పర్యటక మంత్రిత్వ శాఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీశైలం దేవస్థానం అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించిన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము
కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ సమకూర్చిన 43.08 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు నిర్మాణం
Posted On:
26 DEC 2022 6:28PM by PIB Hyderabad
ముఖ్య అంశాలు:
ప్రాజెక్టులో భాగంగా యాంఫీ థియేటర్ ,విద్యుత్ అలంకరణ, దృశ్య శ్రవణ లైట్ షో, దుస్తులు మార్చుకునే గదులు,పార్కింగ్ సౌకర్యం, పర్యాటకుల సౌకర్య కేంద్రం , మరుగుదొడ్లు, సావనీర్ దుకాణాలు, ఫుడ్ కోర్ట్, ఎటిఎం, బ్యాంకింగ్ సౌకర్యాల కల్పన చేపట్టడం జరిగింది.
అన్ని సౌకర్యాలతో ప్రపంచ స్థాయి పర్యాటక, తీర్ధ యాత్ర ప్రాంతంగా శ్రీశైలం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రాజెక్టు అమలు.
కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకంగా ప్రసాద్( తీర్థయాత్ర పునరుజ్జీవనం మరియు ఆధ్యాత్మిక, వారసత్వ వృద్ధిపై జాతీయ మిషన్) అమలు. ...
ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైలం దేవస్థానం ఆలయ సముదాయం లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ ఈఓజు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకంగా ప్రసాద్( తీర్థయాత్ర పునరుజ్జీవనం మరియు ఆధ్యాత్మిక, వారసత్వ వృద్ధిపై జాతీయ మిషన్)కింద పర్యాటక మంత్రిత్వ శాఖ సమకూర్చిన నిధులతో ప్రాజెక్టును అమలు చేశారు.
ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు తెలంగాణ గవర్నర్ డాక్టర్ (శ్రీమతి) తమిళిసై సౌందరరాజన్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద్ వై.నాయక్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి శ్రీ కొట్టు సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక, యువజన అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి ఆర్.కే.రోజా, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక,ప్రణాళిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాధ్, కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీ అరవింద్ సింగ్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
శ్రీశైలం దేవాలయం అభివృద్ధి కార్యక్రమాలను 43.08 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టి పూర్తి చేయడం జరిగింది. ప్రాజెక్టు అమలుకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సమకూర్చింది. ప్రాజెక్టులో భాగంగా యాంఫీ థియేటర్ ,విద్యుత్ అలంకరణ, దృశ్య శ్రవణ లైట్ షో, దుస్తులు మార్చుకునే గదులు,పార్కింగ్ సౌకర్యం, పర్యాటకుల సౌకర్య కేంద్రం , మరుగుదొడ్లు, సావనీర్ దుకాణాలు, ఫుడ్ కోర్ట్, ఎటిఎం, బ్యాంకింగ్ సౌకర్యాల కల్పన చేపట్టడం జరిగింది. అన్ని సౌకర్యాలతో ప్రపంచ స్థాయి పర్యాటక, తీర్ధ యాత్ర ప్రాంతంగా శ్రీశైలం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రాజెక్టును చేపట్టారు.
తీర్థయాత్ర పునరుజ్జీవనం మరియు ఆధ్యాత్మిక, వారసత్వ వృద్ధిపై జాతీయ మిషన్’ (ప్రసాద్ ) పథకం అమలు చేయడానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సమకూరుస్తోంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో పర్యాటక మంత్రిత్వ శాఖ 2014-15 నుంచి పధకాన్ని అమలు చేస్తోంది. పర్యాటక, వారసత్వ సంపద ప్రాంతాల్లో సమగ్ర మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి పర్యాటక, తీర్థ యాత్ర రంగంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎక్కువగా ఉపాధి అవకాశాలు కల్పించి, ఆర్థికాభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ప్రసాద్ పథకం అమలు జరుగుతోంది.
శివుడు మరియు అతని భార్య పార్వతి కొలువు తీరిన దేవాలయం శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం. భారతదేశంలో శైవమతం మరియు శక్తి నిలయమైన ఏకైక ఆలయంగా శ్రీశైలం ప్రసిద్ధి చెందింది.దేవాలయంలో ప్రధాన దైవం భ్రమరాంబ మల్లికార్జున స్వామి లింగం ఆకారంలో ఇక్కడ దర్శనం ఇస్తారు. సహజ రాతి నిర్మాణాలలో ఉన్న ఈ ప్రదేశం శివుడి 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. పార్వతి దేవి యొక్క 18 మహా శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు మరియు శక్తి పీఠాలలో ఒకటిగా ఉండటమే కాకుండా, ఈ ఆలయం పాదాల ప్రాంత స్థలాల్లో ఒకటిగా వర్గీకరించబడింది. మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబ దేవి విగ్రహాలు 'స్వయంభు' లేదా స్వీయ-వ్యక్తీకరణగా భావిస్తారు. జ్యోతిర్లింగం , మహాశక్తి పీఠం ఒకే చోట ఉండడం శ్రీశైలం ప్రత్యేకత.
****
(Release ID: 1886787)
Visitor Counter : 263