రైల్వే మంత్రిత్వ శాఖ

అందుబాటులోకి భారతీయ రైల్వేలలోని పొడవైన పూర్తి ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ సెక్షన్


- పూర్తి ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ సెక్షనుగా అవతరించిన ఘజియాబాద్-పీటీ- దీన్ దయాళ్ ఉపాధ్యాయ సెక్షన్ (762 కి.మీ)

- ఉత్తర మధ్య రైల్వేలో ఈ ఆర్థిక సంవత్సరం 30 డిసెంబర్ 2022 వరకు 139.42 ఆర్.కె.ఎం.ల ఆటో సిగ్నలింగ్ కమీషన్ చేయబడింది

- రైలు ఆపరేషన్‌లో డిజిటల్ టెక్నాలజీల ప్రయోజనాలను పొందేందుకు మరియు భద్రతను పెంపొందించడానికి ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌ విధానాన్ని పెద్ద ఎత్తున అవలంబిస్తున్నారు.

Posted On: 05 JAN 2023 12:17PM by PIB Hyderabad

భారతీయ రైల్వేలో ప్రస్తుత అధిక సాంద్రత గల మార్గాలలో మరిన్ని రైళ్లను నడపడానికి.. లైన్ సామర్థ్యాన్ని పెంచడానికి ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ (ఏబీఎస్) తక్కువ ఖర్చుతో కూడుకున్న పరిష్కారం. దీంతో భారతీయ రైల్వే మిషన్ మోడ్‌లో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్‌ వ్యవస్థను అమలు చేస్తోంది. 2022-23లో మొత్తం 268 ఆర్.కె.ఎం.లో ఏబీఎస్ కమీషన్ చేయబడింది.  31.12.2022 నాటికి, ఐఆర్ మీదుగా 3706 రూట్ కి.మీ.లలో ఏబీఎస్ అందించబడింది. ఆటోమేటిక్ సిగ్నలింగ్ అమలుతో, కెపాసిటీ పెరగడం వల్ల మరిన్ని రైలు సేవలు నడిపేందుకు సాధ్యమవుతుంది.  రైలు ఆపరేషన్‌లో డిజిటల్ టెక్నాలజీల ప్రయోజనాలను పొందేందుకు మరియు భద్రతను పెంపొందించడానికి ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌ను పెద్ద ఎత్తున అవలంబిస్తున్నారు. 2022-23లో 347 స్టేషన్లలో ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ విధానం అవలంభించబడింది. ఇప్పటివరకు 2888 స్టేషన్‌లకు 45.5% ఐఆర్ కవర్‌తో 31.12.2022 వరకు ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ అందించబడింది. ఇటీవల, ప్రయాగ్‌రాజ్ డివిజన్‌లోని సాత్ నారైని-రుంధీ-ఫైజుల్లాపూర్ స్టేషన్ సెక్షన్‌లో ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టమ్‌ను ప్రారంభించడంతో, 762 KM పొడవున ఘజియాబాద్-పీటీ. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ సెక్షన్ పూర్తిగా ఆటోమేటెడ్ చేయబడింది. దీంతో ఈ సెక్షన్ భారతీయ రైల్వేలలో పొడవైన ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ విభాగంగా మారింది.

***



(Release ID: 1889011) Visitor Counter : 124