భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
2022 డిసెంబర్, 19వ తేదీ వరకు రెండవ దశ ఎఫ్.ఏ.ఎం.ఈ. ఇండియా పథకం కింద 7,66,478 ఎలక్ట్రిక్ వాహనాలకు మద్దతు ఇవ్వడం జరిగింది
Posted On:
23 DEC 2022 2:48PM by PIB Hyderabad
* ఈ పథకం కింద 26 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో 6,315 ఈ-బస్సులు మంజూరు చేయడం జరిగింది.
* ఈ పథకం కింద 25 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లోని 68 నగరాల్లో 2,877 ఛార్జింగ్ స్టేషన్లు మంజూరు చేయడం జరిగింది.
|
భారతదేశంలో హైబ్రిడ్ & ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా స్వీకరించడం, తయారు చేయడం (ఎఫ్.ఏ.ఎం.ఈ-ఇండియా) పథకం రెండో దశ కింద, 2022 డిసెంబర్, 19వ తేదీ వరకు 7,66,478 విద్యుత్ వాహనాలకు సుమారు 3,311 కోట్ల రూపాయలు డిమాండ్ ప్రోత్సాహకంగా అందజేయడం ద్వారా మద్దతు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా, ఈ పథకం కింద 26 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లోని 65 నగరాలు / ఎస్.టి.యు. లు / సి,టి,యు. లు / రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు అంతర్ రాష్ట్ర, రాష్ట్రేతర కార్యకలాపాల కోసం 6,315 ఈ-బస్సులను, కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది.
ఎఫ్.ఏ.ఎం.ఈ. ఇండియా (భారతదేశంలో హైబ్రిడ్ & ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా స్వీకరించడం, తయారు చేయడం) పథకం రెండో దశ కింద 25 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లోని 68 నగరాల్లో 2,877 ఛార్జింగ్ స్టేషన్లను మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది.
ఎఫ్.ఏ.ఎం.ఈ-ఇండియా పథకం రెండవ దశ అమలు కోసం బడ్జెట్ కేటాయింపు, వినియోగం వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
క్రమ
సంఖ్య
|
ఆర్థిక
సంవత్సరం
|
బడ్జెట్
కేటాయింపు
|
30.11.2022 నాటికి నిధుల వినియోగం
|
1
|
2019-2020
|
₹ 500.00 కోట్లు
|
₹ 500.00 కోట్లు
|
2
|
2020-2021
|
₹ 318.36 కోట్లు
|
₹ 318.36 కోట్లు
|
3
|
2021-2022
|
₹ 800.00 కోట్లు
|
₹ 800.00 కోట్లు
|
4
|
2022-2023
|
₹ 2903.08 కోట్లు
|
₹ 1128.45 కోట్లు
|
కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ క్రిషన్ పాల్ గుర్జార్ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వకంగా సమర్పించిన సమాధానంలో ఈ సమాచారాన్ని పొందుపరిచారు.
*****
(Release ID: 1886108)
Visitor Counter : 149