బొగ్గు మంత్రిత్వ శాఖ
పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వ రంగ బొగ్గు/లిగ్నైట్ సంస్థలు
Posted On:
02 JAN 2023 4:44PM by PIB Hyderabad
పర్యావరణ సమతుల్యాన్ని రక్షించి ప్రజలు, ప్రకృతి, అడవులు, వన్యప్రాణుల మధ్య సంబంధ బాంధవ్యాలు కల్పించేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ ఎకో పార్కులను అభివృద్ధి చేస్తోంది. నిక్షేపాలు పూర్తిగా అడుగంటి పోవడంతో మైనింగ్ కి పనికిరాకుండా పోయిన ప్రాంతాలను ఎకో పార్కులు, వాటర్ స్పోర్ట్స్ కేంద్రాలు, భూగర్భ మైన్ పర్యాటక ప్రాంతాలు, సహస పర్యాటక కేంద్రాలు, పక్షులను వీక్షించే ప్రాంతాలుగా అభివృద్ధి చేయడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రణాళిక రూపొందించింది. ఈ కేంద్రాల ద్వారా ఆదాయం ఆర్జించడానికి, ప్రజలకు వినోదం కల్పించడానికి, స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడానికి అవకాశం ఉందని పర్యాటక శాఖ గుర్తించింది.
ఎకో పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా మధ్యప్రదేశ్‌లో రెండు ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది. సింగ్రౌలీలో ముద్వానీ డ్యామ్ ఎకో-పార్క్ ను నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్, డోలలో అనన్యవాటికా ఎకో-రిస్టోరేషన్ పార్క్ కమ్ పిట్ లేక్ ను సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ అభివృద్ధి చేశాయి.
Entrance of Mudwani Dam Eco-Park
Walkways in Mudwani Dam Eco-Park
సింగ్రౌలి లోని ముద్వానీ డ్యామ్ ఎకో-పార్క్ 84,000మీ2 విస్తీర్ణంలో విస్తరించి ఉంది. వృక్షరోపన్ అభియాన్ 2021 సందర్భంగా పార్కును ప్రారంభించారు. ప్రకృతి అందాలకు నెలవైన ముద్వానీ డ్యామ్ ఎకో-పార్క్ ప్రశాంతమైన ప్రదేశం. అయితే, ఇది నగరానికి దగ్గరగా ఉంది. జయంత్ ప్రాంతంలో ముద్వాని డ్యామ్ ఎకో-పార్క్ ఏర్పాటయింది. అందమైన వాటర్ ఫ్రంట్, నడక ప్రాంతాలు , పిల్లల క్రీడల ప్రాంతం, రెస్టారెంట్లు మరియు స్థానిక ఉత్పత్తుల దుకాణాలు కూడా ఈ ఎకో-పార్క్‌లో భాగంగా ఏర్పాటయ్యాయి. పార్క్‌లో విశ్రాంతి మరియు సౌకర్యం కోసం సరస్సు పక్కన అన్ని సౌకర్యాలతో ఒక ప్రాంతం అభివృద్ధి చేయబడింది. ముద్వానీ డ్యామ్ ఎకో పార్కును ఏటా సగటున 25,000 మంది సందర్శిస్తున్నారు. గాలిని శుద్ధి చేయడం, కాలుష్య నివారణ, నేల కోతను నివారించడం, పర్యావరణ అభివృద్ధికి ముద్వానీ డ్యామ్ ఎకో పార్క్ సహాయపడుతుంది
మధ్యప్రదేశ్‌లోని డోలాలో ఉన్న రాజ్‌నగర్ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్ సెక్టార్ "D" లో పాడుబడిన OB డంప్‌ను పునరుద్ధరించి "అనన్యవాటికా" ఎకో-రిస్టోరేషన్ పార్క్ కమ్ పిట్ లేక్ అభివృద్ధి చేయబడింది. 50 ఎకరాల విస్తీర్ణంలో పిట్-లేక్/వాటర్ బాడీ మరియు 6 ఎకరాల విస్తీర్ణంలో తోట ఉంది. ఓపెన్ కాస్ట్ మైనింగ్ ప్రాజెక్ట్‌లో పునరుద్ధరణ మరియు స్థిరమైన అభివృద్ధికి ఇది ఉత్తమ ఉదాహరణలలో ఒకటి. ఈ పార్క్‌లో మామిడి, మందారం, అలంకారమైన తాటి, తీపి నిమ్మ, దానిమ్మ, పియర్, గూస్‌బెర్రీ, బెర్రీలు, రేగు, వెదురు మరియు ఇతర మూలికా మొక్కలు ఉన్నాయి.
ఎకో పార్క్ అభివృద్ధి చెందుతున్న వృక్షజాలం తో ఈ ప్రాంతం పర్యావరణ పునరుద్ధరణ సాధ్యమయ్యింది. వలస వచ్చే సైబీరియన్ క్రేన్‌ల వంటి విదేశీ పక్షులను ఆశ్రయం ఇస్తున్న పార్కు భూమి జీవ పునరుద్ధరణ మరియు నేల-స్థిరీకరణ సాధ్యం చేసింది.
Glimpse of AnanyaVatika Eco-Park
Pit lake of AnanyaVatika Eco-Park
***
(Release ID: 1888181)
Visitor Counter : 223