యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
పాటియాలా, లూధియానా, అమృత్ సర్ లో ఖేలో ఇండియా మహిళల ట్రాక్ సైక్లింగ్
Posted On:
18 DEC 2022 7:09PM by PIB Hyderabad
ముఖ్యాంశాలు :
నాలుగు జోన్స్ లోనూ జరిగే ఈ టోర్నమెంట్ కు యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖలోని క్రీడా విభాగం రూ. 1.15 కోట్లు మంజూరు చేసింది.
మొదటిసారిగా ఖేలో ఇండియా మహిళల టోర్నమెంట్ లో ట్రాక్ సైక్లింగ్ కూడా జోడించారు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి ఎన్ ఎస్ ఎన్ ఐ ఎస్ మొదటి దశ నార్త్ జోన్ అమృత్ సర్ కు ఆతిథ్యమిస్తుంది. ఈ పోటీ డిసెంబర్ 20, 21 తేదీలలో ఎన్ ఎస్ ఎన్ ఐ ఎస్ ఆవరణలో జరుగుతుంది. ఆ తరువాత నార్త్ జోన్ పోటీలు లూధియానాలోని పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి, అమృత్ సర్ లోని గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయానికి వెళతాయి. అక్కడ డిసెంబర్ 23-24 తేదేలలో, డిసెంబర్ 28-29 తేదీలలో జరుగుతాయి.
సౌత్ జోన్ మొదటి దశ కూడా తిరువనంతపురం లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆవరణలో డిసెంబర్ 26,27 తేదీలలో జరుగుతాయి. కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ సహకారంతో భారత సైక్లింగ్ సమాఖ్య ఈ టోర్నమెంట్ నిర్వహిస్తోంది. వివిధ విభాలలో పోటీలు జరుగుతాయి.
ఖేలో ఇండియా మహిళా క్రీడల విభాగంలో ఈ ఏడాది జరిగే రోడ్ సైక్లింగ్ ఈవెంట్ లో డిసెంబర్ 24-25 తేదీల్లో బికనేర్ లో, తిరువనంతపురంలో డిసెంబర్ 29-30 తేదీల్లో జరిగే జరిగే రోడ్ ఈవెంట్ ఉంటాయి.
(Release ID: 1884708)
Visitor Counter : 136