నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
విద్యుత్ రంగంలో మహిళల భాగస్వామ్యం పెంచేందుకు పలు ముఖ్య కార్యక్రమాలను చేపట్టిన ఎంఎన్ఆర్ఈ
‘సూర్యమిత్ర స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్’ కింద శిక్షణ పొందిన 2251 మందిలో 836 మహిళా అభ్యర్థులకు ఉపాధి
Posted On:
20 DEC 2022 3:39PM by PIB Hyderabad
సౌరశక్తి (సూర్యమిత్ర), పవన శక్తి (వాయుమిత్ర) మరియు చిన్న జలశక్తి (జల్ఊర్జామిత్ర)తో సహా పునరుత్పాదక విద్యుత్ రంగంలో నైపుణ్యాభివృద్ధి కోసం కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలకు మద్దతునిస్తోంది. సూర్యమిత్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమం 2015-16 ఆర్థిక సంవత్సరం నుండి అమలు చేయబడుతోంది, ఇందులో కార్యక్రమం ప్రారంభం నుండి నవంబర్ 2022 వరకు 2251 మంది మహిళా అభ్యర్థులు శిక్షణ పొందారు, వారిలో 836 మంది అభ్యర్థులు ఉపాధి పొందారు. వాయుమిత్ర మరియు జల్ఊర్జామిత్ర నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ఇటీవల ప్రారంభించబడ్డాయి, తగిన అర్హతలతో పురుషులు, మహిళలు ఇద్దరూ ఈ కార్యక్రమానికి అర్హులు. సోలార్ లాంతర్లు, ల్యాంప్‌లు మొదలైన వాటి కూర్పు, ఏర్పాటు, ఆపరేషన్, నిర్వహణ పై గ్రామీణ ప్రాంతాల్లోని తక్కువ అక్షరాస్యులైన మహిళలకు ప్రత్యేకంగా ఆరు నెలల శిక్షణా కార్యక్రమానికి మంత్రిత్వ శాఖ మద్దతునిస్తోంది. కేంద్ర విద్యుత్, నూతన-పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి శ్రీ ఆర్.కె. సింగ్ ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 1885257)