బొగ్గు మంత్రిత్వ శాఖ

ఏప్రిల్ - డిసెంబ‌ర్ 2022 నాటికి 16.39% పెరుగుద‌ల‌తో 607.97 మిలియ‌న్ ట‌న్నుల‌ను చేరుకున్న బొగ్గు ఉత్ప‌త్తి


ఉత్ప‌త్తిలో 15.82% పెరుగుద‌ల‌ను సాధించిన కోల్ ఇండియా

81.70 మిలియ‌న్ ట‌న్నుల బొగ్గును ఉత్ప‌త్తి చేసిన కాప్టివ్ / ఇత‌ర కంపెనీలు

ర‌వాణా సామ‌ర్ధ్యాన్ని పెంచేందుకు రైలు అనుసంధాన‌త‌ను పెంచేందుకు చ‌ర్య‌లు తీసుకున్న బొగ్గు మంత్రిత్వ శాఖ

Posted On: 03 JAN 2023 10:18AM by PIB Hyderabad

భార‌త బొగ్గు ఉత్ప‌త్తి ఆర్థిక సంవ‌త్స‌రం 22లో సాధించిన 522.34 మెట్రిక్ ట‌న్నుల ఉత్ప‌త్తితో పోలిస్తే ఏప్రిల్ -డిసెంబ‌ర్ 22లో 607.97 మిలియ‌న్‌ ట‌న్నుల‌ను ఉత్ప‌త్తి చేసి గ‌ణ‌నీయంగా 16.39% పెరుగుద‌ల‌ను చూపింది.  ఆర్థిక సంవ‌త్స‌రం 22లో ఉత్ప‌త్తి చేసిన 413.63 మిలియ‌న్‌ ట‌న్నుల బొగ్గు ఉత్ప‌త్తితో పోలిస్తే డిసెంబర్ 22 నాటికి 479.05 మిలియ‌న్ ట‌న్నుల‌ను ఉత్ప‌త్తి చేసి 15.82% పెరుగుద‌ల‌ను చూపిన‌ట్టు సిఐఎల్ పేర్కొంది. 
క్యాప్టివ్ కోల్ బ్లాకులు (యాజ‌మాన్యాల కోసమే బొగ్గును ఉత్ప‌త్తి చేసే బ్లాకులు) మైనింగ్ సామ‌ర్ధ్యాల‌ను మ‌రింత‌గా ఉప‌యోగించుకుని అద‌న‌పు బొగ్గును మార్కెట్‌లోకి విడుద‌ల చేసేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ మార్గం సుగ‌మం చేయ‌డంతో కాప్టివ్‌, ఇత‌ర కంపెనీల బొగ్గు ఉత్ప‌త్తి ఆర్ధిక సంవ‌త్స‌రం 22లో ఉత్ప‌త్తి చేసిన 62.19 మిలియ‌న్‌ ట‌న్నుల‌తో పోలిస్తే ఏప్రిల్ - డిసెంబ‌ర్ 22లో 81.70 మిలియ‌న్‌ ట‌న్నుల‌ను ఉత్ప‌త్తి చేసి 31.38% పెరుగుద‌ల‌ను చూపింది.  
ప్లాంట్లు పూర్తి అవ‌స‌రాల‌ను తీర్చుకున్న త‌ర్వాత మొత్తం అద‌న‌పు ఉత్ప‌త్తిలో 50% బొగ్గు/  లిగ్నైట్‌ను విక్ర‌యించేందుకు కాప్టివ్ గ‌నుల‌ను లీజుకు తీసుకున్న‌వారికి అనుమ‌తి ఇచ్చేందుకు మంత్రిత్వ శాఖ ఎంఎండిఆర్ (స‌వ‌ర‌ణ‌) చ‌ట్టం, 2021 కింద ఖ‌నిజాల రాయితీ (స‌వ‌ర‌ణ‌) నిబంధ‌న‌లను కూడా స‌వ‌రించింది. 
పిఎం గ‌తి శ‌క్తి కింద గ‌ల ప్ర‌ధాన గ‌నుల‌లో ఉత్ప‌త్తిని త్వ‌రిత‌గ‌తిన త‌ర‌లించేందుకు రైలు అనుసంధాన మౌలిక స‌దుపాయాల‌ను పెంచేందుకు మంత్రిత్వ శాఖ చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఫ‌లితంగా, ఆర్ధిక సంవ‌త్స‌రంలో అదే కాలంలో త‌ర‌లించిన 594.22 మిలియ‌న్ ట‌న్నుల‌తో పోలిస్తే ఏప్రిల్ -డిసెంబ‌ర్ 22లో 637.51 మిలియ‌న్ ట‌న్నుల వ‌ర‌కు మొత్తం బొగ్గును బ‌ట్వాడా చేసింది. దేశంలో వివిధ రంగాల‌కు త‌గినంత బొగ్గు బ‌ట్వాడాను స్థిరంగా పంపుతున్నందుకు సంకేతంగా 7.28% పెరుగుదల‌ను చూపింది. 
బొగ్గు ఉత్పత్తి సామ‌ర్ధ్యాల‌ను పెంచాల‌న్న ల‌క్ష్యంతో, బొగ్గు మంత్రిత్వ శాఖ 141 నూత‌న బొగ్గు బ్లాకుల‌ను వాణిజ్య వేలానికి సిద్ధం చేయ‌డ‌మే కాకుండా, దేశంలో  వివిధ బొగ్గు కంపెనీల‌తో క్ర‌మం త‌ప్ప‌కుండా చ‌ర్చిస్తూ, వారి ఉత్ప‌త్తిని స‌మీక్షిస్తోంది. దేశీయ ఉత్ప‌త్తిని, బ‌ట్వాడాను పెంచేందుకు అన్ని ర‌కాలుగా చేసిన  కృషి చాలా మంచి ఫ‌లితాల‌ను ఇచ్చింది. 

***
 



(Release ID: 1888376) Visitor Counter : 134