నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
ఉదజని ఆధారిత సాంకేతికలో పరిశోధనను మెరుగుపరిచేందుకు నూతన, పునరావృత ఇంధన మంత్రిత్వ శాఖ చేపట్టిన చొరవలు
Posted On:
20 DEC 2022 3:39PM by PIB Hyderabad
నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఉదజన (హైడ్రోజెన్) ఇంధనంతో నడిచే వాహనాల అభివృద్ధికి పరిశోధనా సంస్థలు, పరిశ్రమలు చేపట్టే పరిశోధన, అభివృద్ధి, ప్రదర్శన (ఆర్‌డి&డి) ప్రాజెక్టులకు మద్దతునిస్తోంది. నేషనల్ కెమికల్ లాబొరేటరీ (ఎన్‌సిఎల్) ద్వారా కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) ఉదజని (హైడ్రొజెన్) ఇంధన సెల్ వాహనాలపై పరిశోధన, అభివృద్ధి & ప్రదర్శనల ప్రాజెక్టులను కూడా చేపట్టింది.
ఉదజని రసాయన శక్తి ని ఫ్యూయెల్ సెల్స్ ద్వారా లేదా ఉదజనిని ఉపయోగించగల సవరించిన అంతర్గత దహన యంత్రాల ద్వారా ఉదజని వాహనాలకు ఇంధనంగా ఉపయోగించవచ్చు. రెండు సాంకేతికతలు అభివృద్ధి పరిశ్రమలలో పైలెట్ దశలో ఉండటం, భారతదేశంలో వాణిజ్యపరంగా పరీక్షించకపోవడంతో, ఈ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించిన వ్యయంచనాలు, కాలక్రమాలు ప్రస్తుతం అందుబాటులో లేవు.
ఈ సమాచారాన్ని కేంద్ర విద్యుత్, నూతన, పునరావృత ఇంధన మంత్రి శ్రీ ఆర్,కె. సింగ్ రాజ్యసభకు మంగళవారం ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం ద్వారా వెల్లడించారు.
***
(Release ID: 1885251)