వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
10 జనవరి 2023 నుంచి 16 జనవరి 2023 వరకు స్టార్టప్ ఇండియా ఆవిష్కరణ వారోత్సవాన్ని నిర్వహించనున్న డిపిఐఐటి
దేశవ్యాప్తంగా 75 ప్రాంతాలలో స్టార్టప్ సంబంధిత కార్యక్రమాల నిర్వహణ
జాతీయ స్టార్టప్ డే సందర్భంగా 16 జనవరి 2023న జాతీయ స్టార్టప్ అవార్డు 2022 విజేతలకు సన్మానం
Posted On:
06 JAN 2023 3:18PM by PIB Hyderabad
జాతీయ స్టార్టప్ దినోత్సవం (16 జనవరి 2023), భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను జరుపుకునేందుకు 10 జనవరి 2023 నుంచి 16 జనవరి 2023 వరకు స్టార్టప్ ఇండియా ఇన్నొవేషన్ వీక్ (ఆవిష్కరణల వారోత్సవం)ను వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డిపిఐఐటి - పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం) నిర్వహిస్తోంది.
ప్రభుత్వ అధికారులు, ఇన్‌క్యుబేటర్లు (స్టార్టప్‌లు స్థిరపడేందుకు తోడ్పడే వ్యవస్థలు), కార్పొరేట్లు, పెట్టుబడిదార్లను కలుపుకొని వ్యాపారవేత్తలు, ఔత్సాహిక వ్యాపారవేత్తలు, ఇతర ఎనేబ్లర్లు (సాధ్యం చేసేవారు)కు విజ్ఞాన మార్పిడి (నాలెడ్జ్ షేరింగ్) సెషన్లు వంటివి స్టార్టప్ ఇండియా ఆవిష్కరణ వారోత్సవం 2023లో జరుగనున్నాయి.
అదనంగా, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలలో భాగంగా, దేశం నలుమూలల్లో స్టార్టప్ సమాజ ప్రమయంతో వ్యవస్థాపక , ఆవిష్కరణల స్ఫూర్తిని పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా 75 ప్రాంతాలలో స్టార్టప్‌కు సంబంధించిన వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలలో మహిళా వ్యవస్థాపకులు, ఇన్‌క్యుబేటర్ల శిక్షణ, మార్గదర్శన వర్క్‌షాపులు, వాటాదారుల రౌండ్ టేబుల్ సమావేశాలు, సామర్ధ్య నిర్మాణ వర్క్‌షాపులు, స్టార్టప్ పిచింగ్ సెషన్లు సహా పలు కార్యక్రమాలు ఉంటాయి.
అదనంగా, 16 జనవరి 2023న జాతీయ స్టార్టప్ దినోత్సవాన్ని స్మరించుకునేందుకు, స్టార్టప్ ఇండియా కింద ప్రతిష్ఠాత్మక చొరవ అయిన జాతీయ స్టార్టప్ అవార్డులు 2022 విజేతలకు సన్మాన కార్యక్రమాన్ని డిపిఐఐటి ఏర్పాటు చేస్తోంది. వివిధ రంగాలు, ఉపరంగాలు, వర్గాలలో స్టార్టప్‌లు, పర్యావరణ వ్యవస్థకకు తోడ్పడేవారు ప్రదర్శించిన శ్రేష్ఠతను గుర్తించి, వారిని ఈ కార్యక్రమంలో సత్కరిస్తారు.
వ్యవస్థాపకత, ఆవిష్కరణల స్ఫూర్తిని ప్రోత్సహించేందుకు 10 జనవరి నుంచి 16 జనవరి 2023 కాలంలో దేశవ్యాప్తంగా స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ భాగస్వాములను ఇందులో కలుపుకుపోవాలని స్టార్టప్ ఇండియా ఇన్నొవేషన్ వీక్ 2023 లక్ష్యంగా పెట్టుకుంది.
***
(Release ID: 1889202)
Visitor Counter : 192