సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉత్తరప్రదేశ్ స్టేట్ ఆర్కైవ్స్‌లో 2022 డిసెంబర్ 18-19 తేదీల్లో రెండురోజుల పాటు జరగనున్న ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిటీ 63వ సమావేశం

Posted On: 18 DEC 2022 9:34AM by PIB Hyderabad

• 1600 తర్వాత భారతీయ చరిత్ర యొక్క అసలు మూలాల ఆధారంగా వివిధ అంశాలపై  మొత్తం 24 పత్రాలు సమర్పించనున్న పరిశోధకులు 
• ది ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిటీ 63 వ సమావేశాలు ప్రారంభించనున్న  ఉత్తరప్రదేశ్  రవాణా మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర  బాధ్యత)శ్రీ  దయా శంకర్ సింగ్ 

హైదరాబాద్, డిసెంబర్ 18:

ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిటీ 63వ సమావేశం 2022 డిసెంబర్ 18-19  తేదీల్లో రెండు రోజుల పాటు లక్నోబి- మహానగర్ ఎక్సటెన్షన్ లో ఉన్న ఉత్తరప్రదేశ్ స్టేట్ ఆర్కైవ్స్‌లో జరగనున్నది. మొదటి రోజు ప్రారంభ సమావేశం, వ్యాపార సదస్సులు జరుగుతాయి. రెండో రోజు విద్యా సదస్సు జరుగుతుంది. 1600 తర్వాత భారతీయ చరిత్ర యొక్క అసలు మూలాల ఆధారంగా వివిధ అంశాలపై  మొత్తం 24  పరిశోధకులు పత్రాలు సమర్పిస్తారు.  

  ఉత్తరప్రదేశ్  రవాణా మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర  బాధ్యత)శ్రీ  దయా శంకర్ సింగ్ 2022 డిసెంబర్ 22 వ తేదీ ఉదయం 10.30 గంటలకు సమావేశాలు ప్రారంభిస్తారు.   నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా సేకరించిన పురాతన  మూలాధారాలు ఆధారంగా “స్వాతంత్ర్య పోరాటం-  స్వాతంత్ర్య సమారా యుద్ధంలో  తెలిసిన మరియు తక్కువ-తెలిసిన పోరాటాలు” పేరుతో రూపొందించిన ప్రదర్శనను  మంత్రి ప్రారంభిస్తారు. 

ప్రారంభ సమావేశంలో  ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సంస్కృతి, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి  శ్రీ ముఖేష్ మెష్రామ్  ప్రతినిధులకు స్వాగతం పలుకుతారు.  నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ మరియు ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిటీ కార్యదర్శి శ్రీ చందన్ సిన్హా ఆర్కైవ్స్ అభివృద్ధి పై నివేదిక సమర్పిస్తారు. ఈ సందర్భంగా లక్నోలోని ఉత్తరప్రదేశ్ స్టేట్ ఆర్కైవ్స్ డైరెక్టర్ మరియు ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిటీ స్థానిక కార్యదర్శి   శ్రీమతి ఉమా దివేది వందన సమర్పణ చేస్తారు.  

  రికార్డుల నిర్వహణ మరియు చారిత్రక పరిశోధన కోసం వాటి ఉపయోగం తో ముడిపడి ఉన్న వివిధ అంశాలపై కేంద్ర  ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందించేందుకు 1919లో  ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిటీ (IHRC) ఏర్పాటు చేయబడింది.  రికార్డుల సృష్టికర్తలు, సంరక్షకులు మరియు వినియోగదారుల అఖిల భారత సంస్థగా ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిటీ  పనిచేస్తోంది. ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిటీ సచివాలయంగా  నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా పనిచేస్తుంది. (1911లో ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిటీగా మార్చబడింది). కేంద్ర సాంస్కృతిక మంత్రి అధ్యక్షతన ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిటీ పనిచేస్తుంది.  కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రతినిధులు, రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల  ఆర్కైవ్‌లు, విశ్వవిద్యాలయాలు, గుర్తింపు పొందిన సంస్థలకు చెందిన 134 మంది ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిటీ   సభ్యులుగా  ఉన్నారు. ఇంతవరకు ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిటీ సమావేశాలు 62 సార్లు జరిగాయి. 

సమావేశాల నిర్వహణ కోసం రెండు కమిటీలు ఏర్పాటు అయ్యాయి.  (i)  సమావేశంలో  సమర్పించడానికి చరిత్ర మూలాలు ఆధారంగా సిద్ధమైన పరిశోధనా పత్రాలు పరిశీలించడానికి మరియు ఆమోదించడానికి ఎడిటోరియల్ కమిటీ మరియు (ii) కమిటీ తన సిఫార్సులపై తీసుకున్న చర్యలను సమీక్షించడానికి మరియు దానిని వ్యక్తీకరించడానికి స్టాండింగ్  కమిటీ సమావేశానికి సంబంధించిన ఎజెండాపై అభిప్రాయాలు పరిశీలించడానికి కమిటీలు ఏర్పాటు అయ్యాయి. ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిటీ నియమించిన స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా కేంద్ర  సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి  వ్యవహరిస్తారు.

***


(Release ID: 1884706) Visitor Counter : 177


Read this release in: English , Urdu , Hindi , Tamil