ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

ఫేషియ‌ల్ రిక‌గ్నిష‌న్ టెక్నాల‌జీ (ముఖ గుర్తింపు సాంకేతిక‌త‌)

Posted On: 23 DEC 2022 1:59PM by PIB Hyderabad

న్యాయ‌బ‌ద్ధ‌మైన‌, సుర‌క్షిత‌, విశ్వ‌స‌నీయ‌, జ‌వాబుదారీ అయిన ఇంట‌ర్నెట్‌ను వినియోగ‌దారుల‌కు అందించే ల‌క్ష్యంతో ప్ర‌భుత్వ విధానాలు ఉన్నాయి. ఇంట‌ర్నెట్ విస్త‌రించ‌డంతో ఎక్కువ‌ సంఖ్య‌లో భార‌తీయులు ఆన్‌లైన్‌లోకి వ‌స్తున్నార‌ని, ఫేషియ‌ల్ రిక‌గ్నిష‌న్ టెక్నాల‌జీ (ముఖాల‌ను గుర్తించే సాంకేతిక‌త‌) కోసం రూపొందించిన స‌మాచారం స‌హా, బ‌యోమెట్రిక్ స‌మాచారంలో ముఖ గుర్తింపులో పెరుగుద‌ల ఉంది. 
ఏదైనా సున్నిత‌మైన వ్య‌క్తిగ‌త డాటాను క‌లిగి ఉన్న లేదా స్వంత కంప్యూట‌ర్ వ‌న‌రులోని స‌మాచారాన్ని లేదా నియంత్రించే లేదా నిర్వ‌హించే కార్పొరేట్ సంస్థ ఒక‌వేళ ఎవ‌రైనా వ్య‌క్తి కి క‌నీస భ‌ద్ర‌తా ప‌ద్ధ‌తుల‌ను, ప్ర‌క్రియ‌ను అమ‌లు చేయ‌డం, నిర్వ‌హించ‌డంలోని నిర్ల‌క్ష్యం వ‌ల్ల ఎవ‌రైనా వ్య‌క్తికి  అక్ర‌మ న‌ష్టం, లేదా అక్ర‌మ లాభాన్నిక‌లిగిస్తే, ప్ర‌భావిత‌మైన వ్య‌క్తికి ఆ సంస్థ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ చ‌ట్టం, 2000లోని సెక్ష‌న్ 43ఎ ప్ర‌కారం  న‌ష్ట‌ప‌రిహారాన్ని చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది. ఈ సెక్ష‌న్ కింద ఇచ్చిన అధికారాల‌ను వినియోగించుకుంటూ, సున్నిత‌మైన వ్య‌క్తిగ‌త డాటా లేదా స‌మాచారంతో పాటుగా క‌నీస భ‌ద్ర‌తా ప‌ద్ధ‌తులు, ప్ర‌క్రియ‌లకు క‌ట్టుబ‌డ‌వ‌ల‌సి ఉంటుందని, స్ప‌ష్టంగా నిర్దేశించింది. వీటి ప్ర‌కారం, బ‌యోమెట్రిక్ స‌మాచారం, ముఖ ముఖ ఆకృతుల‌ను కొలిచి, విశ్లేషించే సాంకేతిక‌త‌లు స‌హా బ‌యోమెట్రిక్స్ వంటి సున్నిత‌మైన వ్య‌క్తిగ‌త డాటా లేదా స‌మాచారం. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాలు ఐఎస్‌/ ఐఎస్ఒ/ ఐఇసి 27001 లేదా డాటా ప‌రిర‌క్ష‌ణ కోసం ప్ర‌భుత్వ ఆమోదిత ఉత్త‌మ ఆచ‌ర‌ణ ప‌ద్ధ‌తులు,  వ్యాపార స్వ‌భావంతో సంర‌క్షించే స‌మాచార ఆస్తుల‌కు అనుగుణంగా నిర్వ‌హ‌ణ‌, సాంకేతిక‌, కార్యాచ‌ర‌ణ‌, భౌతిక భ‌ద్ర‌తా నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌ను క‌లిగి ఉన్న స‌మ‌గ్ర‌మైన డాక్యుమెంట్ చేసిన స‌మాచార భ‌ద్ర‌తా కార్య‌క్ర‌మం, స‌మాచార భ‌ద్ర‌త విధానాలు స‌హా క‌నీస భ‌ద్ర‌తా ఆచ‌ర‌ణ‌లు, ప‌ద్ధ‌తుల‌ను అమ‌లు చేయ‌వ‌ల‌సి ఉంటుంది. అందువ‌ల్ల ముఖ గుర్తింపు సాంకేతిక‌త‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించేందుకు, అటువంటి సాంకేతిక‌త‌కు సంబంధించిన డాటాను నిర్వ‌హించేందుకు చ‌ట్టం అమ‌లులో ఉంది. 
అంతేకాకుండా, ఎల‌క్ట్రానిక్స్‌, స‌మాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ డిజిట‌ల్ ప‌ర్స‌న‌ల్ డాటా ప్రొటెక్ష‌న్ బిల్‌ (డిజిట‌ల్ వ్య‌క్తిగ‌త డాటా ర‌క్ష‌ణ బిల్లు), 2022 ముసాయిదాను త‌యారు చేసి, ప్ర‌జా సంప్ర‌దింపుల‌లో భాగంగా ప్ర‌జ‌ల నుంచి ఫీడ్‌బ్యాక్‌ను ఆహ్వానించింది. 
ఈ స‌మాచారాన్ని ఎల‌క్ట్రానిక్స్ & సమాచార సాంకేతిక‌త శాఖ స‌హాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ శుక్ర‌వారం రాజ్య‌స‌భ‌కు లిఖిత‌పూర్వ‌కంగా ఇచ్చిన స‌మాచారంలో వెల్ల‌డించారు. 

 

***
 



(Release ID: 1886291) Visitor Counter : 141


Read this release in: Urdu , English