రక్షణ మంత్రిత్వ శాఖ
ఐఏఎఫ్ పశ్చిమ వైమానిక స్థావరం కమాండ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎయిర్ మార్షల్ పంకజ్ మోహన్ సిన్హా
Posted On:
01 JAN 2023 1:11PM by PIB Hyderabad
భారత వైమానిక దళం పశ్చిమ వైమానిక స్థావరం కమాండ్‌గా ఎయిర్ మార్షల్ పంకజ్ మోహన్ సిన్హా 2023 జనవరి 01వ తేదీన బాధ్యతలు స్వీకరించారు.
ఆయన, పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. జూన్ 1985లో ఫైటర్ పైలట్‌గా ఐఏఎఫ్‌లోకి అడుగు పెట్టారు. వెల్లింగ్టన్‌లోని ప్రతిష్టాత్మక డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కళాశాల పూర్వ విద్యార్థి. అనుభవజ్ఞుడైన ఫైటర్ పైలట్, కేటగిరీ 'ఎ' అర్హత గల వైమానిక శిక్షకుడు, ఫైటర్ స్ట్రైకర్ నాయకుడు, పరిశీలకుడు. ఎయిర్ మార్షల్ సిన్హాకు 4500 గంటలకు పైగా వైమానిక అనుభవం ఉంది.
37 సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న ఉద్యోగ బాధ్యతల్లో కమాండ్, సిబ్బంది నియామకాల సేవలు నిర్వహించారు. వీరిలో ఫైటర్ స్క్వాడ్రన్ కమాండింగ్ ఆఫీసర్, వైమానిక స్థావరంలో ముఖ్య శిక్షకుడు (వైమానిక), యూకేలోని రాయల్ ఎయిర్‌ఫోర్స్ వ్యాలీలో శిక్షణ సమన్వయ అధికారిగా ఉన్నారు, అక్కడ హాక్ విమానాన్ని నడిపారు, వైమానిక దళ ప్రధాన కార్యాలయంలో ప్రిన్సిపల్ డైరెక్టర్ పర్సనల్ ఆఫీసర్‌గా, ప్రతిష్టాత్మక ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌కు ఎయిర్ అసిస్టెంట్‌గా, వైమానిక దళ ప్రధాన కార్యాలయంలో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఆపరేషన్స్‌గా (ప్రతి దాడులు) సేవలు అందించారు. ప్రస్తుత బాధ్యతలు చేపట్టడానికి ముందు వైమానిక దళ ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్ జనరల్ ఎయిర్ ఆపరేషన్స్‌గా ఉన్నారు.
'విశిష్ట సేవ పతకం', 'అతి విశిష్ట సేవ పతకం' గ్రహీత ఎయిర్ మార్షల్ పంకజ్ మోహన్ సిన్హా.
ఐఏఎఫ్‌లో 39 ఏళ్లకు పైగా విశేష సేవలందించి, 31 డిసెంబర్ 2022న పదవీ విరమణ చేసిన ఎయిర్ మార్షల్ ఎస్.ప్రభాకరన్ స్థానంలో ఎయిర్ మార్షల్ పంకజ్ మోహన్ సిన్హా నియమితులయ్యారు.
****
(Release ID: 1887989)
Visitor Counter : 270