రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి, నమోదిత వాహనాలను డీలర్ల ద్వారా కొనడం, అమ్మడంలో పారదర్శకత కోసం జి.ఎస్‌.ఆర్‌. 901(ఇ) ప్రకటన జారీ

प्रविष्टि तिथि: 28 DEC 2022 10:29AM by PIB Hyderabad

సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి, నమోదిత వాహనాలను డీలర్ల ద్వారా కొనడం, అమ్మడంలో పారదర్శకత కోసం కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, 22 డిసెంబర్ 2022న జి.ఎస్‌.ఆర్‌. 901(ఇ) ప్రకటన జారీ చేసింది.

భారతదేశంలో ప్రి-ఓన్డ్ కార్ల విఫణి క్రమంగా పుంజుకుంది. ప్రి-ఓన్డ్‌ కార్ల క్రయవిక్రయాలతో ముడిపడిన ఆన్‌లైన్ వెబ్‌సైట్లు ఇటీవలి సంవత్సరాలలో పెరగడంతో ఈ విఫణి మరింత ఊపందుకుంది.

వాహనాన్ని మరొక వ్యక్తికి బదిలీ చేసే సమయంలో సమస్యలు, థర్డ్-పార్టీ నష్ట బాధ్యతలకు సంబంధించి వివాదాలు, ఎగవేతదారుల్ని గుర్తించడంలో ఇబ్బంది వంటివి ప్రస్తుత వ్యవస్థ కనిపిస్తున్నాయి.

 కేంద్ర మోటర్ వాహన చట్ట నిబంధనలు- 1989లోని చాప్టర్‌ IIIని మంత్రిత్వ శాఖ సవరించింది. తర్వారా, ప్రి-ఓన్డ్ కార్ విఫణి కోసం సమగ్ర నియంత్రణ వ్యవస్థను రూపొందించింది.

ప్రతిపాదిత నియమాలకు సంబంధించిన ముఖ్యాంశాలు ఇవి:

1. డీలర్ ప్రామాణికతను గుర్తించడానికి నమోదిత వాహనాల డీలర్ల కోసం అధికారిక ధృవీకరణ పత్రాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది

2. నమోదిత యజమాని, డీలర్ మధ్య వాహనం మార్పిడికి సంబంధించిన సంపూర్ణ సమాచారం గురించి వివరించడం

3. నమోదిత వాహనాలను కలిగి ఉన్న డీలర్ అధికారాలు, బాధ్యతలను ఈ నిబంధనల్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది

4. తమ వద్ద ఉన్న మోటారు వాహనాల నమోదు ధృవపత్రం పునరుద్ధరణ/ఫిట్‌నెస్ పత్రం పునరుద్ధరణ, నమోదు ధృవపత్రం ప్రతి, ఎన్‌వోసీ, యాజమాన్యాన్ని బదిలీ చేయడం కోసం దరఖాస్తు చేసుకునే అధికారం డీలర్లకు ఉంది.

5. ఎలక్ట్రిక్‌ వాహనాల విషయంలో, ఆ వాహనం ప్రయాణ ఉద్దేశం, చోదకుడు, సమయం, మైలేజ్ వంటి వివరాలతో ఒక రిజిస్టరును తప్పనిసరిగా నిర్వహించాలి, ఇది ఒక నియంత్రణ చర్య.

నమోదిత వాహనాల మధ్యవర్తులు/డీలర్లను గుర్తించడంలో, వారికి సాధికారత కల్పించడంలో ఈ నియమాలు సాయపడతాయి. ప్రి-ఓన్డ్‌ వాహనాల అమ్మకం లేదా కొనుగోలులో మోసాలకు వ్యతిరేకంగా తగిన రక్షణలు అందిస్తాయి.

గెజిట్ నోటిఫికేషన్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

 

*****


(रिलीज़ आईडी: 1887047) आगंतुक पटल : 205
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Tamil