పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

మసి కర్బనం

Posted On: 19 DEC 2022 2:01PM by PIB Hyderabad

హిమాలయ హిమానీనదాల అధ్యయనం అనేది భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తల పరిశోధనలు, డేటా సేకరణ మరియు వివిధ పరిశోధన అధ్యయనాల విశ్లేషణల ద్వారా అధ్యయనం చేయబడుతున్న సంక్లిష్టమైన మరియు అభివృద్ధి చెందుతున్న విషయం. హిమానీనదాలు మరియు వాటి లక్షణాలు హిమాలయాలలోని వివిధ ఉప ప్రాంతాలలో నిర్దిష్ట ప్రదేశాలలో సంక్లిష్టమైన మార్పులను ప్రదర్శిస్తాయి. హిమాలయాల్లో స్థిరమైన, తిరోగమనం లేదా పురోగమిస్తున్న హిమానీనదాలు ఉన్నాయి, తద్వారా హిమానీనదాలు పరిణామ గతిశీలత యొక్క సంక్లిష్ట భౌగోళిక మరియు చక్రీయ స్వభావాన్ని నొక్కి చెబుతుంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఇస్రో జియోస్పియర్ బయోస్పియర్ ప్రోగ్రామ్ (భూగోళంపై ఉన్న భూతలము జీవావరణం అధ్యయనం) కింద ఏరోసోల్ అబ్జర్వేటరీల నెట్‌వర్క్‌ (వాయువులో ఉండే ద్రవ లేదా ఘన కణాలును అధ్యయనం చేసే పరిశోధనా కేంద్రాలు నెట్వర్క్) ను నిర్వహిస్తోంది. ఈ నెట్‌వర్క్ నుండి కొలవబడే పారామితులలో ఒకటి మసి కర్బనం  ద్రవ్యరాశి ఏకాగ్రత. ఏరోసోల్ అబ్జర్వేటరీల యొక్క పైన పేర్కొన్న ప్రాంతీయ నెట్‌వర్క్ నుండి భారతీయ ప్రాంతంపై మసి కర్బనం (బ్లాక్ కార్బన్) యొక్క దీర్ఘకాలిక సూచికలు గత దశాబ్దంలో తగ్గుతున్న ధోరణిని (0.24 µg m-3year-1) స్పష్టంగా చూపుతున్నాయి.

 

మసి కర్బనం  ఉద్గారాలను నియంత్రించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది, వీటిలో ఈ క్రిందివి ఉన్నాయి:

 

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన శుభ్రమైన గృహ వంట ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది.

ఏప్రిల్ 1, 2020 నుండి ఇంధనం మరియు వాహనాల కోసం బీఎస్-IV నుండి బీ ఎస్ -VI నిబంధనలకు ముందడుగు.

ప్రజా రవాణా కోసం మెట్రో రైళ్ల నెట్‌వర్క్ మెరుగుపరచబడింది మరియు మరిన్ని నగరాలు కు విస్తరించబడ్డాయి.

వాయు ఇంధనం (సీ ఎన్ జీ, ఎల్ పి జి మొదలైనవి), ఇథనాల్ మిశ్రమం వంటి క్లీనర్ / ప్రత్యామ్నాయ ఇంధనాల పరిచయం.

5000 కంప్రెస్డ్ బయో-గ్యాస్ ఉత్పత్తి ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి మరియు సీ బీ జీ ని ఉపయోగించడానికి మార్కెట్‌లో అందుబాటులో ఉంచడానికి "సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువర్డ్స్ అఫర్డబుల్ ట్రాన్స్‌పోర్టేషన్  అనే కొత్త చొరవ ప్రారంభించబడింది.

'పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ మరియు ఢిల్లీలోని ఎన్ సీ టీ రాష్ట్రాల్లో పంట అవశేషాల నిర్వహణ కోసం వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడం'పై సెంట్రల్ సెక్టార్ స్కీమ్ కింద, వ్యవసాయ యంత్రాలు మరియు ఇ పంట అవశేషాల నిర్వహణ కోసం పరికరాలు 50% తో ప్రోత్సహించబడ్డాయి. రైతులకు సబ్సిడీ మరియు కస్టమ్ హైరింగ్ కేంద్రాల ఏర్పాటుకు 80% సబ్సిడీ.

2025 - 26 నాటికి వాయు కాలుష్యము లో ధూళి (పర్టిక్యులేట్ మ్యాటర్) సాంద్రతలలో 40% తగ్గింపును సాధించాలనే లక్ష్యాలతో దేశవ్యాప్తంగా వాయు కాలుష్య సమస్యను సమగ్ర పద్ధతిలో పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్‌ను దీర్ఘకాలిక, కాలపరిమితి, జాతీయ స్థాయి వ్యూహంగా అమలు చేస్తోంది.

 

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) 131 నగరాలను జాతీయ పరిసర వాయు నాణ్యత ప్రమాణాలను మించిన పరిసర గాలి నాణ్యత స్థాయిల ఆధారంగా మరియు మిలియన్లకు పైగా జనాభా ఉన్న నగరాలను గుర్తించింది. ఈ నగరాల్లో అమలు చేయడానికి నగర నిర్దిష్ట క్లీన్ ఎయిర్ యాక్షన్ ప్లాన్‌లు నగర ప్రణాళికలు సిద్ధం చేయబడ్డాయి మరియు రూపొందించబడ్డాయి. ఈ  ప్రణాళికలు నగర నిర్ధిష్ట వాయు కాలుష్య కారకాలను (నేల & రోడ్డు దుమ్ము, వాహనాలు, గృహ ఇంధనం, మునిసిపల్ ఘన వ్యర్థాలను కాల్చడం, నిర్మాణ సామగ్రి మరియు పరిశ్రమలు మొదలైనవి) నియంత్రించడానికి సమయ పరిమిత లక్ష్యాలను నిర్వచించాయి. 

ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (FAME) ఫేజ్-2 పథకం రూపొందించబడింది.

కాలుష్యాన్ని తగ్గించడానికి ఇటుక బట్టీలను జిగ్-జాగ్ టెక్నాలజీకి మార్చడం. పారిశ్రామిక యూనిట్లు పైప్డ్ సహజ వాయువుకు మారుతున్నాయి.

పర్యావరణం, అటవీ & వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

***



(Release ID: 1884856) Visitor Counter : 178


Read this release in: English , Urdu , Tamil