రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎన్ఐటీ మణిపూర్‌తో ఎన్.హెచ్.ఐ.డి.సి.ఎల్ అవగాహన ఒప్పందం

Posted On: 16 DEC 2022 3:43PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ అధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థ ‘జాతీయ రహదారులు & మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్’ (ఎన్.హెచ్.ఐ.డి.సి.ఎల్).. తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్న హైవేల నిర్మాణంలో ఎదురయ్యే సవాళ్లకు ఆచరణాత్మక పరిష్కారాలను కనుగొనడానికి వినూత్న సాంకేతికతలను కోరుకుంటోంది,  వాటిని ప్రోత్సహిస్తోంది. ఆ ప్రక్రియలో భాగంగా ప్రస్తుత సంవత్సరం 2022-23లో ఎన్.హెచ్.ఐ.డి.సి.ఎల్, ఐఐటీ రూర్కీ, ఐఐటీ కాన్పూర్, సీఎస్ఐఆర్-సీఆర్ఆర్ఐ, ఎన్.ఎస్.డి.సి, ఐఐటీ పట్నా, ఎన్ఐటీ శ్రీనగర్, ఎన్ఐటీ అగర్తల, ఎన్ఐటీ సిల్చార్, ఎన్ఐటీ ఉత్తరాఖండ్, ఎన్ఐటీ నాగాలాండ్ ఎన్ఐటీ సిక్కిం, ఐఐటీ ఖరగ్‌పుర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఐఐటీమండి మరియు ఎన్ఐటీ జోట్, అరుణాచల్ ప్రదేశ్ సంస్థలతో అవగాహాన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. గతంలో ఎన్.హెచ్.ఐ.డి.సి.ఎల్ ఐఐటీ బాంబే & ఐఐటీ గౌహతితో అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. ఇలాంటి అవగాహన ఒప్పందాలకు కుదుర్చుకునేందుకు గాను ఇతర ఐఐటీలు, ఎన్ఐటీలతో తదుపరి చర్చలు జరుపుతోంది. 14 డిసెంబర్ 2022న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్ఐటీ మణిపూర్‌తో తాజా అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంపై ఎన్ఐటీ మణిపూర్ డైరెక్టర్ ప్రొ.(డా) గౌతమ్ సూత్రధార్, ఎన్.హెచ్.ఐ.డి.సి.ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ చంచల్ కుమార్ సంతకాలు చేశారు. 

***


(Release ID: 1884281)