కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
గ్రామీణ తపాలా సేవకుల కోసం 'ఆన్‌లైన్ అభ్యర్థన బదిలీ పోర్టల్'ను ప్రారంభించిన తపాలా శాఖ
Posted On:
28 DEC 2022 6:46PM by PIB Hyderabad
కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని తపాలా శాఖ ఈరోజు గ్రామీణ తపాలా సేవకుల (జీడీఎస్) కోసం 'ఆన్‌లైన్ అభ్యర్థన బదిలీ పోర్టల్'ను ప్రారంభించింది. తపాలా సేవల విభాగం డైరెక్టర్ జనరల్ శ్రీ అలోక్ శర్మ, 23 పోస్టల్ సర్కిళ్ల చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్స్, డిపార్ట్మెంట్ సీనియర్ అధికారుల సమక్షంలో వీడియో వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ పోర్టల్ను ప్రారంభించారు. పోర్టల్ ప్రారంభం సందర్భంగా, జీడీఎస్ నుంచి దరఖాస్తులను కోరే దశ నుండి ఆమోదం, బదిలీ ఉత్తర్వులు జారీ చేసే దశ వరకు మొత్తం బదిలీ ప్రక్రియ ఇప్పుడు కాగిత రహితంగా మార్చబడిందని అన్నారు. మొత్తం ప్రక్రియ మరింతగా సరళీకృతం చేయబడిందని తెలియజేశారు. భారత తపాలా శాఖ భారతదేశం అంతటా 1,56,000 కంటే ఎక్కువ తపాలా కార్యాలయాలను కలిగి ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టాఫీసుల నెట్వర్క్ పోస్ట్స్ డిపార్ట్మెంట్ సొంతం. వీటిలో 1,31,000 కంటే ఎక్కువ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ (బీఓలు) గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి, ఇక్కడ పోస్టల్ సౌకర్యాలు గ్రామీణ తపాలా సేవకుల (జీడీఎస్) ద్వారా అందించబడుతున్నాయి. ఆన్లైన్ అభ్యర్థన బదిలీ పోర్టల్ను ప్రారంభించడం అనేది సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా పాలనా ప్రక్రియలలో మరితం పారదర్శకత మరియు జవాబుదారీతనం తీసుకురావడం దిశగా ఒక పెద్ద ముందడుగు. ఆన్లైన్ ప్రక్రియ సమయం, వనరులను కూడా ఆదా చేస్తుంది. ఆన్లైన్ పోర్టల్ ద్వారా ప్రారంభించిన రోజున ఒకేసారి 5000 కంటే ఎక్కువ జీడీఎస్ బదిలీల ఆమోదించబడినాయి.
***
(Release ID: 1887215)
Visitor Counter : 150