సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

త్రిపుర లోని అగర్తలాలో ఈశాన్య ప్రాంతంలో ఎంఎస్ఎంఈల సుస్థిర అభివృద్ధిపై ప్రాంతీయ సదస్సు

Posted On: 08 JAN 2023 7:38PM by PIB Hyderabad

త్రిపుర లోని అగర్తలాలో 2023 జనవరి 9న జరిగే 'ఈశాన్య ప్రాంతంలో ఎంఎస్ఎంఈల సుస్థిర అభివృద్ధిపై ప్రాంతీయ సదస్సు'కు త్రిపుర ముఖ్యమంత్రి ప్రొఫెసర్ (డాక్టర్) మాణిక్ సాహా, కేంద్ర సహాయ మంత్రి శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మతో కలిసి కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ నారాయణ్ రాణే అధ్యక్షత వహించనున్నారు. మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న వివిధ పథకాలపై అవగాహన కల్పించడానికి ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సదస్సు లో ఎంఎస్ ఎమ్ ఇ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వము మరియు త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు.  ర్యాంప్ (ఎంఎస్ఎంఈ పనితీరును పెంచడం మరియు వేగవంతం చేయడం), ఉద్యోగ శక్తి కింద ఎన్ ఇఆర్ పోర్టల్ ను లింక్ చేయడం, గోమతి సిటీ గ్యాస్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం,  ఎస్ ఎఫ్ యు ఆర్ టి పథకం కింద పశ్చిమ త్రిపుర వెదురు మ్యాట్ క్లస్టర్ ప్రారంభోత్సవం, కెవిఐసి (ఖాదీ  విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్) మరియు టికెవిఐబి (త్రిపుర ఖాదీ  విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్) కొత్త భవనాల ప్రారంభోత్సవం ఈ సదస్సులో భాగంగా నిర్వహిస్తారు. భారతదేశం లో ఎంఎస్ఎంఈ ల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు, సిపిఎస్ఇలు మరియు పరిశ్రమల సంఘాలకు చెందిన ప్రభుత్వ విభాగాలతో సంభాషించడానికి ఔత్సాహిక / ఇప్పటికే ఉన్న వ్యవస్థాపకులకు ఈ సదస్సు ఒక వేదికను అందిస్తుంది.

అగర్తలాలో ఈ రోజు సదస్సు వివరాలు మీడియాకు  ఎంఎస్ఎంఈ సీనియర్ అధికారులు మీడియా కు వివరించారు. వ్యవస్థాపకత ని ప్రోత్సహించడానికి ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న వివిధ పథకాలకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.

ఎన్ఈఆర్ లో ఎంఎస్ఎంఈలకు సాధికారిత కల్పించడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. "ఎన్ఇఆర్ మరియు సిక్కింలో ఎంఎస్ఎంఈ ప్రోత్సాహం" అనేది ఎంఎస్ఎంఈ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆర్థిక సహాయాన్ని అందించే ఒక అంకితమైన పథకం. ఇప్పటి వరకు ఈ పథకం కింద 140 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పిఎంఈజిపి) కింద 1.14 లక్షల సూక్ష్మ యూనిట్లకు సహాయం చేయడం ద్వారా 7.6 లక్షల ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఎంఎస్ఎంఈ క్లస్టర్ డెవలప్ మెంట్ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 29 ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి.  దీనికోసం ప్రభుత్వం 35.45 కోట్లు  విడుదల చేసింది. స్థానిక చేతివృత్తుల వారికి ప్రయోజనం చేకూర్చే మొత్తం 85 క్లస్టర్లు "SFURTI (సంప్రదాయ పరిశ్రమల పునరుత్పత్తి కొరకు ఫండ్ పథకం) కింద ఆమోదించబడ్డాయి. ఇప్పటి వరకు ఈశాన్య ప్రాంతానికి చెందిన 2.7లక్షల సంస్థలు ఉద్యోగ పోర్టల్ లో  నమోదు చేసుకున్నాయి. దీనివల్ల 23 లక్షల మందికి ఉపాధి లభించింది.

మన ఆర్థిక వ్యవస్థపై ఎంఎస్ఎంఈల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి మరియు 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాకారం చేయడానికి భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో సమగ్ర పాత్ర పోషించే అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసే అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

 

దేశ ఆర్థిక శ్రేయస్సు కోసం ఎంఎస్ఎంఈ రంగాన్ని ప్రోత్సహించడం  ముఖ్యమైన అంశం. సుస్థిర వృద్ధి కోసం పోషించడం శక్తివంతం చేయడానికి మరియు ప్రపంచ విలువ గొలుసులో అనుకూలంగా మారడానికి MOMSME నిరంతరం కృషి చేస్తోంది. త్రిపుర, ఇతర ఈశాన్య రాష్ట్రాల ఎంఎస్ఎంఈలు ప్రభుత్వం అందించే వివిధ అంశాలను తెలుసుకొని కొత్త ఆలోచనలను చేర్చడం ద్వారా తమ పరిధిని విస్తరించడానికి ఈ సమావేశం సహాయపడుతుంది.

***


(Release ID: 1889669) Visitor Counter : 164


Read this release in: English , Urdu , Hindi , Manipuri