్‌లతో మిళితమైన సాంకేతికత కే భవిష్యత్తు
ఈ విషయాన్ని కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) సైన్స్ & టెక్నాలజీ ఈరోజు ఇక్కడ చెప్పారు; సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) భూ విజ్ఞానం; ప్రధాని కార్యాలయం, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్, డాక్టర్ జితేంద్ర సింగ్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ నేపధ్యంలో 2023 సంవత్సరానికి కీలక రంగాలను సూచించారు.
ప్రపంచం 21వ శతాబ్దపు మొదటి త్రైమాసికం ముగింపు దశకు చేరుకుంటోందని, రాబోయే కొద్ది సంవత్సరాల్లో ఆ 21వ శతాబ్దాన్ని భారతదేశ శతాబ్దంగా నిరూపించుకునే అవకాశం ఉంటుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో, భారతదేశ వైజ్ఞానిక సౌభ్రాతృత్వానికి ఇది ఉత్తమ సమయం, ఎందుకంటే ప్రధానమంత్రి అనుకూలమైన వాతావరణాన్ని అందించడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా విశ్వ వేదిక పై మన పురోగతికి ఆటంకం కలిగించే అనేక గత పద్ధతుల నుండి వైదొలిగారనీ ఆయన జోడించారు.
మన శాస్త్రీయ విజయాలలో ప్రధాని మోదీ పెద్ద ముందడుగు ను సులభతరం చేయడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయ సామర్థ్యాల గౌరవాన్ని కూడా పెంచారు. ముఖ్యంగా ప్రపంచంలోని చాలా ప్రముఖ సైన్స్ టెక్ కంపెనీలకు నేడు భారతీయులే నాయకత్వం వహిస్తున్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని భారతదేశం జీ 20 కి ఆతిథ్యమిచ్చే దేశంగా అంతర్జాతీయ వేదికలపై పునరుద్ఘాటించిన సంవత్సరం కూడా ఇదేనని మంత్రి అన్నారు, అలాగే ప్రపంచం మన దేశం ప్రతిపాదనపై “అంతర్జాతీయ తృణ ధాన్యాల సంవత్సరం”గా ప్రకటించారు. డ్రోన్ పాలసీ నుండి జల ఆర్థిక రంగం వరకు, అంతరిక్ష రంగం నుండి కొత్త జియోస్పేషియల్ మార్గదర్శకాల వరకు, ప్రస్తుత శతాబ్దం మొదటి త్రైమాసికం చివరిలో భారతదేశం యొక్క ప్రధాన శాస్త్రీయ ఆవిష్కరణలు మనను ఇప్పటికే ప్రపంచంలోని మొదటి వరుస దేశంగా నిలిపాయి.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం గత వారం గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌కు ఆమోదం తెలపడంతో, భారతదేశం స్వావలంబన లేదా ఆత్మనిభర్ భారత్ యొక్క ఉన్నత దశలోకి ప్రవేశిస్తుంది. సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సీ ఎస్ ఐ ఆర్ కి చెందిన నేషనల్ కెమికల్ లాబొరేటరీ, పూణే మొదటి గ్రీన్ హైడ్రోజన్ ఇంధన బస్సుతో ముందుకు వచ్చిందని ఆయన అన్నారు.
ప్రైవేట్ కంపెనీల కోసం ఇస్రో ప్రారంభించిన చొరవ తో 100 కంటే ఎక్కువ స్టార్టప్‌లను ఇస్రో నమోదు చేయగా, 2024లో మొదటి మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ ప్రయోగానికి సిద్ధంగా ఉందని మరోవైపు, భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ ద్వారా భారతదేశానికి ముఖ్యమైన సహకారిగా మారడానికి సముద్ర అడుగు అన్వేషణకు (డీప్ ఓషన్ మిషన్) సిద్ధంగా ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.
***
(Release ID: 1889680)
Visitor Counter : 217