భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఢిల్లీలో అందుబాటులోకి మరో 50 ఎలక్ట్రిక్ బస్సులు


కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఫేమ్ ఇండియా ఫేజ్ II పథకం మద్దతుతో అందుబాటులోకి

Posted On: 02 JAN 2023 4:51PM by PIB Hyderabad

కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఐప్రారంభించిన ఫేమ్ II పథకం కింద   నగరాలుఎస్టీయులుఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 3,538 ఎలక్ట్రిక్ బస్సుల కోసం సరఫరాకు ఆర్డరు చేశాయని  కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే తెలిపారుఈ ఆర్డరు చేసిన మొత్తం 3,538 ఎలక్ట్రిక్ బస్సులలో జనవరి 2023 నాటికి మొత్తం 1,716 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయని వివరించారుఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం కోసం 400 ఎలక్ట్రిక్ బస్సులుఇంట్రా సిటీ కార్యకలాపాల కోసం ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్  కార్పొరేషన్ (డీటీసీ)కి 300 ఎలక్ట్రిక్ బస్సులు మరియు చివరి మైల్ కనెక్టివిటీ కోసం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ)కి 100 ఎలక్ట్రిక్ బస్సులు ఆగస్టు 2019 నెలలో మంజూరు చేయబడ్డాయిజనవరి 15, 2020లోగా సరఫరా ఆర్డర్లను అందించాలని కోరుతూ విజయవంతమైన బిడ్డర్లకు డీఎంఆర్సీ, డిసెంబర్ 2019లో సరఫరా ఆర్డర్ ను జారీ చేసిందిఅయితే ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీమార్చి 2021లో మాత్రమే సరఫరా ఆర్డర్ ను జారీ  చేసిందిడీటీసీకి ఈ తరహా బస్సుల అందుబాటు సులభతరం చేయడానికి గాను ఎంహెచ్ఐ ఢిల్లీకి కాలుష్య రహిత ప్రపంచ స్థాయి రవాణా వ్యవస్థను అందించడానికి ప్రత్యేక సందర్భంలో డీటీసీ 31 మార్చి 2021 నాటికి సరఫరా ఆర్డర్ యొక్క చివరి తేదీని పొడిగించింది.

డీటీసీ మొత్తం 250 బస్సులు ఇప్పటికే అందుబాటులోకి తేవడం జరిగింది. తాజాగా మిగిలిన 50 బస్సుల్ని ప్రారంభించబడ్డాయి.డీటీసీకి 300 ఎలక్ట్రిక్ బస్సులను అందించడానికి ఎంహెచ్ఐ  నిబద్ధత నెరవేరింది ఈ 300 ఎలక్ట్రిక్ బస్సుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా డీటీసీకి రూ.165 కోట్ల మొత్తాన్ని అందించింది.

 

*****



(Release ID: 1888195) Visitor Counter : 188


Read this release in: English , Urdu , Hindi , Tamil