కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దుస్తుల తయారీ కర్మాగారాల్లో కార్మికులు

Posted On: 19 DEC 2022 1:23PM by PIB Hyderabad

గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 2017-18 నుంచి ఉద్యోగ, నిరుద్యోగ గణాంకాలను ఎప్పటికప్పుడు సర్వే ద్వారా సేకరిస్తూ ఉన్నారు. మళ్ళీ లెక్కించే సర్వే సమయం వచ్చే ఏడాది జూలై నుంచి ఆ తరువాత వచ్చే జూన్ దాకా ఉంటుంది. తాజాగా అందుబాటులో ఉన్న సర్వే గణాంకాల ప్రకారం 15 ఏళ్ళకు పైబడిన వయసున్న వారిలో కార్మిక జనాభా  2020-21 లో 52.6% ఉంది. అది అంతకు ముందు సంవత్సరం 2019029 లో 50.9% గా నమోదైంది. అదే రెండు సంవత్సరాలలో దుస్తుల తయారీ కర్మాగారాల్లో పనిచేసేవారి వివరాలు ఇలా ఉన్నాయి:

 

సాధారణంగా పరిశ్రమలో పనిచేసే వారి శాతంలో దుస్తుల తయారీలో పనిచేసే వారి శాతం

సంవత్సరం

పురుషులు

స్త్రీలు

మొత్తం

2019-20

1.44

3.72

2.08

2020-21

1.44

4.00

2.20

 

మూలం: పి ఎల్ ఎఫ్ఎస్,  గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వశాఖ

 

పైన పేర్కొన్న సమాచారాన్ని బట్టి దుస్తుల తయారీ పరిశ్రమలో పనిచేస్తున్నవారి శాతం 2019-20 తో పోల్చుకున్నప్పుడు 2020-21 లో పెరుగుదల నమోదు చేసుకుంది. 

భారత ప్రభుత్వం 1948 లో చేసిన ఫ్యాక్టరీల చట్టం ఈ చట్టం కింద నమోదు చేసుకున్న కార్మికుల వృత్తిపరమైన భద్రతకు, ఆరోగ్యానికి, మహిళలతోసహా అందరు కార్మికుల సంక్షేమానికి పాటుపడుతుంది.    పని ప్రదేశంలో కార్మికుల భద్రతకోసం  చేసిన వృత్తిపరమైన భద్రతాచర్యలు దుస్తుల కర్మాగారాలకు కూడా వర్తిస్తాయి.  1948 నాటి ఫాక్టరీల చట్టాన్ని, దానిలోని నిబంధనలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్ లేదా పారిశ్రామిక భద్రత, ఆరోగ్య విభాగం  డైరెక్టర్ అమలు చేస్తారు. అయితే, పని ప్రదేశంలో మహిళా కార్మికుల ఫిర్యాదులకు సంబంధించిన సమాచారాన్ని ఎక్కడికక్కడే తప్ప  ఈ మంత్రిత్వశాఖ సేకరించటం లేదు.

పని ప్రదేశాల్లో మహిళల లైంగిక వేధింపుల నిరోధక, పరిష్కార చట్టం, 2013 కూడా ప్రభుత్వం రూపొందించింది. పనితో నిమిత్తం లేకుండా మహిళలందరికీ వారి పని ప్రదేశాలలో సురక్షితమైన వాతావరణం కల్పించటం దీని లక్ష్యం. పైన చెప్పిన చట్టం వలన 10 లేదా అంత కంటే ఎక్కువమందిని నియమించుకునే ప్రైవేట్ లేదా ప్రభుత్వ సంస్థ ఏదైనప్పటికీ తప్పనిసరిగా లైంగిక వేధింపుల మీద ఫిర్యాదులు తీసుకోవటానికి ఒక అంతర్గత కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలయి ప్రతి జిల్లాలో ఒక స్థానిక కమిటీని ఏర్పాటు చేసి, 10 మంది లోపు సిబ్బంది ఉన్న సంస్థలలో యజమాని మీదనే ఫిర్యాదు ఉన్నపక్షంలో ఆ ఫిర్యాదులు తీసుకోవాలి.

కోవిడ-19 సంక్షోభ సమయంలో ప్రభుత్వం ఈ విషయంలో అనేక చర్యలు తీసుకుంది. వన్ స్టాప్ సెంటర్స్ లాంటి సంస్థలు, మహిళల హెల్ప్ లైన్ సార్వత్రీకరణ, ఉజ్జ్వల హోమ్స్, స్వధార గ్రే, బాలికా సంరక్షణ సంస్థలు, చైల్డ్ లైన్ (1098), ఎమర్జెన్సీ స్పందన సహాయ వ్యవస్థ (112) అందుబాటులో ఉండేట్టు, మహిళలకు సత్వర సేవలు అందేలా చూసింది. లాక్ డౌన్ సమయంలో జాతీయ మహిళా కమిషన్ కూడా క్లిష్టపరిస్థితుల్లో ఉన్న మహిళలకోసం తగిన సహాయ చర్యలు చేపట్టింది.

కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర తేలి ఈ రోజు లోక్ సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన  లిఖిత పూర్వక సమాధానంలో ఈ సమాచారమ అందించారు. 

******

 


(Release ID: 1884851)
Read this release in: English , Urdu , Tamil