పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

వడోదర విమానాశ్రయంలో ఫైనల్ అసెంబ్లీ లైన్ మరియు ఎమ్ ఆర్ వో సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి మెసర్స్ టిఎఎస్ఎల్ కు 50 ఎకరాల భూమిని కేటాయించడానికి ఆమోదం తెలిపిన ఎఎఐ

Posted On: 22 DEC 2022 2:09PM by PIB Hyderabad

దేశంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో  ప్రాంతీయ రవాణా విమానం మరియు అనుబంధ పరికరాలతో సహా విమానాల తయారీ ని ప్రభుత్వం ప్రోత్సహించి  మరియు సులభతరం చేస్తోంది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) అభివృద్ధి చేసిన హిందుస్తాన్ -228 (అప్గ్రేడెడ్) తరహా పౌర విమానం  ప్రాంతీయ రవాణా సౌకర్యాలు అభివృద్ధి చేయడానికి ఉపకరిస్తుంది. ఈ  టర్బో ప్రాప్ విమానం 19 సీట్లు కలిగి ఉంటుంది.  19 సీట్ల తేలిక పాటి రవాణా విమానం - సార్స్ ఎంకెఐఐ రూపకల్పన, అభివృద్ధి మరియు ధృవీకరణ కోసం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) - నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీస్ (ఎన్ఏఎల్) తో హెచ్ఏఎల్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

  "ఆత్మనిర్భర్ భారత్" సాధన కోసం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ (టిఎఎస్ఎల్) (ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సహకారంతో) ద్వారా సి -295 మిలిటరీ ట్రాన్స్ పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కోసం   వడోదర విమానాశ్రయంలో ఫైనల్ అసెంబ్లీ లైన్ మరియు ఎమ్ ఆర్ ఓ సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) 50 ఎకరాల భూమిని టిఎఎస్ఎల్ కు కేటాయించడానికి ఆమోదం తెలిపింది. దీనికి 30.10.2022 న శంకుస్థాపన జరిగింది. 

ప్రస్తుతం అమలులో ఉన్న విధానం విమానాల దేశీయ తయారీకి వీలు కల్పిస్తుంది. భారతదేశంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగంలో  ప్రాంతీయ రవాణా విమానం మరియు అనుబంధ పరికరాలతో సహా విమానాల తయారీని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దీనికోసం అవసరమైన సౌకర్యాలు కల్పిస్తోంది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) అభివృద్ధి చేసిన హిందుస్తాన్ -228 (అప్గ్రేడెడ్) తరహా విమానం  ప్రాంతీయ రవాణా సౌకర్యాలు అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది. ఈ  టర్బో ప్రాప్ విమానం 19 సీట్లు కలిగి ఉంటుంది.    19 సీట్ల తేలిక పాటి రవాణా విమానం - సార్స్ ఎంకెఐఐ రూపకల్పన, అభివృద్ధి మరియు ధృవీకరణ కోసం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) - నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీస్ (ఎన్ఏఎల్) తో హెచ్ఏఎల్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

పశ్చిమ బెంగాల్ లో ప్యాసింజర్ విమానాల తయారీకి డిఫెన్స్ కారిడార్ తరహాలో స్పెషల్ ఎకనామిక్ జోన్ లేదా ఏవియేషన్ కారిడార్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన మంత్రిత్వ శాఖకు అందలేదు. 

భారతీయ విమానయాన రంగం అభివృద్ధికి  సహకరించే విధంగా జాతీయ పౌర విమానయాన విధానం, 2016  రూపొందిందింది.  ఎయిర్ లైన్స్, విమానాశ్రయాలు, సరుకు రవాణా, నిర్వహణ, మరమ్మత్తులు  అండ్ ఓవర్ హాల్ (ఎమ్ ఆర్ ఓ) సేవలు, జనరల్ ఏవియేషన్, ఏరోస్పేస్ అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి లాంటి  వివిధ విమానయాన అనుబంధ రంగాలు సమగ్రంగా అభివృద్ధి సాధించేలా చూడాలన్న లక్ష్యంతో జాతీయ పౌర విమానయాన విధానం, 2016 కు రూపకల్పన చేయడం జరిగింది.

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) జనరల్ వికె సింగ్ ఈ రోజు లోక్ సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు

***



(Release ID: 1885783) Visitor Counter : 101


Read this release in: English , Urdu , Tamil