రక్షణ మంత్రిత్వ శాఖ
నలుగురు ప్రతిభావంతులైన క్రీడాకారిణులను నియమించిన భారతీయ సైన్యం
Posted On:
23 DEC 2022 1:58PM by PIB Hyderabad
నారీ శక్తిని ప్రోత్సహించేందుకు భారతీయ సైన్యం చేస్తున్న కృషికి ఊపునిస్తూ, భారతీయ సైన్యం తన మిషన్ ఒలింపిక్ కార్యక్రమం కింద నలుగురు ప్రతిభావంతులైన మహిళా క్రీడాకారులకు కార్ప్స్ ఆఫ్ మిలటరీ పోలీస్ డైరెక్ట్ ఎంట్రీ హవల్దార్లుగా నియమించింది.
ప్రతిభావంతులైన నలుగురు మహిళా క్రీడాకారులు; రిక్రూట్ హవల్దార్ సాక్షి (బాక్సింగ్), రిక్రూట్ హవల్దార్ అరుంధతి చౌదరి (బాక్సింగ్), రిక్రూట్ హవల్దార్ భతేరీ (కుస్తీ), రిక్రూట్ హవల్దార్ ప్రియాంక (కుస్తీ) భోపాల్‌లో జరిగిన 6వ ఎలీట్ ఉమెన్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ 2022 (19 నుంచి 26 డిసెంబర్ 2022 వరకు), విశాఖపట్నంలో జరిగిన సీనియర్ నేషనల్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ (21 నుంచి 23 డిసెంబర్ 2022)ల మహిళా విభాగంలో భారత సైన్యానికి ప్రాతినిధ్యం వహించే మార్గదర్శకులుగా చరిత్ర సృష్టించారు.
క్రీడా సిబ్బందిని ప్రోత్సహించి, అభివృద్ధి చేసే ఘనమైన సంప్రదాయం కలిగిన భారతీయ సైన్యం, మిషన్ ఒలింపిక్స్ పేరిట ఒక నిర్మాణాత్మక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాది మొదట్లో, 400 మీటర్ల అథ్లెటిక్స్‌లో రాణించిన అంతర్జతీయ స్థాయి క్రీడాకారిణి అయిన సుమ్మీ, కామన్‌వెల్త్ క్రీడలు 2022లో బాక్సింగ్‌లో కాంశ్య పతకాన్ని సాధించిన జాస్మిన్ లంబోరియాను కూడా భారతీయ సైన్యం రిక్రూట్ చేసుకుంది.
***
(Release ID: 1886295)