మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

లోతట్టు మత్స్య సంపద, ఆక్వా కల్చర్ పురోగతికి మత్స్య శాఖ చర్యలు

Posted On: 20 DEC 2022 4:46PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని మత్స్య, పశుగణాభివృద్ధి, పాడి మంత్రిత్వశాఖలోని మత్స్య విభాగం ప్రస్తుతం నడుస్తున్న ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పిఎంఎం ఎస్ వై ) కింద లోతట్టు ప్రాంత మత్స్యాభివృద్ధిని తీవ్రతరం చేసి వైవిధ్యభరితం చేయాలని నిర్ణయించింది. వివిధ జాతులను విస్తరించటం మీద దృష్టి పెట్టటం, కొత్త జాతులను ప్రవేశపెట్టటం, నాణ్యమైన ఉత్పత్తులను రాబట్టటం కోసం డిమాండ్ సప్లై లోని ఖాళీలను భర్తీ చేయటం లాంటి చర్యలు చేపడుతోంది. నాణ్యమైన జాతి విత్తనాలు , పెంపుడుకు అనువైన జాతులు ఎంపిక చేయటం, ఆయా జాతులకు తగిన ఆహారాన్ని ఎంపిక చేయటం, మేలు జారీ పిల్లల నిల్వ, జన్యుపరంగా మెరుగు పరచిన జాతులు అందులో కొన్ని కీలకమైన చర్యలు. ఫలితంగా, 2021-22 లో భారతదేశంలో మొత్తం చేపల ఉత్పత్తిలో లోతట్టు మత్స్య సంపద, ఆక్వాకల్చర్   వాటా 74.59 % అయింది.

పైగా పీ ఎం ఎం ఎస్ వై  పథకం కింద  మత్స్య శాఖ కూడా చేపల రైతుల వైజ్ఞానిక పర్యటనలు, శిక్షణసామర్థ్య నిర్మాణ కార్యక్రమాలకు సహకరిస్తూ, మాటసీఆభివృద్ధి, ఆక్వాకల్చర్ లో కొత్త టెక్నాలజీలను పరిచయం చేస్తోంది.   అందులో భాగమే రిజర్వాయర్లలో పంజర పెంపకం, మాగాణి భూముల్లో పెన్ కల్చర్, బయోఫ్లాక్ టెక్నాలజీ,  మంచినీటి రొయ్యల పెంపకాన్ని ఇంకా పెంచటం. ఉత్పత్తి పెంచటం కోసం ఉప్పునీటి ఆక్వాకల్చర్ లాంటివి ఆచరణలో పెట్టటం.  

కేంద్ర మత్స్య, పశుగణాభివృద్ధి, పాడి శాఖామంత్రి శ్రీ పురుషోత్తం రూపాలా ఈ రోజు లోక్ సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలోని  సమాచారం ఇది.

***


(Release ID: 1885252) Visitor Counter : 144


Read this release in: English , Urdu , Tamil