యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఇండోర్‌లో ఆదివారం ప్రారంభమైన ప్రవాసీ భారతీయ దివస్ (పిబిడి) సదస్సు ప్లీనరీ సెషన్‌ను ఉద్దేశించి ప్రసంగించిన కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్
సదస్సు కీలక ఇతివృత్తం - ఆవిష్కరణ, సాంకేతికతలలో ప్రవాసీ యువత పాత్ర
భారతదేశంలో మీ ఆలోచనలను ఆవిష్కరించేందుకు, పెట్టుబడి పెట్టేందుకు, ఐడియాలకు శ్రీకారం చుట్టేందుకు ఆహ్వానిస్తున్నానుః శ్రీ అనురాగ్ ఠాకూర్
Posted On:
08 JAN 2023 9:53PM by PIB Hyderabad
కీలకాంశాలుః
డయాస్పోరాః అమృత్ కాల్‌లో భారత పురోగతికి విశ్వసనీయ భాగస్వాములు అన్నది సదస్సు 17 ఎడిషన్ ఇతివృత్తం
భారత్ నుంచి భారతీయుడిని వేరు చేయవచ్చు, కానీ వారిలోని భారతీయుడిని వేరు చేయలేరుః శ్రీ అనురాగ్ ఠాకూర్
ఇండోర్‌లో జరుగుతున్న ప్రవాసీ భారతీయ దివస్ (పిబిడి) సదస్సును ఉద్దశించి 3 రోజు అయిన ఆదివారంనాడు కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ప్రసంగించారు. సదస్సు తొలి రోజును యువ ప్రవాసీ భారతీయ దివస్‌గా జరుపుకున్నారు. దాని ఇతివృత్తంః ఆవిష్కరణ, సాంకేతికతలలో యువ ప్రవాసీయుల పాత్ర.
ఈ సందర్భంగా సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ, యువ ప్రవాసీ భారతీయులు కేవలం తమ మూలాలను కనుగొనడం మాత్రమే కాదు, కానీ మనల్ని భారతీయులుగా చేసే ప్రతిదానినీ లోతుగా పాదుకొల్పడం. ఇది వర్ధమాన భారతదేశమే కాక మీ కథనం కూడా. ఇది నూతన సంభావ్యతలతో పునఃఅనుసంధానం కావడం, తిరిగి ఊహించుకునే క్షణం. ఇది మార్పును ముందుకు తీసుకుపోవడానికి, నూతన సంబంధాలను కనుగొనడానికి, కొత్త ఆలోచనలను అభివృద్ధి చేయడానికి ఒక నెట్‌వర్క్.
ప్రపంచవ్యాప్తంగా, భారతదేశానికి చెందిన, విదేశాలలో నివసిస్తున్న సమాజానికి చెందిన యువత సాంకేతిక, వాణిజ్యం, రాజకీయాలు, సృజనాత్మకత, ఆవిష్కరణలలో చెప్పుకోదగిన అభివృద్ధిని సాధించిందని నేడు నేను వ్యవహారవాదం, ఆత్మవిశ్వాసంతో చెప్తున్నానని మంత్రి వివరించారు.
భారతదేశంలోనూ లేదా విదేశాలలో కూడా భారతీయులు ఎప్పుడూ ఆత్మగౌరవంతో నిలవడమే కాక మనకోసం వేచి ఉండే సాహసోపేతమైన, ఉజ్జ్వల ప్రపంచంలోకి నడిపించేందుకు తమ హృదయాలను తెరిచి ఉంచారని, శ్రీ అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. కనుక, మీ ఐడియాలను భారత్‌లో ఆవిష్కరించేందుకు, పెట్టుబడి పెట్టేందుకు, శ్రీకారం చుట్టేందుకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానని ఆయన అన్నారు.
మెరుగైన నైపుణ్యాలు, మూలధన ఏర్పాటు - మానవ, సామాజిక, ఆర్థికపరమైన బహుళ స్థాయి లాభాలను ప్రవాసీ భారతీయులు తెస్తారని శ్రీ అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. మరోవైపు, భారతీయ ఐటి పరిశ్రమ అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణుల చలనశీలతకు బలమైన ప్రేరణను సృష్టించి, ప్రవాసులకు వారి మాతృభూమితో కలిసి ఉండేందుకు ఎంతో అవసరమైన అవకాశాన్ని అందించిందన్నారు.
17వ ప్రవాసీ భారతీయ దివస్ (పిబిడి) సదస్సు అనేది ప్రవాసీయులతో ప్రత్యక్షంగా ముచ్చటించినప్పుడు, వారి నుంచి నేర్చుకునే సందర్భంలో ఏర్పడ స్నహం, మార్గదర్శకత్వం, స్నేహ సంబంధాలను సృష్టించుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ నాయకత్వం కింద, భారతీయ ప్రవాసీయుల పట్ల మా వైఖరిని, పద్ధతిని మార్చుకున్నాం. మా అధికారిక పర్యటనల సందర్భంగా, దాని ఆవల కూడా వారితో కలిసే కార్యక్రమాలు జరిగేందుకు ప్రాముఖ్యతను ఇవ్వడం ద్వారా మన ప్రవాసీయులకు అర్హమైన గౌరవాన్ని, మర్యాద ఎంతగా ఇస్తున్నామన్నది ప్రతిబింబింపచేస్తున్నాం. ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోనూ ప్రధానమంత్రి వారిని కలిసిన ప్రతిసారీ ప్రవాసీల నుంచి వచ్చే ఉత్తేజకరమైన ప్రతిస్పందనను మనం చూడవచ్చు, అని శ్రీ ఠాకూర్ అన్నారు.
ప్రవాసీ యువతకు సంబంధించి ప్రభుత్వ దార్శనికతను వివరిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన డయాస్పోరా మిత్రుల మధ్య ఇరువైపులా భావనలు, పెట్టుబడులు ఎటువంటి ఆటంకాలూ లేకుండా ప్రవహించేలా చూడడం. భారతీయ స్టార్టప్‌లు, తాము నివాసముంటున్న దేశాలకు చెందిన యువ ప్రవాసీ ఆవిష్కర్తలను అనుసంధానం చేసి, వారి మధ్య సంబంధాలను నెలకొల్పేందుకు తాము చేస్తున్న కృష్టితో ఐడియాల పరస్పరమార్పిడిని సృష్టించడం జరుగుతోందన్నారు. మీరు భారత్ నుంచి భారతీయుడిని వేరు చేయవచ్చు, కానీ వారిలోని భారతీయుడిని వేరు చేయలేరన్నారు. భారతదేశ రుచులు, సంగీతపు లయ, వారి హృదయాలు ఎప్పుడూ భారతదేశం కొట్టుకుంటాయని, తమ తల్లిదండ్రుల భూమికి తోడ్పడాలని ప్రవాసులు కోరుకుంటున్నారన్నారు.
ఈ ప్రపంచాన్ని పట్టి పడీస్తున్న సమస్యలకు పరిష్కరాలను కనుగొనేందుకు తమ యోగ్యతను నిరూపించుకోవాలన్న పట్టుదలను భారతమూలాలకు చెందిన వ్యక్తులు ప్రదర్శించారని శ్రీ అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్ర టెక్ కంపెనీల విజయంలో భారత మూలాలకు చెందిన కొంత ప్రతిభావంతమైన వ్యక్తులు వ్యూహాత్మక, కేంద్ర పాత్రను పోషించాయి. భారత మూలాలకు చెందిన సిఇఒల జాబితాకు , అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ మూలాలకు చెందిన రాజకీయ నాయకుల చిట్టాకు అంతం లేదన్నారు.
డయాస్పోరా యువత కోసం ఉద్దేశించిన ముఖ్య చొరవలను వివరిస్తూ, ఇటీవలి సంవత్సరాలలో భారత ప్రభుత్వం మన డయాస్పోరా భారతీయుల శక్తిని, ఐడియాలను ఉపయోగించుకునేందుకు, భారతదేశపు యువజనుల విజయగాధలకు అనుసంధానం చేసేందుకు విభిన్న విధానాలను ప్రారంభించిందన్నారు. ఈ చొరవలలో నో ఇండియా ప్రోగ్రామం (కెఐపి - భారత్‌ను తెలుసుకోండి) - డయాస్పోరా యువతను సమకాలీన భారతదేశానికి చెందిన భిన్న కోణాలకు, దాని చైతన్యవంతమైన కళలు, వారసత్వం, సంస్కృతిని పరిచయం చేయడం, జిఐఎఎన్ (గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ అకడమిక్ నెట్‌వర్క్) స్కాలర్‌షిప్ కార్యక్రమం, భారతదేశంలోని పరిశోధన & అభివృద్ధి పర్యావరణ వ్యవస్థకు బలమైన అంతర్జాతీయ అనుసంధానాన్ని తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రారంభించిన వజ్రా ఫ్యాకల్టీ పథకం, మిషన్ శోధ్ గంగ (గ్లోబల్ అలెయెన్స్ ఫర్ న్యూ జెనెరేషన్ ఆక్సిలరేషన్), డయాస్పోరా పిల్లల కోసం స్కాలర్‌షిప్ కార్యక్రమం (ఎస్‌పిడిసి), భారతీయ సాంకేతిక, ఆర్థిక సహకారం (ఐటిఇసి) కొన్ని.
సదస్సు 17వ ఎడిషన్ ఇతివృత్తం - ప్రవాసీలు ; అమృత్‌కాల్‌లో భారతీయ పురోగతిలో విశ్వసనీయ భాగస్వాములు.
***
(Release ID: 1889670)
Visitor Counter : 206