సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
గత మూడేళ్ళ కాలంలో 60 లక్షల ఫిర్యాదులను అందుకున్న కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కారం & పర్యవేక్షణ వ్యవస్థ (సిపిజిఆర్ఎఎంఎస్) - డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
15 DEC 2022 1:00PM by PIB Hyderabad
- జనవరి 2021 నుంచి 2022 వరకు మొత్తం 2,40,932 అప్పీళ్ళు దాఖలు కాగా, ఈ కాలంలో 40,73, 464 సమస్యలను పరిష్కరించినట్టు మంత్రి తెలిపారు.
- సమస్యల పరిష్కారంపై పౌరుల ఫీడ్ బ్యాక్‌ను తీసుకునేందుకు ప్రభుత్వం ఒక ఫీడ్ బ్యాక్ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.
- సమస్య పరిష్కారం వారికి సంతృప్తికరంగా లేకపోతే, పౌరులు కాల్ సెంటర్ ద్వారా కూడా అప్పీళ్ళను దాఖలు చేసుకోవచ్చు.
కేంద్రీకృత ప్రజా సమస్యల పరిష్కారం, పర్యవేక్షణ వ్యవస్థ (సిపిజిఆర్ఎఎంఎస్) గత మూడేళ్ళలో, అంటే 01.01.2020 నుంచి 30.11.2022 వరకు 60 లక్షలకు పైగా ఫిర్యాదులను అందుకుందని కేంద్ర శాస్త్ర &సాంకేతిక (ఇండిపెండెంట్ ఛార్జి) సహాయ మంత్రి; ఎర్త్ సైన్సెస్ (ఇండిపెండెంట్ ఛార్జి) సహాయ మంత్రి, ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా సమస్యలు, పింఛన్లు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
గురువారంనాడు రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో, ప్రభుత్వం సమయోచితంగా, సమర్ధవంతంగా సమస్యలను పరిష్కరించడం పట్ల సున్నితంగా, స్పందనాత్మకంగా ఉందని, పౌరులు తమ ఫీడ్ బ్యాక్‌ను పోర్టల్‌పై నమోదు చేసే సౌలభ్యాన్ని సిపిజిఆర్ఎఎంఎస్ అందిస్తోందని, ఒకవేళ పరిష్కారం సరిగ్గా లేదనే రేటింగ్ వస్తే, తదుపరి ఉన్నత అధికారికి అప్పీలును దాఖలు చేసే ప్రత్యామ్నాయాన్ని కూడా ఎనేబుల్ చేశారని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు.
సమస్యల పరిష్కారం పట్ల పౌరుల ప్రతిస్పందనను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఫీడ్‌బ్యాక్ కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసినట్టు మంత్రి వెల్లడించారు. ఒకవేళ సమస్యా పరిష్కారం పట్ల పౌరుడు సంతృప్తికరంగా లేకపోతే, వారు కాల్‌సెంటర్ ద్వారా అప్పీల్ దాఖలు చేయవచ్చన్నారు.
జనవరి 2021 నుంచి నవంబర్ 2022 కాలంలో మొత్తం 2,40,932 అప్పీళ్ళు దాఖలు చేయగా, ఇదే కాలంలో 40,73,464 సమస్యలు పరిష్కారం అయ్యాయి.
సమస్యా పరిష్కార అధికారులు(జిఆర్ఓ)లను సున్నితపరిచేందుకు, సమర్ధవంతంగా సమస్యలను నిర్వహించేందుకు వారి సామర్ధ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది.
సేవోత్తం కింద సమస్యా పరిష్కారంలో అధికారులకు శిక్షణ, జిఆర్ఒల పనితీరును సమీక్షించేందుకు పర్యవేక్షణా డాష్‌బోర్డుల నిర్వహణ, గ్రీవెన్స్ అధిరులు, నోడల్ అధికారులతో క్రమంతప్పకుండా సమీక్షా సమావేశాలు,సిపిజిఆర్ఎఎంఎస్ పై నెలవారీ నివేదికలను ప్రచురించడం, నూతన తరం సాంకేతిక సహాయంతో సమస్యల మూలకారణాన్ని విశ్లేషించే సౌకర్యాన్ని నిర్మించడం.
ఇదే కాలంలో అందుకున్న, పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదుల రాష్ట్రవారీ వివరాలు అనెక్చర్‌లో ఇవ్వడం జరిగింది.
***
(Release ID: 1883963)