రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా ఉన్న 9000 ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాల (పిఎంకెఎస్ కె) కు చెందిన రైతులు , రిటైలర్ లతో వర్చువల్ గా సంభాషించిన కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
"వ్యవసాయ సంబంధిత అన్ని కార్యకలాపాలకు నోడల్ పాయింట్ గా పని చేస్తున్న పిఎంకెఎస్ కె లు; రైతులు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలను అధిగమించడంలో ప్రధాన వేదిక కానున్న పిఎంకెఎస్ కె లు‘‘
వివిధ ప్రభుత్వ పథకాలపై రైతులకు అవగాహన కల్పన: రిటైలర్ల నిరంతర సామర్ధ్యం పెంపు: డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
" మన రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది; ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం ఉన్నప్పటికీ, అధిక సబ్సిడీ ధరలపై ఎరువుల లభ్యత ‘‘
Posted On:
29 DEC 2022 4:44PM by PIB Hyderabad
“'రైతుల ప్రయోజనాల దృష్ట్యా భారత ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు తీసుకుంటోంది. అటువంటి ముఖ్యమైన చర్యలో, ఎరువుల రిటైల్ దుకాణాలను ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు (పిఎంకెఎస్ కె ) గా మార్చడం జరిగింది
ఈ పిఎంకెఎస్ కెలు వ్యవసాయ సంబంధిత అన్ని కార్యకలాపాలకు నోడల్ పాయింట్ గా పనిచేస్తాయి. ఇంకా, తాజా ఆవిష్కరణలు, ఉత్తమ పద్ధతులు, విజ్ఞానం, పద్ధతులు , పరీక్షలను వ్యాప్తి చేస్తాయి, ఇవి రైతులకు వారి ఉత్పాదకతను పెంచడమే కాకుండా ఉత్పత్తి ఖర్చును తగ్గించడానికి కూడా సహాయపడతాయి. రైతుల కోసం శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించడమే మా లక్ష్యం. పిఎంకెఎస్ కెల చర్య మన రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఇంకా భారతదేశ ఆహార భద్రత ,వృద్ధి కథలో ఒక ముఖ్యమైన దశగా పనిచేస్తుంది " అని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా అన్నారు. దేశవ్యాప్తంగా 9000 పిఎంకెఎస్ ల రైతులను ఉద్దేశించి డాక్టర్ మన్సుఖ్ మాండవియా వర్చువల్ గా సంభాషించారు. రామ్ నగర్ (ఉత్తరప్రదేశ్), కోటా (రాజస్థాన్), దేవాస్ (మధ్యప్రదేశ్), వడోదర (గుజరాత్), ఏలూరు (ఆంధ్రప్రదేశ్), రాజపుర (పంజాబ్) మొదలైన ఆరు రాష్ట్రాలకు చెందిన పిఎంకెఎస్ కె రైతులు, రిటైలర్లతో కూడా ఆయన సంభాషించారు
డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పోస్ట్ చేసిన ట్వీట్ నుండి ఈ సంభాషణ వివరాలు చూడవచ్చు.
ఈ సందర్భంగా డాక్టర్ మాండవీయ మాట్లాడుతూ, "దూరదృష్టి గల గౌరవ ప్రధాన మంత్రి నాయకత్వంలో భారత ప్రభుత్వం మన రైతులకు ఉపయోగపడే సాధ్యమైన ప్రతి చర్యను తీసుకోవడానికి కట్టుబడి ఉంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి వంటి కార్యక్రమాల ద్వారా ఆర్థిక సహాయం కావచ్చు లేదా నానో యూరియా, ప్రత్యామ్నాయ ఎరువుల కొత్త శాస్త్రీయ ఆవిష్కరణల ద్వారా విస్తృత శ్రేణి చర్యలు తీసుకోబడుతున్నాయి. వ్యవసాయంలో కీలక పాత్ర పోషించే ఎరువుల లభ్యత ప్రభుత్వ అగ్ర ప్రాధాన్యతగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం ఉన్నప్పటికీ, ప్రభుత్వం అధిక సబ్సిడీ రేట్లకు ఎరువులను అందిస్తోంది. దేశంలో ఎరువుల లభ్యతలో ప్రతి ప్రక్రియను రైతుల సౌలభ్యం దిశగా పటిష్టం చేస్తున్నామని చెప్పారు.
పిఎమ్ కెఎస్ కెల ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, "పిఎమ్ కెఎస్ కెలను తెరవడం ఒక ప్రధాన అడుగు, ఇది రైతుల వివిధ రకాల అవసరాలను తీర్చడానికి సహాయపడుతుంది, వ్యవసాయ ఇన్ పుట్స్ (ఎరువులు, విత్తనాలు పురుగుమందులు) ఇంకా మట్టి, విత్తనాలు ,ఎరువుల కోసం పరీక్షా సౌకర్యాలు అందించడంలో ఇది సహాయపడుతుంది. ఇవి రైతులకు అవగాహన కల్పిస్తాయి, వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తాయి. బ్లాక్ / జిల్లా స్థాయి అవుట్ లెట్ లలో రిటైలర్ల సామర్థ్యాన్ని నిరంతరం పెంచుతాయి" అని ఆయన అన్నారు.
దేశంలోని సుమారు 2,62,559 క్రియాశీల రిటైల్ దుకాణాలను దశలవారీగా పిఎంకెఎస్ కె లుగా మారుస్తామని డాక్టర్ మాండవీయ చెప్పారు. "ఈ మార్పిడి ప్రక్రియ పిఎంకెఎస్ కె ల ద్వారా విస్తృత శ్రేణి ఉత్పత్తులు, సౌకర్యాలు దేశంలోని రైతులందరికీ చేరేలా చేస్తుంది. దీనితో పిఎంకెఎస్ కె లు భవిష్యత్తులో రైతులకు ఒక ప్రధాన వేదికగా నిలుస్తాయి. ఇది రైతులు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలను అధిగమించడానికి , వారి ఆందోళనలను సాధ్యమైనంత తక్కువ సమయంలో పరిష్కరించడానికి సహాయపడుతుంది‘‘ అని ఆయన చెప్పారు.
శాస్త్రీయ సమాజం సేవలను ప్రశంసిస్తూ, "భారతదేశం అనేక ప్రత్యామ్నాయ పరిష్కారాలను అభివృద్ధి చేస్తోంది, ఇవి రైతులకు స్నేహపూర్వకంగా ఉండటమే కాకుండా ఉత్పత్తి స్థాయి పరంగా, పర్యావరణ హితంగా కూడా మెరుగ్గా ఉంటాయి." అని డాక్టర్ మాండవీయ అన్నారు. రాబోయే రోజుల్లో నానో డిఎపికి కూడా ఆమోదం లభిస్తుందని, ఇది సాంప్రదాయ డిఎపి కంటే మెరుగైన ప్రత్యామ్నాయం అని ఆయన హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగంలో ఈ ఆవిష్కరణలకు గానూ శాస్త్రవేత్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ వినూత్న ఎరువులను,, సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించాలని రైతులను కోరారు.
ప్రభుత్వం తీసుకుంటున్న వినూత్న చర్యలకు గానూ రైతులు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాక, ఒకే చోట బహుళ వ్యవసాయ ఉపకరణాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయని, ఇది రైతుల సమయాన్ని ఆదా చేస్తోందని, ఇప్పుడు వ్యవసాయ భూమిలో ఎక్కువ సమయాన్ని కేటాయించగలుగుతున్నామని రైతులు తెలియజేశారు. పిఎంకెఎస్ కె లలో పంట సమాచారం లభ్యత, భూసార పరీక్షా సౌకర్యాలు ,ఇతర ప్రభుత్వ పథకాల సమాచారం గురించి రైతులు వివరించారు. ఎక్కువ మంది రైతులు ఇప్పుడు ఎరువులు ,పురుగుమందుల వాడకం కోసం డ్రోన్లను ఉపయోగిస్తున్నారని, ఇది వారి డబ్బును, వారి విలువైన సమయాన్ని కూడా ఆదా చేస్తుందని రిటైలర్లు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎరువుల శాఖ కార్యదర్శి శ్రీ అరుణ్ సింఘాల్, అదనపు కార్యదర్శి శ్రీమతి నీరజ ఆదిదం, మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
****
(Release ID: 1887399)
Visitor Counter : 629