పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
వాతావరణ మార్పు మీద వ్యూహాత్మక జ్ఞానం కోసం జాతీయ మిషన్
Posted On:
15 DEC 2022 2:57PM by PIB Hyderabad
యావత్ ప్రపంచం ఎదుర్కుంటున్న వాతావరణ మార్పు సవాలును ఎదుర్కోవటానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2022 ఆగస్టు లోనే భారతదేశం ఎన్డీసీలను అప్ డేట్ చేసింది. 2022 నవంబర్ లో “భారతదేశపు దీర్ఘకాల స్వల్ప కర్బన అభివృద్ధి వ్యూహం” మీద ఒక చట్రాన్ని ప్రతిపాదిస్తూ డాక్యుమెంట్ తయారుచేసి ఐక్యరాజ్య సమితి సచివాలయానికి పంపింది. 2070 నాటికి జీరో కార్బన్ స్థాయి సాధించటం లక్ష్యం. ప్రభుత్వం వాతావరణ మార్పు మీద జాతీయ కార్యాచరణ పథకం (ఎన్ ఎ పి సి సి) సహా అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తోంది. అందులో సౌర శక్తి సంబంధ కార్యక్రమాలు, ఇంధన సామర్థ్యం, నీరు, సుస్థిర వ్యవసాయం, హిమాలయ పర్యావరణం సుస్థిర పర్యావరణ వ్యవస్థ, హరిత భారత్, వాతావరణ మార్పుకు ఆరోగ్య, వ్యూహాత్మక జ్ఞానం లాంటివి అందులో ఉన్నాయి.
సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్ అమలు చేసే “వాతావరణ మార్పుకు ఆరోగ్య, వ్యూహాత్మక జ్ఞానం మీద జాతీయ మిషన్ (ఎన్ ఎం ఎస్ కె సి సి)” వాతావరణ శాస్త్రానికి సంబంధించి పరిశోధనను, జ్ఞాన సృష్టిని, సామర్థ్య నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుంది. దేశం నిర్ణయించుకున్న ప్రాధాన్యాలకనుగుణంగా ఈ మిషన్ దాని లక్ష్యాలలో తగిన మార్పులు చేసుకుంది.
వాతావరణ మార్పుకు సంబంధించిన పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి సారించి ఆ కార్యకలాపాలను 12 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ లోనూ, 23 ప్రధాన ఆర్ అండ్ డి కార్యక్రమాలలోనూ, 7 నెట్ వర్క్ కార్యక్రమాల్లోనూ, 7 సామర్థ్య నిర్మాణ కార్యక్రమాల్లోనూ వినియోగిస్తున్నారు. బీహార్, చత్తీస్ గఢ్, గుజరాత్, హర్యానా, కర్ణాటక, కేరళ, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణలో 13 వాతావరణ మార్పు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆయా రాష్ట్రాల కార్యాచరణ ప్రణాళికలతో అనుసంధానం చేయాలని నిర్ణయించారు.
పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే ఈ రోజు రాజ్యసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ సమాచారం ఇచ్చారు.
***
(Release ID: 1883959)
Visitor Counter : 190