ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ సమక్షంలో 150 మంది ప్రైవేట్ మెడికల్ కాలేజీల ప్రతినిధులతో భేటీ అయిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


వైద్య కళాశాలలు చురుకైన భాగస్వాములుగా ఉన్నప్పుడే వైద్య విద్యా సంస్కరణల కోసం
ప్రభుత్వ ఆశయం, దృక్పథం నెరవేరుతుంది: డాక్టర్ మాండవీయ

ఉన్నతమైన వైద్య విద్యను అందించడం కోసం ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల మధ్య భాగస్వామ్యానికి సూచన

2014లో 384 నుండి ప్రస్తుతం 684కి పెరిగిన వైద్య కళాశాలల సంఖ్య

నాణ్యత, విశ్వసనీయతను ప్రతిబింబించే వైద్యులు, విద్య కి సంబంధించిన పటిష్టమైన “ఇండియా బ్రాండ్” కోసం
ముందుకు సాగాలి: డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్

Posted On: 05 JAN 2023 6:42PM by PIB Hyderabad

విజ్ఞాన్ భవన్‌లో  దాదాపు 150 మంది ప్రైవేట్ మెడికల్ కాలేజీల ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ సంభాషణ చేశారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ కూడా పాల్గొన్నారు. డాక్టర్ మాండవీయ మాట్లాడుతూ “మెడికల్ కాలేజీలు చురుకైన భాగస్వాములుగా ఉన్నప్పుడే వైద్య విద్య సంస్కరణల కోసం ప్రభుత్వ ఆకాంక్ష, దృక్పథం నెరవేరుతుంది. ఈ వాతావరణాన్ని సృష్టించడానికి, సంప్రదింపులు, సంవాదం చాలా ముఖ్యం. ఉన్నతమైన నాణ్యమైన వైద్య విద్య కోసం ఎన్‌ఎంసి, మెడికల్ కాలేజీలు ఒక లక్ష్యాన్ని పంచుకునే పర్యావరణ వ్యవస్థ, వాతావరణాన్ని కలిపించే అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

 

వైద్య విద్యలో పరివర్తన, నియంత్రించాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ, పటిష్టమైన వైద్య విద్య కోసం ఎన్ఎంసి, మెడికల్ కాలేజీల భాగస్వామ్యాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి కోరారు.  ఉన్నతమైన వైద్య విద్యను అందించాలనే ఆలోచనను పంచుకోని వారిని హెచ్చరించారు. వైద్య సంస్థలలో బయోమెట్రిక్ హాజరు వంటి సంస్కరణలను కూడా ఆయన సూచించారు. ఉత్తమ వైద్య కళాశాలలు, వైద్య విద్యను నిర్ధారించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన బలమైన సందేశాన్ని ఇచ్చారు. 2014లో 387 మెడికల్ కాలేజీలు ఉండగా, వాటి సంఖ్యను 648 కి ప్రభుత్వం పెంచిందని తెలిపారు.

విదేశాల్లో ఉన్న భారతీయ వైద్యుల విశిష్టత భారతదేశ వైద్య విద్యా రంగానికి గుర్తింపును బలోపేతం చేసిందని డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ పేర్కొన్నారు. "భారతదేశం అద్భుతమైన వృద్ధి కథ భారతదేశంలోని వివిధ రంగాల నుండి అంచనాలను పెంచింది, వీటిలో ఆరోగ్యం కీలకమైన భాగం" అని ఆమె అన్నారు. “సబ్కా ప్రయాస్”తో దేశం పటిష్టంగా ఎదగగలదని గౌరవ ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. వైద్య విద్యలో ఒక నమూనా మార్పు తీసుకురావడానికి ప్రైవేట్ మెడికల్ కాలేజీల పాత్ర చాలా కీలకం.  వైద్యులు, నాణ్యత, విశ్వసనీయతను ప్రతిబింబించే విద్య “ఇండియా బ్రాండ్” గా ఆవిష్కారం అయ్యేలా గట్టి అడుగులు ముందుకు పడాలి” అని ఆమె తెలిపారు. యూజీ స్థాయిలో వైద్య విద్యను సంస్కరించడం కోసం ఎన్ఎంసి తీసుకున్న వివిధ కార్యక్రమాలు ఈ సందర్బంగా తెలియజేసారు. ఇందులో "ఒకే జిల్లా, ఒక వైద్య కళాశాల" అనే ప్రధాన మంత్రి దార్శనికతను అనుసరించి కళాశాలల సమానంగా కేటాయించే చర్యలు చేపట్టారు; యోగా మాడ్యూల్ పరిచయం; కుటుంబ దత్తత కార్యక్రమం ద్వారా గ్రామ వ్యాప్తి; ద్విభాషా భాషలలో వైద్య విద్య; ర్యాగింగ్ వ్యతిరేక సెల్స్; 2022-23 బ్యాచ్ కోసం విద్యా క్యాలెండర్.

మెడికల్ అసెస్‌మెంట్ రేటింగ్ బోర్డ్‌కు సంబంధించి చర్చించిన అంశాలలో బ్యాక్‌లాగ్‌ల గుర్తింపు, క్లియరింగ్ రెన్యూవల్స్ వంటి థీమ్‌లను కవర్ చేశాయి; అరమరికలు లేని అంచనాలు; నిర్ధారిత సమయ వ్యవధిలో అంచనా;  ప్రీ, పారా-క్లినికల్ కోర్సులలో ఉపాధ్యాయుల లభ్యత; ఫేస్ రికగ్నిషన్, ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ సిస్టమ్; తక్కువ క్లినికల్ లోడ్‌ను భర్తీ చేయడానికి నైపుణ్య ప్రయోగశాలల సాధ్యత; కొన్ని ప్రాంతాల్లో వైద్య కళాశాలల రద్దీకి సంబంధించిన ఆందోళనలు; వైద్య కళాశాలల పునరావృత మదింపులలో తగ్గింపు; గుర్తింపు చెల్లుబాటు వ్యవధిలో పెరుగుదల మొదలైనవి.  అకాడమీ, పరిశోధకులను ఆవిష్కరణలలో ప్రైవేట్ రంగంతో సహకరించమని డాక్టర్ మాండవ్య సూచించారు. భారతదేశంలో ఆరోగ్య రంగాన్ని మెరుగుపరచడానికి ప్రజల  నుండి ఏదైనా సూచనను కూడా ఆయన స్వాగతించారు.


ప్రైవేట్ మెడికల్ కాలేజీల ప్రతినిధులు తమతో సంభాషించినందుకు మరియు వైద్య విద్య యొక్క కీలకమైన అంశాలపై తమ అభిప్రాయాలు,  సూచనలను పంచుకోవడానికి ఈ అవకాశాన్ని కల్పించినందుకు కేంద్ర ఆరోగ్య మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

దాదాపు రెండు గంటల పాటు సాగిన 'సంవాద్' కార్యక్రమంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల ప్రతినిధులు తమతో సంభాషించి, తమ అభిప్రాయాలు, సూచనలను పంచుకునే అవకాశాన్ని కల్పించినందుకు కేంద్ర ఆరోగ్య మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రైవేట్ వైద్య కళాశాలలు నీట్ పీజీ, నెక్స్ట్టి  అడ్మిషన్లు, అధ్యాపకుల పదవీ విరమణ వయస్సు, జర్నల్ ప్రచురణలు, గ్రామీణ పోస్టింగ్ కోసం బాండ్, జిల్లా రెసిడెన్సీ ప్రోగ్రామ్, సూపర్ స్పెషాలిటీ కోర్సులు, కమ్యూనిటీ మెడిసిన్‌లో ఇంటర్న్‌షిప్, కొన్ని స్ట్రీమ్‌లలో తక్కువ ఫ్యాకల్టీకి సంబంధించిన సమస్యలను లేవనెత్తాయి. 

 

****



(Release ID: 1889156) Visitor Counter : 191


Read this release in: English , Urdu , Marathi , Tamil