పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
ప్రాజెక్టుల ఆధారిత జిల్లా పంచాయత్ అభివృద్ధి ప్రణాళిక, బ్లాక్ పంచాయత్ అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించి రెండు రోజుల జాతీయ కార్యశాలను ప్రారంభించిన కేంద్ర పంచాయతి రాజ్ శాఖ సహాయమంత్రి శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్.
Posted On:
05 JAN 2023 8:53PM by PIB Hyderabad
కేంద్ర పంచాయతి రాజ్ మంత్రిత్వశాఖ , ప్రాజెక్టు ఆధారిత బ్లాక్ పంచాయత్ అభివృద్ధి ప్రణాళిఖ(బిపిడిపి), జిల్లా పంచాయతి అభివృద్ధి ప్రణాళిక (డిపిడిపి)పై 2023 జనవరి 5–6 తేదీలలో న్యూఢిల్లీలో జాతీయ కార్యశాలను నిర్వహిస్తోంది.
ఈ జాతీయ వర్క్ షాప్ ప్రాజెక్టు ఆధారిత బ్లాక్ పంచాయతి అభివృద్ధి ప్రణాళిక, జిల్లా పంచాయితి అభివృద్ధి ప్రణాళికకు విస్తృత ప్రాచుర్యం కల్పించడం, దీని ఉద్దేశం.
ఈ వర్క్షాప్ను కేంద్ర పంచాయతి రాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్ , పంచాయతి రాజ్ శాఖ కార్యదర్శి శ్రీ సునీల్ కుమార్, పంచాయతి రాజ్ శాఖ మాజీ కార్యదర్శి డాక్టర్ ఎస్.ఎం. విజయానంద్,
పంచాయతిరాజ్ శాఖ మాజీ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ బాలా ప్రసాద్, పంచాయతి రాజ్ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ అలోక్ ప్రేమ్ నగర్ ల సమక్షంలో ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలనుంచి ప్రజాప్రతినిధుల తో సహా,
సుమారు 650 మందికిపైగా ప్రతినిధులు , జిల్లా, బ్లాక్ పంచాయతీలకు చెందిన వారు, వివిధ మంత్రిత్వశాఖలకు చెందిన వారు , గ్రామీణాభివృద్ది రంగంలోని సంస్థలు, నాబార్డ్ , ఐఆర్ఎంఎ, యునిసెఫ్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు
ఈ రెండు రోజుల కార్యశాలలో పాల్గొంటున్నాయి.
శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్ ఈ రెండు రోజుల కార్యశాలకు హాజరౌతున్న ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యశాలకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన,
నూతన సంవత్సర ప్రారంభ సమయంలో ఈ జాతీయ వర్క్షాప్ జరుగుతుండడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ , సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ స్ఫూర్తితో
అన్నింటా గ్రామీణ ప్రాంతాలను సర్వసమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ఈ కార్యశాలను నిర్దేశించినట్టు చెప్పారు. జిల్లా, బ్లాకు, గ్రామపంచాయతి స్థాయిలో పనిచేస్తూ జాతి నిర్మాణం, అభివృద్ధికి తోడ్పడడం
అందరి సమష్టి తీర్మానంగా ఉండాలని ఆయన అన్నారు.
పంచాయతి రాజ్ సంస్థలు పకడ్బందీ సమన్వయంతో గ్రామీణ ప్రాంతాలలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాకారం చేయడానికి , భాగస్వామ్య పక్షాలన్నీ స్థానికంగా దృష్టి కేంద్రీకరించి పనిచేయాలని కపిల్ మోరేశ్వర్ పాటిల్ పిలుపునిచ్చారు.
పట్టణ ప్రాంతాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలు, అవకాశాల తరహాలో గ్రామీణ ప్రాంతాలలో కూడా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మూడంచెల పంచాయతిరాజ్ వ్యవస్థలో అత్యధిక ప్రాధాన్యత
ఇవ్వాలని తద్వారా పట్టణ,గ్రామీణ ప్రాంతాల మధ్య అంతరాన్ని తొలగించాలని ఆయన పిలుపునిచ్చారు.ప్రాజెక్టు ఆధారిత బిపిడిపి, డిపిడిపి కి సంబంధించిన సాంకేతిక అంశాలపై చర్చాకార్యక్రమానకి శ్రీ సునీల్ కుమార్, కార్యదర్శి, పంచాయతిరాజ్ మంత్రి త్వశాఖ కార్యదర్శి శ్రీ సునీల్ కుమార్ అధ్యక్షత వహించారు.
పంచాయతి రాజ్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిదులు నిరంతరం మెరుగుపడుతున్నాయని, పదిహేనవ ఆర్దిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా గ్రామీణ స్థానిక సంస్థలు, బ్లాకు, జిల్లా పంచాయతి
సంస్థలకు అందించడం జరుగుతోందని అన్నారు. బ్లాక్ పంచాయతీలు, జిల్లా పంచాయతీలు, కేంద్ర రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ల నుంచి, ఇతర మార్గాల నుంచి వచ్చే నిధులను సక్రమంగా
సద్వినియోగం చేసుకుంటూ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను సమర్ధంగా అమలు చేయాలన్నారు.
జిల్లా పంచాయతీలు, బ్లాక్ పంచాయతీలు తగిన , మంచి ఆలోచనతో కూడిన, వనరులను,బడ్జెట్‌ను గరిష్ఠస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చూడాలని శ్రీ సునీల్‌కుమార్ ఆయా పంచాయతీలు, బ్లాక్ పంచాయతీల ఎన్నికైన ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. విశాల ప్రజాప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
బిపిడిపి, డిపిడిపి లపై ప్రజెంటేషన్‌ను పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ అలోక్‌ప్రేమ్ నగర్ ఇచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలను బ్లాక్ పంచాయతీలు, జిల్లా పంచాయతీల వరకు పంచాయతి అభివృద్ధి పథకాల ద్వారా తీసుకువెళ్ళాలని, అందరు భాగస్వాముల క్రియాశీల సహకారంతో ఈ కార్యక్రమాలను చేపట్టాలని, దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో త సర్వసమగ్ర, సుస్థిరాభివృద్ధికి ఇది వీలు కల్పిస్తుందని ఆయన అన్నారు.
పంచాయతిరాజ్ మంత్రిత్వశాఖ మాజీ కార్యదర్శి డాక్టర్ ఎస్.ఎం.విజయానంద్ మాట్లాడుతూ, జిల్లా పంచాయతీలు, బ్లాక్ పంచాయతీలు ఖచ్చితమైన ప్రణాళికలు రూపొందించుకుని , పదిహేనవ ఫైనాన్స్ కమిషన్‌గ్రాంట్‌లను , అభివృద్ధి దృష్టితో జాగ్రత్తగా వినియోగించుకునేందుకు కృషిచేయాలన్నారు.
పంచాయతిరాజ్ మంత్రిత్వశాఖ మాజీ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్‌బాల ప్రసాద్, బిపిడిపి, డిపిడిపి రూపకల్పన, అమలు కమిటీ ఛైర్మన్ డాక్టర్ బాలా ప్రసాద్,
బిపిడిపి. డిపిడిపి ప్రాజెక్టు ఆధారిత కార్యక్రమంపై ముసాయిదా నివేదిక.అందులోని ముఖ్యాంశాలపై ఒక ప్రజంటేషన్ ఇచ్చారు. ఇందులో 1.పంచాయతీల ప్రణాళికల రూపకల్పనలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ
2.బిపిడిపి,డిపిడిపి ప్రాసెస్‌లు, 3. ప్రాజెక్టు ఆధారిత బిపిడిపి, డిపిడిపి, మధ్యశ్రేణి పంచాయత్‌లు, జిల్లా పంచాయతీలు తొమ్మిది అంశాల క్రింద చేపట్టదలచిన ప్రాజెక్టుల ఉదాహరణలు,4. ప్రాజెక్టు ఆధారిత బిపిడిపి, డిపిడిపి ల విషయంలో సామర్ధ్యాల నిర్మాణం వంటివి ఉన్నాయి.
పంచాయతిరాజ్ మంత్రిత్వశాఖ ఆర్థిక వ్యవహారాల సలహాదారు డాక్టర్ బిజయ కుమార్ బెహెరా మాట్లాడుతూ, భారతప్రభుత్వం అమలు చేస్తున మిషన్ లైఫ్ ప్రాధాన్యత గురించి తెలియజేశారు. డాక్టర్ బెహెరా, ఒక టెక్నికల్ సెషన్ కు కూడా అధ్యక్షత వహించారు. ఇందులో బిపిడిపి, డిపిడిపి రూపకల్పనపై రాష్ట్రాలు ఏ స్థితిలో ఉన్నాయన్నదానిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే విజయగాథలు,బిపిడిపి, డిపిడిపి నిపుణుల కమిటీ ముసాయిదా నివేదికపై వ్యాఖ్యలు, సూచనలు ఉన్నాయి.
ఈ జాతీయ కార్యశాల ప్రత్యక్ష ప్రసారాలను పంచాయతిరాజ్ మంత్రిత్వశాఖ అధికారిక సామాజిక మాధ్యమ ప్లాట్‌ఫారంపైన, ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్ లపైనా అందుబాటులోకి తెచ్చారు. పెద్ద సంఖ్యలో పంచాయతిరాజ్ ప్రతినిధులు, సిబ్బంది వర్చువల్ పద్ధతిలోజరిగిన వర్క్‌షాప్‌లో చేరారు.
నేపథ్యం:
రాజ్యాంగంలోని 11వ షెడ్యూలులో పొందుపరచిన అంశాలతోపాటు పంచాయతీలు తమ భౌగోళిక ప్రాంతపరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేసే అన్ని పథకాలను సమ్మిళితం చేస్తూ ఆ ప్రాంత ఆర్థిక, సామాజిక అభివృద్ధికి రాజ్యాంగంలోని ఆర్టికలÊ 243 జి కింద ఒక ప్రణాళికను రూపొందించి అమలు చేయవలసి ఉంటుంది.అందుకు అనుగుణంగా గ్రామపంచాయతీలు, ఇంటర్మీడియరీ పంచాయతీలు, జిల్లా పంచాయతీలు గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికను, బ్లాక్ డవలప్‌మెంట్ ప్రణాళిక (బిపిడిపి)ని, జిల్లా పంచాయతి అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తున్నాయి.
పంచాయతిరాజ్ మంత్రిత్వశాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ పీపుల్స్ ప్లాన్ కాంపెయిన్ (పిపిసి) పేరుతో సబ్ కీ యోజన, సబ్ కా వికాస్ థీమ్ కింద సమగ్ర జిపిడిపి తయారీకి 2018,2019,2020,2021, 2022 సంవత్సరాలలో ఉమ్మడి ప్రచారాన్ని నిర్వహిస్తూ వస్తున్నాయి. 2020 నుంచి బ్లాక్ పంచాయతి డవలప్‌మెంట్ ప్లాన్ (బిపిడిపి), జిల్లా పంచాయతి అభివృద్ధి ప్రణాళిక (డిపిడిపి)లను పీపుల్‌న ప్లాన్ కింద రూపొందిస్తున్నారు.ఈ ప్రచారం, పంచాతిలలోని 31 లక్షల మంది ఎన్నికైన ప్రతినిధుల పాత్రను, 5.25 కోట్ల మంది స్వయం సహాయక బృందాల మహిళల పాత్రను డిఎవై`ఎన్ ఆర్ ఎల్ ఎం కింద బలోపేతం చేయనుంది. గ్రామాలు, గ్రామపంచాయితీల స్థాయిలో గల లోటుపాట్లను గుర్తించి వాస్తవ సమాచారం ఆధారంగా జిపిడిపి కి ప్రణాళిక అమలుకు మిషన్ అంత్యోదయ డాటా ఉపకరించనుంది.
సబ్‌కీ యోజన, సబ్‌కా వికాస్ థీమ్‌తో చేపట్టిన కార్యక్రమం, గ్రామపంచాయతి స్థాయిలో నిర్మాణాత్మక ప్రణాళికా రూపకల్పనకు ఉద్దేశించినది. ఇది పంచాయతిరాజ్ సంస్థల మధ్య సమ్మిళితత్వం ద్వారా సాధించేందుకు నిర్దేశించినది. పిపిసిలు గత కొద్ది సంవత్సరాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. అవి మరింత స్థూలప్రాతిపదికన రూపొందించినవి.ఇందులో ఎన్నో సమకాలీన నూతన అంశాలు ఇమిడి ఉన్నాయి. వీటిని పంచాయతిరాజ్ సంస్థలకు చెందిన వివిధ ప్రణాళికలతో, ప్రత్యేకించి జాతీయస్థాయిలో చెప్పుకున్న సంకల్పాలు, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన సమస్యల పరిష్కారం వంటి వాటితో అనుసంధానం చేయడం జరిగింది.పిపిసి 2022ను 2022 అక్టోబర్ 02 వ తేదీనుంచి 2023 మార్చివరకు చేపట్టడం జరిగింది. ఇందులో జిపిడిపి, బిపిడిపి, డిపిడిపిలను 2023`24 సంవత్సరానికి రూపకల్పన చేస్తారు. పిపిసి 2022 ప్రధాన ఉద్దేశాలు కింది విధంగా ఉన్నాయి.
1) దేశవ్యాప్తంగా నిర్ణీత కాలవ్యవధిలో జిల్లా పంచాయతీలు, ఇంటర్మీడియట్ పంచాయతీలు, గ్రామపంచాయతీలచే సమగ్ర,సమ్మిళిత, అందరి భాగస్వామ్యంతో జిపిడిపి, బిపిడిపి, డిపిడిపిల తయారీ.
2) ముందు సంవత్సరాలలో సాధించిన ప్రగతికి సంబంధించి ఆధారాల సేకరణ, 2023624 సంవత్సరానికి ప్రతిపాదనలను పరిశీలనకు స్వీకరించడం. ఇందుకు సంబంధించి రాజ్యాంగంలోని 11వ షెడ్యూలులోని 29 అంశాలు,9 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించిన అంశాలను స్థానికంగా ఆయా పంచాయతీలకు అనువర్తింప చేయడం.
3.బాలసభ, మహిళాసభ, వార్డుసభ తోపాటు గ్రామసభ నిర్వహించడం ద్వారా చిన్న పిల్లల అవసరాలనుంచి మహిళలు, కమ్యూనిటీలోని ఇతర ప్రజల డిమాండ్లు తెలిసే అవకాశం ఉంది.
4)సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను స్థానికంగా వర్తింపచేయడం మరో ముఖ్యమైన అంశం. దీనిద్వారా 9 ఎల్.ఎస్.డిజి లక్ష్యాలను జిపిడిపి తో అనుసంధానం చేయడం.
5)గ్రామీణ పేదరిక తగ్గింపు ప్రణాళికలను పంచాతీరాజ్ సంస్థల అభివృద్ధి ప్రణాళికలలో చురుకుగా భాగస్వామ్యం చేయడం.
6)గ్రామీణ ప్రాంతాలలో స్పష్టమైన బాధ్యతాయుత పాలనను ప్రోత్సహించడం. ఇందుకు ఎన్నికైన మహిళా ప్రతినిధుల, స్వయం సహాయక బృందాల ప్రతినిధుల, కమ్యూనిటీలోని మహిళా సభ్యుల చురుకైన భాగస్వామ్యానికి వీలు కల్పించడం.
7) పంచాయితీ కార్యాలయం ద్వారా అమలు జరిగే అన్ని కార్యక్రమాలు, పథకాలకు సంబంధించిన సమాచారాన్ని నిధుల కేటాయింపు తదితరాలను ప్రజలకు తెలియజేసే ఏర్పాటు చేయడం,ప్రజాసమాచార బోర్డుల ఏర్పాటు.
ప్రాజెక్టు ఆధారిత బ్లాక్ పంచాయతి అభివృద్ధి ప్రణాళిక (బిపిడిపి)కి సంబంధించి అలాగే జిల్లా పంచాయతి అభివృద్ధి ప్రణాళిక (డిపిడిపి)కి సంబంధించి భారతప్రభుత్వానికి చెందిన పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. పంచాయతీ రాజ్ మాజీ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ బాలా ప్రసాద్ ఛైర్మన్ గా ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం 2022 నవంబర్ 9న ఉత్తర్వులు జారీచేసింది. ఈ కమిటీ విధివిధానాలు కిందివిధంగా ఉన్నాయి.
1.రాష్ట్ర, జిల్లా పంచాయతీలు, ఇంటర్మీడియట్, బ్లాక్ పంచాయతీలకు మార్గదర్శకాలు సూచనలు జారీచేయడం, ప్రాజెక్టు ఆధారిత డిపిడిపి, డిపిడిపిలు తయారుచేయడం.
2.ప్రాజెక్టు (ఎ) విస్తృత స్థాయిలో (బి) రాబడి సమకూర్చేదిగా (సి)సుస్థిర అభివృద్ధి కల్పించేందిగా (డి)
గ్రామపంచాయతీ తనంత తానుగా అమలు చేయలేనివి కాకుండా ఉండేలా చూడడం
3.ప్రాజెక్టు ఆధారిత బిపిడిపి, డిపిడిపి ల రూపకల్పనకు ఫార్మెట్ రూపొందించడం, వీటిని సుస్థిరాభివృద్ధి లక్ష్యాల కు అనుగుణంగా స్థానికతతో ముడిపడిన అంశాలు అనుసంధానం చేస్తూ ఫార్మెట్ రూపకల్పన
4. స్థానిక సుస్థిరాభివృద్ధి లక్ష్యాలతో ముడిపడిన బిపిడిపి, డిపిడిపి ప్రాజెక్టులు, కార్యకలాపాల విస్తృత జాబితా రూపకల్పన
5.బిపిడిఇ, డిపిడిపిలకు సంబంధించి ఏదైనా ఇతర ముఖ్యాంశాలు
ప్రాజెక్టు ఆధారిత బ్లాక్ పంచాయత్ అభివృద్ధి ప్రణాళిక, జిల్లా పంచాయతి అభివృద్ధి ప్రణాళికకు సంబంధించి (బిపిడిపి, డిపిడిపి) ఏర్పాటైన నిపుణుల కమిటీ ముసాయిదా నివేదికపై సూచనలను అభిప్రాయాలను 2023 జనవరి 5–6 తేదీల నాటి జాతీయ వర్క్ షాప్లో పాల్గొన్న వారినుంచి కోరారు.
***
(Release ID: 1889498)
Visitor Counter : 158