యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రస్తుతం స్పోర్ట్స్ అథారిటీలో 959 మంది కోచ్ లు : శ్రీ అనురాగ్ ఠాకూర్

Posted On: 15 DEC 2022 2:56PM by PIB Hyderabad

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలోని వివిధ క్రీడా విభాగాలకు, గుర్తింపు పొందిన వివిధ జాతీయ క్రీడా సమాఖ్యలకు కోచ్ ల నియామకం ఒక  నిరంతర ప్రక్రియ. జాతీయ క్రీడా సమాఖ్యలు తమ వార్షిక కాలెండర్ కు అనుగుణంగా పోటీలకు తగినట్టు శిక్షణ కోసం తమంతట తాముగా విదేశీ నిపుణుల సేవలు తీసుకోవచ్చు.  అయితే, ఒక్కో సమాఖ్య  స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ను సంప్రదించి ఆ విధంగా తీసుకునే కోచ్ ల ఫలితాలను కూడా తెలియజేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) లో 959 మంది కోచ్ లు పనిచేస్తుండగా వీరందరూ భారతీయులే. 

భారత, విదేశీ కోచ్ ల కు ఇచ్చే జీతభత్యాలు వేరువేరుగా ఉంటాయి.  భారత కోచ్ లకు ఇచ్చే జీత భత్యాలు 7 వ సెంట్రల్  పే కమిషన్ సిఫార్సులకు అనుగుణంగానం కాంట్రాక్టు కోచ్ లు అయితే కాంట్రాక్ట్ నిబంధనలకు అనుగుణంగాను ఉంటాయి.  విదేశీ కోచ్ ల విషయానికొస్తే సంబంధిత జాతీయ క్రీడా సమాఖ్య సిఫార్సులకు అనుగుణంగా, డిమాండ్ -సప్లై సూత్రాలకు తగినట్టుగా ఉంటాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితి, వాళ్ళ అర్హతలు, అనుభవం, చివరి జీతం తదితర అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు. ఒక్కో క్రీడాంశాన్ని బట్టి . డిమాండ్ ను బట్టి కూడా జీతభత్యాలు మారుతూ ఉంటాయి.   

ప్రభుత్వం (యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ) ఇప్పటికే జీతాభత్యాలు, విదేశీ కోచ్ లు, నిపుణుల  సౌకర్యాలను 2022 ఫిబ్రవరిలోనే పెంచింది. మార్కెట్ రేట్లు, డిమాండ్-సప్లై ఆధారంగానే ఈ మార్పు జరిగింది. అయితే అది మొత్తంగా జాతీయ క్రీడా సమాఖ్యకు ఆమోదించిన మొత్తం బడ్జెట్ లో 30% మించదు. భారత కోచ్ ల విషయానికొస్తే, 7 వ సెంట్రల్ పే కమిషన్ సిఫార్సుల మేరకు  వార్షిక ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి. కాంట్రాక్ట్ మీద పనిచేసే వారైతే ఏటా 10% ఇంక్రిమెంట్ ఉంటుంది. కోచ్ ల జీతాభత్యాలు ఇలా ఉన్నాయి:

కాంట్రాక్టుమీద పనిచేసే అసిస్టెంట్ కోచ్ : రూ. 50,300;

కోచ్: రూ 1,05,000;

సీనియర్ కోచ్:  రూ. 1,25,000;

చీఫ్ కోచ్:  రూ. 1,65,000.

ఈ సమాచారాన్ని యువజన వ్యవహారాలు, క్రీడాశాఖామంత్రి శ్రీ అనురాగ సింగ్ ఠాకూర్ ఈరోజు  రాజ్యసభలో ఒకప్రశ్నకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఇచ్చారు.  .

 

***


(Release ID: 1883828)