నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ గురించి వాటాదారులతో సంభాషించిన మంత్రి శ్రీ ఆర్.కె. సింగ్

Posted On: 05 JAN 2023 7:03PM by PIB Hyderabad
  1. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ భారతదేశాన్ని ప్రపంచంలోనే గ్రీన్ హైడ్రోజన్ యొక్క ప్రముఖ ఉత్పత్తిదారు మరియు సరఫరాదారుగా నిలుపుతుంది.
  2. ఇది పరిశ్రమకు ఆకర్షణీయమైన పెట్టుబడి మరియు వ్యాపార అవకాశాలను కలిగిస్తుంది.
  3. డీకార్బనైజేషన్, ఇంధన స్వాతంత్ర్య సాధన దిశగా భారతదేశ ప్రయత్నాలకు ఇది గణనీయంగా దోహదపడుతుంది.
  4. ఉపాధి మరియు ఆర్థికాభివృద్ధికి అవకాశాలను సృష్టిస్తుంది.
  5. దేశంలో గ్రీన్ హైడ్రోజన్ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధిని ఈ మిషన్ ముందుకు తీసుకుపోతుంది
  6. లక్ష్యంగా పెట్టుకున్న ఉత్పత్తి సామర్థ్యం మొత్తం పెట్టుబడులలో రూ.లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకువస్తుంది. 6 లక్షలకు పైగా స్వచ్ఛమైన ఉద్యోగాల సృష్టికి దారి తీస్తుంది.
  7. మిషన్ ఇతర కష్టతరమైన రంగాలలో పైలట్ ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది.
  8. మిషన్ పరిశోధన మరియు అభివృద్ధి ప్రాజెక్ట్లకు కూడా మద్దతు ఇస్తుంది.

నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కు నిన్న కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత కేంద్ర విద్యుత్ మరియు నూతన & పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి  శ్రీ ఆర్.కెసింగ్ ఈరోజు సంబంధిత రంగ వాటాదారులతో చర్చించారు. మంత్రి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.  మిషన్ భారతదేశాన్ని ప్రపంచంలోనే గ్రీన్ హైడ్రోజన్ యొక్క ప్రముఖ ఉత్పత్తిదారు మరియు సరఫరాదారుగా మారుస్తుందని శ్రీ ఆర్.కె. సింగ్ వాటాదారులకు తెలియజేశారు మిషన్ పరిశ్రమకు ఆకర్షణీయమైన పెట్టుబడి మరియు వ్యాపార అవకాశాలను అందిస్తుందిడీకార్బనైజేషన్, ఇంధన స్వాతంత్ర్యం కోసం భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు గణనీయంగా దోహదపడుతుంది. ఉపాధి మరియు ఆర్థిక అభివృద్ధికి అవకాశాలను కూడా సృష్టిస్తుందని అన్నారు. గ్రీన్ హైడ్రోజన్ స్థోమతను పెంచేందుకు రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్పై పని చేస్తూనే డిమాండ్ సృష్టిసరఫరాను పటిష్టం చేయడం వంటి చర్యల ద్వారా దేశంలో గ్రీన్ హైడ్రోజన్ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధిని మిషన్ ముందుకు తీసుకువెళుతుందని మంత్రి వివరించారు. 2030 నాటికి దాదాపు 125 గిగా వాట్ల అనుబంధ పునరుత్పాదక శక్తి సామర్థ్యంతో గ్రీన్ హైడ్రోజన్ సామర్థ్యాన్ని సంవత్సరానికి కనీసం 5 ఎంఎంటీ (మిలియన్ మెట్రిక్ టన్నుఏర్పాటు చేయాలని మిషన్ లక్ష్యంగా పెట్టుకుందిలక్ష్యంగా పెట్టుకున్న ఉత్పత్తి సామర్థ్యం మొత్తం పెట్టుబడులలో రూ.లక్షల కోట్లకుపైగా పెట్టుబడులను తీసుకురానుందిఫలితంగా 6 లక్షలకు పైగా స్వచ్ఛమైన ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.  శిలాజ ఇంధనాలు మరియు శిలాజ ఇంధన ఆధారిత ఫీడ్స్టాక్లను గ్రీన్ హైడ్రోజన్తో భర్తీ చేయడానికి స్టీల్లాంగ్-రేంజ్ హెవీ డ్యూటీ మొబిలిటీషిప్పింగ్ఎనర్జీ స్టోరేజ్ మొదలైన ఇతర హార్డ్-టు-బేట్ రంగాలలో పైలట్ ప్రాజెక్టులకు మిషన్ మద్దతు ఇస్తుందని కూడా తెలియజేయబడిందిదాని ఉత్పన్నాలుమిషన్ ఆర్ అండ్ డి ప్రాజెక్ట్లకు మద్దతు ఇస్తుంది నిబంధనలుప్రమాణాలు మరియు ధృవీకరణ కోసం ఒక బలమైన ఫ్రేమ్వర్క్ను అభివృద్ధి చేస్తుంది.

 

***



(Release ID: 1889097) Visitor Counter : 193


Read this release in: English , Urdu , Hindi