శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోల్ కతాలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీని సందర్శించిన కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్; వ్యాధి నివారణ మీద పరిశోధనలకు పిలుపు


భారత ఆరోగ్య రంగాన్ని భవిష్యత్తుకు సిద్ధం చేసిన ఘనత ఎనిమిదిన్నరేళ్ళ మోదీ ప్రభుత్వ చర్యలదేనన్న మంత్రి

కలరాకు నోటిద్వారా అందించే టీకా, గాస్ట్రిక్ అల్సర్ నియంత్రణకు హెర్బల్ ఉత్పత్తులు, హార్మోన్ సంబంధిత వ్యాధుల నిర్థారణకు కిట్, పార్కిన్సన్స్ వ్యాధి త్వరగా కనిపెట్టే పరికరాలు ఐఐసీబి ఘనతే: మంత్రి

Posted On: 30 DEC 2022 4:26PM by PIB Hyderabad

సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి ( స్వయం ప్రతిపత్తి), ఎర్త్ సైన్సెస్ సహాయ మంత్రి ( స్వయం ప్రతిపత్తి), పీఎంవో, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణు విద్యుత్, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్  ఈ రోజు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ ని సందర్శించారు. 1935 లో ఏర్పాటైన ఈ సంస్థలో పనిచేసే శాస్త్రవేత్తలు, పరిశోధకులు రోగ నిరోధక దిశగా పరిశోధనలు సాగించాలని పిలుపునిచ్చారు. చిన్న వయసులోనే వస్తున్న జీవ ప్రక్రియ వ్యాధులైన టైప్ 2  మధుమేహం లాంటివి ఆపగలిగితే  దేశ నిర్మాణానికి యువతను పెద్ద సంఖ్యలో అందించగలుగుతామన్నారు. 

2014 నుంచి మోదీ ప్రభుత్వానికి ఆరోగ్య రంగం చాలా కీలకమైన శాఖగా మారిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. గత ఎనిమిదిన్నరేళ్లలో తీసుకున్న అనేక చర్యల కారణంగా భారా ఆరోగ్య రంగం భవిష్యత్తుకు తగినట్టు సిద్ధమైందన్నారు.  చికిత్సతోబాటు బాగోగుల మీద కూడా ప్రభుత్వం శ్రద్ధ చూపుతోందని మంత్రి గుర్తు చేశారు. అనారోగ్యానికి కారణాలను తొలగించటం ద్వారా చికిత్స దాకా పరిస్థితి రాకుండా జాగ్రత్త పడుతోందన్నారు.  

జీవ వైద్య పరిశోధనా సంస్థగా భారతదేశంలో 1935 లోనే ఏర్పాటైన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ సంస్థ 1956 నాటికల్లా సి ఎస్ ఐ ఆర్ పరిధిలోకి రావటం హర్షించదగిన విషయమన్నారు.  వివిధ వ్యాధుల మూల కారణాలను కనిపెట్టటంలో, వాటికి ఔషధాలు తయారు చేయటంలో కీలకపాత్ర పోషించిందన్నారు.    

కలరాకు నోటి ద్వారా అందే టీకా మందు తయారీలోనూ,  గాస్ట్రిక్ అల్సర్ నియంత్రణకు హెర్బల్ మందుల తయారీలోనూ, హార్మోన్ సంబంధిత వ్యాధుల నిర్థారణకు కిట్, పార్కిన్సన్స్ వ్యాధి త్వరగా కనిపెట్టే పరికరాలు కూడా ఐఐసీబి ఘనతేనని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సి ఎస్ ఐ ఆర్- ఐ ఐ సెబీ ప్రధాన బలం బయోమెడికల్ పరిశోధనే అయినప్పటికీ  గడిచిన ఎనిమిదేళ్ళ కాలంలో లక్ష్యం ఆధారిత పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వటం ద్వారా వాణిజ్య పరంగా వినియోగానికి పనిచేసిందన్నారు. 

ఇన్ఫెక్షన్ సోకే కలరా, మలేరియా తదితర వ్యాధులమీద పరిశోధన కోసం సి ఎస్ ఐ ఆర్ – ఐ ఐ సీ బీ ఏర్పాటైనప్పటికీ, క్రమంగా బయోమెడికల్  పరిశోధనలో అత్యాధునిక పరిశోధనవైపు మళ్ళిందన్నారు. అంటూ వ్యాధుల మీద ప్రధానంగా దృష్టి సారిస్తూ వాటి మూల కారణాలను అధ్యయనం చేయగలిగిందని రోగ నిరోధక వ్యవస్థను, కాన్సర్, జీవ ప్రక్రియకు  సంబంధించిన వ్యాధులను , మధుమేహాన్ని, కాలేయ వ్యాధులను పరిశోధనాంశాలుగా మార్చుకుందని అన్నారు.

కరోనా సంక్షోభం మొదలైనప్పటినుంచీ దానిమీద పోరులో చేరి ఐఐసిబీ పోషించిన పాత్రను కూడా మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు. కోవిడ పరీక్షలు, జీనోమ్ సీక్వెన్సింగ్, ప్లాస్మా థెరపీ పరీక్షలలో కూడా ఎంతగానో సహాయపడిందన్నారు. ఔషధాల తయారీ, యాంటీవైరల్ మిషన్ ను మార్పు చేయటం దాకా సి ఎస్ ఐ ఆర్ కృషిలో ఐఐసీబీ శాస్త్రవేత్తలు పాలుపంచుకోవటాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు.

ఐఐసీబీ మధ్య కలకత్తాలో ఒక చిన్న ఇంట్లో మొదలైంది. 1935 లో  దాని పేరు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గా ఉండేది. డాక్టర్  జేసీ రే, ఆయన సహ వైద్యులు హెచ్  ఎన్ ఘోష్, ఏసీ ఉకిల్, నబజీబన్ బెనర్జీ  ఏర్పాటు చేశారు.   బయోమెడికల్  సైన్స్ మీద పరిశోధన ఈ సంస్థ లక్ష్యం.  దేశ ఆరోగ్య సమస్యను శోధించాల్సిన అవసరం లేదు.

ఇది మొట్టమొదటి అనధికార వైద్య పరిశోధనా సంస్థ. కొద్ది మొత్తంలో వచ్చే  ప్రైవేట్ విరాళాలు మాత్రమే ఆధారం. రబీంద్రనాథ్ టాగూర్. మదన్ మోహన్ మాలవ్యా, సర్ సీవీ రామన్, ఆచార్య పీసీ రాయ్, డాక్టర్ బిధన్ చంద్ర రాయ్  లాంటి  పేరుమోసిన ప్రముఖుల మద్దతు ఉండేది.

వైద్య పరిశోధనకు అలాంటి కేంద్రాన్ని ఏర్పాటు చేయటం తగినన్ని ప్రజా విరాళాలతో మాత్రమే సాధ్యమంటూ రబీంద్రనాథ్ టాగూర్ ప్రజలకు పిలుపునిచ్చారు. దీనికి సాయం చేయటానికి సాటి పౌరులందరూ ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆచార్య పీసీ రాయ్ కూడా సంపన్నులు ఉదారంగా ఈ సంస్థకు  సాయం చేయాలని విన్నవించారు.

ప్రస్తుతం సి ఎస్ ఐ ఆర్ – ఐ ఐ సీ బీ కి రెండు కాంపస్ లు ఉన్నాయి. మెయిన్ కాంపస్ జాదవ్ పూర్ లో ఉండగా, రెండో కాంపస్ సాల్ట్ లేక దగ్గర ఉంది. సాల్ట్ లేక్  కాంపస్ 2016 ఫిబ్రవరిలో ఏర్పాటయింది.

***


(Release ID: 1887761) Visitor Counter : 173
Read this release in: English , Urdu , Hindi , Bengali