నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
అంతరిక్ష పరిశ్రమ రంగంలో సరికొత్త పోకడలపై ఇస్రో ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ
- బెంగళూరు, ముంబయి, త్రివేండ్రం నగరాలలో కొనసాగుతున్న శిక్షణా కార్యక్రమం
- మొదటి శిక్షణ కార్యక్రమం బెంగళూరులోని ఎన్ఎస్టీఐలో ప్రారంభించబడింది
Posted On:
15 DEC 2022 1:18PM by PIB Hyderabad
ముఖ్య ముఖ్యాంశాలు:
I. డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ (ఇస్రో)లో సాంకేతిక ఉద్యోగుల నైపుణ్యాన్ని పెంపొందించడానికి స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ (ఎం.ఎస్.డి.ఈ) మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఒక అవగాహన ఒప్పందం (మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్)పై సంతకం చేశాయి.
II. ఎం.ఎస్.డి.ఈ ద్వారా 4000 మంది ఇస్రో సాంకేతిక సిబ్బందికి వచ్చే ఐదు సంవత్సరాలలో శిక్షణ ఇవ్వబడుతుంది
మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (ఎం.ఎస్.డి.ఈ) ఆధ్వర్యంలోని నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు బెంగళూరు, ముంబయి మరియు త్రివేండ్రంలో ఇస్రో సాంకేతిక శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ కర్మయోగి మిషన్‌కు అనుగుణంగా, ప్రభుత్వ సిబ్బంది నైపుణ్యాలను పెంపొందించడం మరియు ప్రపంచ అంతరిక్ష పరిశ్రమలో భారతదేశం యొక్క వాటాను పెంచడానికి మరింత దోహదపడే లక్ష్యంతో సామర్థ్యపెంపు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్.ఎస్.టి.ఐ బెంగళూరులో నిర్వహించి శిక్షణా కార్యక్రమాన్ని ఇస్రో హెచ్‌క్యూలోని సీబీపీఓ డైరెక్టర్ శ్రీ సుధీర్ కుమార్ ప్రారంభించారు. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (ఎం.ఎస్.డి.ఈ) మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ (ఇస్రో)లో సాంకేతిక ఉద్యోగులను మెరుగుపరచడానికి ఒక అవగాహన ఒప్పందంపై (మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్) సంతకం చేశాయి. ఈ సహకారంతో, ఇస్రో సాంకేతిక శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేసింది.
దేశ అంతరిక్ష పరిశ్రమలో తాజా పోకడలు మరియు అవసరాలకు అనుగుణంగా ఇస్రో టెక్నికల్ ఉద్యోగులకు వారి సామర్థ్యాన్ని పెంచడానికి, నైపుణ్యాలను పెంపొందించడానికి వారికి శిక్షణ అందించడానికి స్వల్పకాలిక కోర్సుల కోసం ఒక అధికారిక ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని ఈ కార్యక్రమం ఉద్దేశించింది. రానున్న ఐదేళ్లలో 4000 మందికి పైగా ఇస్రో సాంకేతిక సిబ్బందిభారతదేశంలోని వివిధ ఎన్ఎస్టీఐలలో ఈ కార్యక్రమంలో శిక్షణ పొందనున్నారు. ఎన్ఎస్టీఐ బెంగళూరు కేంద్రంలో శిక్షణా కార్యక్రమం హైడ్రాలిక్స్ సబ్జెక్ట్‌పై 'ఇండస్ట్రియల్ హైడ్రాలిక్ & కంట్రోల్స్' కోర్సుతో ప్రారంభమయింది. ఈ కోర్సులో ఫ్లూయిడ్ పవర్ సిస్టమ్స్, హైడ్రాలిక్స్ మరియు న్యూమాటిక్స్ మరియు బేసిక్ హైడ్రాలిక్ సూత్రాల మధ్య వ్యత్యాసం, హైడ్రాలిక్ సిస్టమ్ కాంపోనెంట్స్, హైడ్రాలిక్ సింబల్స్, ఫ్లో కంట్రోల్ వాల్వ్‌లు, ప్రెజర్ రెగ్యులేషన్ కాన్సెప్ట్, ప్రెజర్-నియంత్రిత వాల్వ్‌లు, హైడ్రాలిక్ అక్యుమ్యులేటర్లు మరియు ప్రాక్టికల్ డెమాన్‌స్ట్రేషన్‌లు వంటి అంశాలను ఈ శిక్షణ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. ఎన్ఎస్టీఐ ముంబయి కేంద్రంలో 'ఇండస్ట్రియల్ ఆటోమేషన్' కోర్సుతో, ఎన్ఎస్టీఐ త్రివేండ్రంలో 'సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్' కోర్సుతో తో కార్యక్రమం ప్రారంభమైంది. కోర్సు యొక్క వ్యవధి 5 రోజులు. ప్రతి ఎన్ఎస్టీఐ లో 20 మంది ట్రైనీలు శిక్షణ పొందుతున్నారు. ఈ సందర్భంగా స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అతుల్ కుమార్ తివారీ మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల రాకతో భారతదేశ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఇలాంటి సామర్థ్యాలను పెంపొందించే కార్యక్రమాలు ఎంతో ప్రముఖ్యతను కలిగి ఉండనున్నట్టుగా తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమాల ద్వారా, ఇస్రోలోని ఉద్యోగులు పరిశ్రమలో వస్తున్న ట్రెండ్‌ల విషయమై అప్‌డేట్‌గా ఉండటమే కాకుండా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ఏకీకృతం చేయగలరు. వాటిని గురించి అర్థం చేసుకోగలరు, ఇది ఉద్యోగులకే కాకుండా ప్రపంచ అంతరిక్ష పోటీలో భారతదేశం తన పోటీతత్వాన్ని కొనసాగించడంలోనూ సహాయపడుతుంది. అంతరిక్ష పరిశ్రమ వృద్ధిని కొనసాగించడానికి ఈ తరహా కార్యక్రమాలు చాలా అవసరం మరియు మరిన్ని సాంకేతికతలు అభివృద్ధి చేసేందుకు అవి మరింత ముఖ్యమైనవిగా మారుతాయని ఆయన తెలిపారు. ఆర్డీఎస్డీఈ రీజనల్ డైరెక్టర్ శ్రీ బి.ఎన్. శ్రీధర్ మార్గదర్శకత్వంలో ఇప్పటి వరకు ఎన్ఎస్టీఐ బెంగళూరులో ఆరు శిక్షణా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ శిక్షణా కార్యక్రమం కింద ఏరోస్పేస్ సీఎన్సీ మ్యాచింగ్, నాణ్యత తనిఖీ, అధునాతన వెల్డింగ్ పద్ధతులు, పీఎల్సీ ఆటోమేషన్, ఎలక్ట్రో-న్యూమాటిక్స్, ఇంజినీరింగ్ తనిఖీ, నాణ్యత నియంత్రణ, పంపులు మరియు వాల్వ్‌ల ఆపరేషన్ మరియు నిర్వహణ, మరియు ఉత్పాదక ప్రక్రియలు మరియు ఉత్పాదక సాంకేతికతల్లోని వివిధ సాంకేతికతలు గురించిన శిక్షణాంశాలు ఉన్నాయి.
*****
(Release ID: 1883964)