జౌళి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

టెక్నికల్ టెక్స్‌టైల్స్ లో యు.జి. & పి.జి. డిగ్రీ ప్రోగ్రామ్ కోసం జారీ అయిన - మార్గదర్శకాలు


కొత్త టెక్నికల్ టెక్స్‌టైల్స్ పేపర్లతో ఇప్పటికే ఉన్న సాంప్రదాయ డిగ్రీ ప్రోగ్రామ్‌ ల నవీకరణకు - మార్గదర్శకాలు


టెక్నికల్ టెక్స్‌టైల్స్ కు ఇంటర్న్‌షిప్ మద్దతు ప్రకటించడం జరిగింది

Posted On: 05 JAN 2023 3:21PM by PIB Hyderabad

 

 

టెక్నికల్ టెక్స్టైల్స్లో విద్యాసంస్థల ప్రారంభానికి వీలుగా ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలకు సాధారణ మార్గదర్శకాలు' అదేవిధంగా, 'టెక్నికల్ టెక్స్టైల్స్ లో ఇంటర్న్షిప్ మద్దతు కు గ్రాంట్ కోసం సాధారణ మార్గదర్శకాలు' జారీ.

 

 

జి..ఎస్.టి. మార్గదర్శకాల ప్రకారం సంబంధిత డిపార్ట్మెంట్లు / ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో స్పెషలైజేషన్లకు చెందిన బి.టెక్ విద్యార్థులకు ఇంటర్న్షిప్లను అందించడం కోసం ప్రతి విద్యార్థికి నెలకు 20,000 రూపాయల వరకు గ్రాంటు అందించడం జరుగుతుంది.

 

 

ఉన్నత విద్యావంతులు, నైపుణ్యం కలిగిన నిపుణుల బృందం నిర్వహిస్తున్న టెక్నికల్ టెక్స్టైల్స్ కు సంబంధించిన అత్యాధునిక పరిశోధన, ఉత్పత్తి, వినూత్న పద్ధతుల్లో భారత దేశం భారీ ముందడుగు వేస్తుంది.

 

కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ రెండు మార్గదర్శకాలకు అనుమతి ఇచ్చింది. ఒకటిటెక్నికల్ టెక్స్టైల్స్లో విద్యాసంస్థల ప్రారంభానికి వీలుగా ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలకు సాధారణ మార్గదర్శకాలు' కాగా, రెండవది, నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్ (ఎన్.టి.టి.ఎం) కు చెందిన ప్రధాన కార్యక్రమం కింద 'టెక్నికల్ టెక్స్టైల్స్ లో ఇంటర్న్షిప్ మద్దతు కు గ్రాంట్ (జి..ఎస్.టి) కోసం సాధారణ మార్గదర్శకాలు'. కార్యక్రమ సాధికార కమిటీ (.పి.సి) సమావేశంలో అనుమతి మంజూరు చేసినట్లు, టెక్స్టైల్స్ శాఖ కార్యదర్శి శ్రీమతి రచనా షా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు.

 

టెక్నికల్ టెక్స్టైల్స్లో విద్యాసంస్థల ప్రారంభానికి వీలుగా ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలకు సాధారణ మార్గదర్శకాలు' - కొత్త టెక్నికల్ టెక్స్టైల్స్ డిగ్రీ ప్రోగ్రామ్ (యు.జి. & పి.జి) తో పాటు, కొత్త టెక్నికల్ టెక్స్టైల్స్ పేపర్లతో ఇప్పటికే ఉన్న సాంప్రదాయ డిగ్రీ ప్రోగ్రామ్లను నవీకరించడం ప్రారంభిస్తాయి. కేవలం టెక్స్టైల్ రంగంలోనే కాకుండా సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ మొదలైన ఇంజినీరింగ్లోని ఇతర విభాగాలు, వ్యవసాయ సంస్థలు, వైద్య కళాశాలలు, ఫ్యాషన్ సంస్థల్లో కూడా టెక్నికల్ టెక్స్టైల్స్లో పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయాలని జౌళి మంత్రిత్వ శాఖ భావిస్తోంది.

 

అండర్ గ్రాడ్యుయేట్ (యు.జి), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పి.జి) డిగ్రీ ప్రోగ్రామ్లకు సంబంధించి ప్రయోగశాల పరికరాల అప్గ్రేడేషన్ / పెంపుదల, ల్యాబ్ సిబ్బందికి శిక్షణ, సంబంధిత విభాగంలోని ఫ్యాకల్టీ సభ్యులకు / విశ్వవిద్యాలయం / ఇన్స్టిట్యూట్లో స్పెషలైజేషన్కు సంబంధించిన ప్రత్యేక శిక్షణ మార్గదర్శకాల పరిధిలోకి వస్తాయి. ఇది ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థలతో పాటు, ఎన్ .ఆర్.ఎఫ్ ర్యాంకింగ్ ఉన్న ప్రైవేట్ సంస్థలు కూడా పరిధి లోకి వస్తాయి. టెక్నికల్ టెక్స్టైల్స్లో పూర్తి కోర్సును ప్రవేశపెట్టడానికి సహాయం పి.జి. కోర్సుకైతే 20 కోట్ల రూపాయల వరకు, అదే యు.జి. స్థాయిలో కోర్సు కైతే 10 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. యు.జి. స్థాయిలో తప్పనిసరి సబ్జెక్టు తో పాటు, కొన్ని ఎంపికలను పరిచయం చేస్తూ, 7.5 కోట్ల రూపాయల వరకు సహాయం ఇవ్వవచ్చు.

 

వచ్చే దశాబ్దంలో సాంకేతిక వస్త్ర రంగంలో భారత దేశాన్ని ప్రపంచ అగ్రగామిగా మార్చడానికి సమర్థవంతమైన, ప్రపంచ స్థాయి నాలెడ్జ్ ఎకోసిస్టమ్ను రూపొందించడంపై మార్గదర్శకాలు దృష్టి సారిస్తాయి. ఇది ఉన్నత విద్యావంతులు, సమర్థులైన నిపుణుల బృందం ద్వారా ఇది నిర్వహించడం వల్ల, అత్యాధునిక పరిశోధన, ఉత్పత్తి, సాంకేతిక వస్త్రాలకు సంబంధించిన వినూత్న పద్ధతుల్లో భారతదేశం భారీ పురోగతిని సాధిస్తుంది.

 

టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్లో ఎన్.టి.టి. కి చెందిన వెబ్ పేజీ https://www.texmin.nic.in/technical-textiles-mission. క్రింద టెక్నికల్ టెక్స్టైల్స్లో విద్యాసంస్థల ప్రారంభానికి వీలుగా ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలకు సాధారణ మార్గదర్శకాలు' అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తులను ఇందుకోసమే ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన http://nttm.texmin.gov.in/ పోర్టల్లో మాత్రమే పోర్టల్ తెరిచిన తేదీ (2023 జనవరి, 10 తేదీ) నుంచి 2023 మార్చి, 2 తేదీ వరకు సమర్పించవచ్చు.

 

టెక్నికల్ టెక్స్టైల్స్ లో ఇంటర్న్షిప్ మద్దతుకు గ్రాంట్ కోసం సాధారణ మార్గదర్శకాలు (జి..ఎస్.టి) రెండు దశల్లో అమలు చేయడం జరుగుతుంది. (i) అర్హత కలిగిన కంపెనీల ఎంప్యానెల్మెంట్, (ii) ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, ఇందులో ఒక్కో విద్యార్థికి (సంబంధిత విభాగాలు / అర్హత కలిగిన ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల స్పెషలైజేషన్ ల్లోని 2 / 3 / 4 సంవత్సరంలో బి.టెక్. విద్యార్థులు) నెలకు 20,000 రూపాయల వరకు గ్రాంట్, ఇంటర్న్షిప్ వ్యవధికి గరిష్టంగా 2 నెలల కాలానికి నిధుల మద్దతుకు లోబడి, ఎంప్యానెల్ చేయబడిన కంపెనీలకు అందించబడుతుంది. అర్హత పొందిన ఏజెన్సీలలో 10 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ కలిగిన టెక్స్టైల్ పరిశ్రమలు, మంత్రిత్వ శాఖ కింద టెక్స్టైల్ పరిశోధన సంస్థలు, టెక్స్టైల్ యంత్రాల తయారీ సంస్థలు. ఎంప్యానెల్ చేయబడిన పరిశ్రమలు / సంబంధిత బోధనాంశాలు కలిగిన ప్రభుత్వ నిధులతో పనిచేసే ఇంజనీరింగ్ సంస్థలతో పాటు, ఎన్..ఆర్.ఎఫ్. ర్యాంకింగ్ 200 వరకు ఉన్న ప్రైవేటు సంస్థలు శిక్షణ ఇవ్వవచ్చు.

 

టెక్నికల్ టెక్స్టైల్స్ రంగంలో విద్యాసంస్థలు-పరిశ్రమల మధ్య అనుసంధానతలను పెంపొందించడంతో పాటు నాణ్యమైన మానవ వనరులను, ముఖ్యంగా పరిశ్రమ-శిక్షణ పొందిన ఇంజనీర్లు, నిపుణులతో పాటు, సాంకేతిక వస్త్రాల తయారీ, సంబంధిత రంగంలో అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులను రూపొందించడంలో చర్య తోడ్పడుతుంది.

 

'టెక్నికల్ టెక్స్టైల్స్ లో ఇంటర్న్షిప్ మద్దతుకు గ్రాంటు కోసం సాధారణ మార్గదర్శకాలు (జి..ఎస్.టి)' టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ కు చెందిన అధికారిక వెబ్సైట్లో ఎన్.టి.టి.ఎం. పేజీ క్రింద https://www.texmin.nic.in/technical-textiles-mission. వివరంగా అందుబాటులో ఉన్నాయి, దరఖాస్తుదారు కంపెనీలు తమ దరఖాస్తులను గడవు తేదీ 23.02.2023 లోపు సమర్పించవచ్చు.

 

ఎన్.టి.టి.ఎం. పురోగతి గురించి, కార్యదర్శి తెలియజేస్తూ, జియో టెక్, ఆగ్రోటెక్, స్పెషాలిటీ ఫైబర్స్, ప్రొటెక్ మొదలైన సాంకేతిక వస్త్రాలకు చెందిన వివిధ రంగాలలో ..టి. లు / ఎన్..టి. లు / వస్త్ర పరిశోధన సంస్థలు (టి.ఆర్..లు) వంటి ప్రధాన సంస్థలకు, ముఖ్యంగా వీటిలో చాలా వరకు పరిశ్రమ భాగస్వామ్య సంబంధాలు కలిగిన సంస్థలకు 232 కోట్ల రూపాయల విలువైన 74 పరిశోధన ప్రతిపాదనలు ఆమోదించినట్లు, వివరించారు.

 

టెక్నికల్ టెక్స్టైల్స్ కొన్ని నిర్దిష్ట విధులను నిర్వర్తించాల్సి ఉన్నందున, నాణ్యతను నిర్ధారించడం చాలా ముఖ్యం. దీనిని సాధించడానికి, 107 సాంకేతిక వస్త్ర వస్తువుల క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లు (క్యూ.సి..లు) పరిశీలనలో ఉన్నాయని ఆమె తెలిపారు. 19 జియో-టెక్, 12 ప్రో-టెక్, 22 ఆగ్రో-టెక్ తో పాటు 6 మెడి-టెక్ క్యూ.సి..లు పరిశీలనలో ఉన్నాయి. 48 మెడి-టెక్ అంశాలు ఇప్పటికే సి.డి.ఎస్.సి.. నియంత్రణలో ఉన్నాయి.

 

టెక్నికల్ టెక్స్టైల్స్పై 500 కంటే ఎక్కువ బి..ఎస్. ప్రమాణాలు అభివృద్ధి చేయబడ్డాయి, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మరో 40 ప్రమాణాలను అభివృద్ధి చేయడానికి బి..ఎస్. కృషి చేస్తోంది. టెక్నికల్ టెక్స్టైల్స్ అభివృద్ధి కోసం ఎస్.ఆర్.టి..పి.సి. కి ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ పాత్ర కేటాయించడం జరిగింది.

 

ప్రైవేట్ పరిశ్రమల నుండి కూడా భాగస్వామ్యాన్ని అనుమతించే సాంకేతిక టెక్స్టైల్స్ యంత్రాలు / పరికరాలు / ఎక్విప్మెంట్ & ఇన్స్ట్రుమెంట్స్ యొక్క స్వదేశీ అభివృద్ధి కోసం పరిశోధన ప్రతిపాదనలను ఆహ్వానించడానికి కూడా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసిందని శ్రీమతి షా నొక్కి చెప్పారు. పరిశోధన ప్రతిపాదనలను ఆహ్వానించడానికి సి.ఆర్.డి.., సి.ఎస్..ఆర్. వంటి ప్రతిష్ఠాత్మక పరిశోధనా సంస్థలను కూడా సంప్రదించడం జరిగింది. టెక్నికల్ టెక్స్టైల్స్లో అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి కూడా మార్గదర్శకాలు రూపొందించబడ్డాయి.

ఆగ్రో టెక్స్టైల్స్ను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేసేందుకు నవ్సారి వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆగ్రోటెక్ కోసం ఒక ప్రదర్శన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇది రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న గౌరవనీయులైన ప్రధానమంత్రి ఆశయాలకు అనుగుణంగా ఉంది. సదస్సులు, ప్రదర్శనలు, విజ్ఞాన పర్యటనలు, కొనుగోలుదార్లు, అమ్మకందార్ల సమావేశాలు మొదలైన వాటి ద్వారా దేశవిదేశాలలో వివిధ ప్రచార కార్యకలాపాలు నిర్వహించాలని కూడా ప్రణాళికలను రూపొందించుకోవడం జరుగుతోంది.

 

*****

 


(Release ID: 1889104) Visitor Counter : 192


Read this release in: English , Urdu , Hindi , Tamil