సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
గత రెండేళ్ళ కాలంలో ప్రగతి యంత్రాంగం, ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ (పిఎంజి) భారీ ప్రాజెక్టులకు సంబంధించిన దాదాపు 696 సమస్యల పరిష్కారం - డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
15 DEC 2022 12:53PM by PIB Hyderabad
గత రెండేళ్ళలో దాదాపు ప్రగతి, ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ (పిఎంజి) యంత్రాంగం ద్వారా భారీ ప్రాజెక్టులకు సంబంధించిన 696 సమస్యలను పరిష్కరించినట్టు కేంద్ర శాస్త్ర &సాంకేతిక (ఇండిపెండెంట్ ఛార్జి) సహాయ మంత్రి; ఎర్త్ సైన్సెస్ (ఇండిపెండెంట్ ఛార్జి) సహాయ మంత్రి, ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా సమస్యలు, పింఛన్లు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
గురువారం రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వకంగా జవాబు ఇస్తూ, ప్రగతి (ప్రో-యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్) అనేది ఐసిటి ఆధారిత బహుళార్ధ సాధక, బహుళ నమూనా వేదిక. ముఖ్యమైన పథకాలు/ కార్యక్రమాలు/ భారత ప్రభుత్వ ప్రాజెక్టులతో పాటు రాష్ట్రప్రభుత్వాలు సకాలంలో అమలు, ఆశించిన ఫలితాల కోసం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ప్రాజెక్టులను సమీక్షించడం ఈ వేదిక లక్ష్యం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భాగస్వాములందరూ కూడా ప్రగతి సమావేశాలలో పాల్గొంటారని వెల్లడించారు. ఈ వేదిక, భాగస్వాముల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడమే కాక వాటాదారుల మధ్య చర్చలు, సమాచార మార్పిడి ద్వారా సమస్యలను పరిష్కరించి తద్వారా ప్రాజెక్టుల మెరుగైన పర్యవేక్షణకు, వేగవంతమైన అమలుకు తోడ్పడింది.
***
(Release ID: 1883965)