ఆర్థిక మంత్రిత్వ శాఖ
తమిళనాడులో పట్టణ సేవలను మెరుగుపరచడానికి $ 125 మిలియన్ల రుణంపై సంతకం చేసిన భారతదేశం, ఏడిబి
Posted On:
27 DEC 2022 6:09PM by PIB Hyderabad
తమిళనాడు రాష్ట్రంలోని మూడు నగరాల్లో వాతావరణాన్ని తట్టుకోగలిగే మురుగునీటి సేకరణ మరియు శుద్ధి, డ్రైనేజీ మరియు నీటి సరఫరా వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం మరియు ఆసియా డెవలప్‌మెంట్‌బ్యాంక్ (ఏడిబి) ఈరోజు $125 మిలియన్ల రుణంపై సంతకం చేశాయి.
తమిళనాడు అర్బన్ ఫ్లాగ్‌షిప్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రోగ్రామ్ కోసం ఈ 3వ విడత రుణానికి భారత ప్రభుత్వం తరఫున ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రా మరియు ఏడిబి ఇండియా రెసిడెంట్ మిషన్ ఇన్ చార్జ్ అధికారి హో యున్ జియోంగ్ లు సంతకం చేశారు.
రాష్ట్రంలోని 10 నగరాల్లో వ్యూహాత్మక పారిశ్రామిక కారిడార్‌లలో నీటి సరఫరా, మురుగునీటి పారుదల మరియు నీటి పారుదల మౌలిక సదుపాయాలను ప్రాధాన్యతగా నిర్మించడానికి 2018లో ఏడిబి ఆమోదించిన కార్యక్రమానికి $500 మిలియన్ల మల్టీ-ట్రాంచ్ ఫైనాన్సింగ్ ఫెసిలిటీ (ఎంఎఫ్ఎఫ్)లో ఇది మూడవ మరియు చివరి విడత. 3వ విడత రుణం కోయంబత్తూర్, మధురై మరియు తూత్తుకుడిలను కవర్ చేస్తుంది.
రుణ ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత మిశ్రా మాట్లాడుతూ " ఏడిబి ఫైనాన్సింగ్ ప్రాథమిక నీరు మరియు పారిశుద్ధ్య సేవలకు సార్వత్రిక ప్రాప్యతను నిర్ధారించడానికి మరియు తమిళనాడు పారిశ్రామిక కేంద్రాలుగా ఉన్న ప్రాజెక్ట్ లక్ష్య ప్రాంతాలలో వరదల నుండి కాపాడుతుంది." అని తెలిపారు.
"ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏడిబి..బిల్డ్, ఆపరేట్ మోడాలిటీ, బల్క్ వాటర్ వినియోగదారులకు ఆటోమేటిక్ మీటర్లు మరియు పర్యవేక్షక నియంత్రణ మరియు డేటా సేకరణ వ్యవస్థల ద్వారా నిజ సమయ పర్యవేక్షణ వంటి కొత్త విధానాలను అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో పట్టణ సేవలను అభివృద్ధి చేయడం మరియు మెరుగుపరచడంలో మద్దతునిస్తుంది" అని మిస్టర్ జియోంగ్ తెలిపారు. "ఏడిబి పట్టణ పెట్టుబడులు తమిళనాడులో వ్యూహాత్మక పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి మద్దతును అందిస్తాయని" వివరించారు.
కోయంబత్తూర్‌లో 529 కిలోమీటర్ల మురుగునీటి సేకరణ పైప్‌లైన్‌లు కలిగిన రెండు మురుగునీటి శుద్ధి కర్మాగారాల అభివృద్ధికి 14 పంప్ మరియు లిఫ్ట్ స్టేషన్‌లను ఏర్పాటు చేయడానికి మరియు 14 కిలోమీటర్ల మురుగు పంపింగ్ మెయిన్‌లను నిర్మించడానికి ఈ ఫైనాన్సింగ్ తోడ్పడుతుంది. తూత్తుకుడిలో వాతావరణాన్ని తట్టుకోగలిగే మురుగునీటి పారుదల వ్యవస్థను అభివృద్ధి చేస్తారు.
మధురైలో స్మార్ట్ వాటర్ ఫీచర్‌లతో 163,958 గృహాలను కొత్తగా ఏర్పాటు చేసిన 115 జిల్లాల మీటర్ల ప్రాంతానికి అనుసంధానించే 813 కి.మీ కొత్త నీటి సరఫరా పంపిణీ పైప్‌లైన్‌ల ప్రారంభానికి ఈ ప్రాజెక్ట్ మద్దతు ఇస్తుంది. కోయంబత్తూరు మరియు మదురైలో మురుగునీటి సేకరణ వ్యవస్థ, నీటి సంరక్షణ, పారిశుధ్యం మరియు ఆరోగ్యం మరియు పరిశుభ్రతతో గృహ కనెక్షన్ ప్రయోజనాలపై రెండు మహిళా స్వయం సహాయక బృందాలకు శిక్షణ ఇవ్వబడుతుంది.
****
(Release ID: 1886958)
Visitor Counter : 184