ఆర్థిక మంత్రిత్వ శాఖ
త్రిపురలో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడం కోసం $ 220 మిలియన్ రుణ ఒప్పందంపై సంతకాలు చేసిన ఎడిబి, భారత్
Posted On:
03 JAN 2023 7:55PM by PIB Hyderabad
త్రిపురలో ఇంధన భద్రత, నాణ్యత కలిగిన సరఫరా, సామర్ధ్యం, విద్యుత్ రంగం స్థితిస్థాపకతను మెరుగుపరిచేందుకు భారత ప్రభుత్వం మంగళవారంనాడు ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఎడిబి)తో $ 220 మిలియన్ల రుణం కోసం ఒప్పందంపై సంతకాలు చేశాయి. త్రిపుర విద్యుత్ పంపిణీని బలోపేతం చేయడం, ఉత్పత్తి సామర్ధ్యాన్ని మెరుగుపరిచే ప్రాజెక్టుపై సంతకాలు చేసిన వారిలో భారత ప్రభుత్వం తరుఫున ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్ధిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి శ్రీ రజత్ కుమార్ మిశ్రా, ఎడిబి తరుఫున ఎడిబి ఇండియా రెసిడెంట్ మిషన్ ఆఫీసర్ ఇన్‌ఛార్జి్ హో యున్ జాంగ్ ఉన్నారు.
రుణ ఒప్పందంపై సంతకాలు చేసిన అనంతరం మాట్లాడుతూ, అసమర్ధ విద్యుత్ ప్లాంట్ల స్థానంలో కొత్త వాటి ఏర్పాటు, పంపిణీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం, ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచడానికి తోడ్పడేందుకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, పంపిణీలో నష్టాలను తగ్గించడం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసేందుకు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడం ద్వారా తన విద్యుత్ రంగాన్ని బలోపతం చేసేందుకు త్రిపుర ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ ప్రాజెక్టు తోడ్పడుతుందని శ్రీ మిశ్రా పేర్కొన్నారు.
ఇంధన పొదుపు ద్వారా హరిత గృహ వాయు ఉద్గారాలను తగ్గించడం, రాష్ట్ర విద్యుత్ పంపిణీ నెట్‌వర్క్‌ను ఆధునీకరించడం, వ్యవస్థాగత సామర్ధ్యాన్ని , ప్రాజెక్టు అమలు ఏజెన్సీల మొత్తం వ్యాపార ప్రక్రియను నిర్మించిడం ద్వారా రోఖియా విద్యుత్ ప్లాంట్ స్థానంలో అత్యంత సమర్ధవంతమైన కంబైన్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రాజెక్టు నిధులను సమకూరుస్తుందని జియాంగ్ అన్నారు. ఇది జెండర్, సామాజికంగా కలుపుకుపోయే పని ప్రదేశ ఆచరణల పై పైలెట్ టెస్టింగ్ ద్వారా జెండర్ సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది. రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర రంగాలలోని గ్రామీణ పేదలు, మహిళల సామాజిక- ఆర్థిక సాధికారత లక్ష్యంగా త్రిపుర గ్రామీణ ఉపాధి మిషన్ కింద 15 ఎంపిక చేసిన మహిళా స్వయం సహాయక బృందాలకు ప్రాజెక్టు మద్దతును అందించనుంది.
ఆధారపడదగిన, విశ్వసనీయ విద్యుత్ సరఫరా అన్నది పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర సామాజిక సేవలలో పరిస్థితులను మెరుగుపరిచేందుకు, సామాజిక ఆర్ధిక ప్రయోజనాలకు మెరుగైన పరిస్థితులను కల్పిస్తుంది. సంభావ్య పర్యావరణ మార్పు ప్రమాదాలను తట్టుకునేలా చేయడంలో తోడ్పడడం కోసం భారీ వర్షపాతం, మెరుపులు, తుఫానులను, వేగంగా వీచే గాలులను తట్టుకునేలా ఈ ప్రాజెక్టు కాంపొనెంట్లను రూపొందించనున్నారు. ప్రాజెక్టు అమలు కాలంలో రహదారి ప్రారంభాలను కనిష్టం చేసి, సామాజిక- పర్యావరణ ప్రభాలను తగ్గించేందుకు హారిజాంటల్ డైరెక్షనల్ డ్రిల్లింగ్ మెథడ్ (క్షితిత సమాంతర దిశాత్మక తవ్వకాల పద్ధతి) లేదా సొరంగాల పద్ధతి లో భూగర్భ కేబులింగ్ ఏర్పాటు ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది.
***
.
(Release ID: 1888684)
Visitor Counter : 130