ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

జిడిపిలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగం వాటా

Posted On: 20 DEC 2022 2:00PM by PIB Hyderabad

 ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ రంగంలో స్థూల విలువ  జోడింపు (జివిఎ) 2016-17లో రూ. 1.79 ల‌క్ష‌ల‌ కోట్ల నుంచి 2020-21లో సంయోజిత వార్షిక వృద్ధి రేటు (సిఎజిఆర్‌) 7.27%న రూ. 2.37 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరింది. గ‌త మూడేళ్ళ‌, ఇటీవ‌ల ఏడాది 2020-21 సంవ‌త్స‌రంలో జివిఎ దిగువ విధంగా ఉంది 
                                               
(ల‌క్ష‌ల కోట్ల‌లో రూపాయ‌లలో)

                                       2017-18        2018-19         2019-20         2020-21

అద‌న‌పు విలువ జోడింపు  1.93             2.36                 2.26             2.37

ఉపాధి అవ‌కాశాల‌ను సృష్టించ‌డం, జిడిపిలో త‌న వాటాను పెంచేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ ప‌రిశ్ర‌మ‌కు ఎటువంటి ల‌క్ష్యం పెట్ట‌లేదు. అయితే, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ రంగం న‌మోదు చేసుకున్న ఉత్ప‌త్తి రంగంలో 12.2% ఉపాధి క‌ల్ప‌న‌కు దోహ‌దం చేస్తుంది. మంత్రిత్వ శాఖ వివిధ ప‌థ‌కాల‌ను, విధాన చొర‌వ‌ల‌ను మంత్రిత్వ శాఖ అమ‌లు చేసిన ఫ‌లితంగా భార‌త‌దేశ జివిఎకు ఈ రంగం ఎక్కువ దోహ‌దం చేస్తోంది. ఫుడ్ ప్రాసెసింగ్ ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ శాఖ ప్ర‌ధాన‌మంత్రి మంత్రి కిసాన్ సంప‌ద యోజ‌న (పిఎంకెఎస్‌వై)ను అమ‌లు చేస్తోంది. దీనిని ఆధునిక‌, పంట త‌ర్వాత మౌలిక స‌దుపాయాల‌ను సృష్టించడం, విలువ జోడింపును ప్రోత్స‌హించ‌డం, రైతుల‌కు మెరుగైన రాబ‌డిని అందించ‌డం, ఉపాధి అవ‌కాశాల‌ను సృష్టించడం త‌దిత‌రాలు ల‌క్ష్యంతో అమ‌లు చేస్తున్నారు. ఇందుకు అద‌నంగా, మంత్రిత్వ శాఖ  రెండు ల‌క్ష‌ల మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థ‌ల‌ను దేశ‌వ్యాప్తంగా ఏర్పాటు చేయ‌డం/ ఆధునీక‌రించేందుకు ఆర్ధిక, సాంకేతిక‌, వ్యాపార మ‌ద్ద‌తును అందించేందుకు పిఎం- ఫార్మ‌లైజేష‌న్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంట‌ర్‌ప్రైజెస్ (పిఎంఎఫ్ఎంఇ) ప‌ధ‌కాన్ని అమ‌లు చేస్తోంది. అంత‌ర్జాతీయ ఆహార ఉత్ప‌త్తిదారుల చాంపియ‌న్ల‌ను సృష్టించ‌డంలో తోడ్పాటునిచ్చేందుకు నూత‌న ప్రొడ‌క్ష‌న్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీం (పిఎల్ ఐఎస్ - ఉత్పాద‌క‌ అనుసంధాన చొర‌వ‌ల) ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంది.  మ‌రిన్ని ఉపాధి అవ‌కాశాల‌ను, ఎక్కువ ఎగుమ‌తులను కూడా ఈ ప‌థ‌కం సృష్టిస్తుంది. 
ఈ స‌మాచారాన్ని ఆహార ప్రాసెసింగ్ ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ శాఖ స‌హాయ మంత్రి శ్రీ ప్ర‌హ్లాద్ సింగ్ ప‌టేల్ మంగ‌ళ‌వారంనాడు లోక్‌స‌భ‌కు లిఖితపూర్వ‌కంగా ఇచ్చిన స‌మాధానం ద్వారా వెల్ల‌డించారు. 

 

****



(Release ID: 1885177) Visitor Counter : 117


Read this release in: English , Urdu , Tamil