వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా రేషన్ కార్డుల బదిలీ పధకం కోసం ఒక దేశం ఒకే రేషన్ కార్డ్ (ONORC) కింద గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో 2020-21, 2021-22 మరియు 2022-23లో రాష్ట్రాలు/ యూ టీ లు, ఎన్ ఐ సీ/ ఎన్ ఐ సీ ఎస్ ఐ కి రూ.46.86 కోట్లు ఆర్థిక సహాయం విడుదలయ్యాయి.
Posted On:
14 DEC 2022 3:22PM by PIB Hyderabad
కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రి శ్రీమతి సాధ్వి నిరంజన్ జ్యోతి ఈరోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో బయోమెట్రిక్ ప్రమాణీకరణతో సాంకేతికతతో నడిచే ఒక దేశం ఒకే రేషన్ కార్డ్ (ONORC) విధానం ద్వారా జాతీయస్థాయి లో లబ్ధిదారులందరూ ఆహార భద్రతా చట్టం, 2013 (NFSA), ముఖ్యంగా వలస లబ్ధిదారులు, దేశంలోని ఏదైనా ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ePoS) సాంకేతిక పరిజ్ఞానం గల సరసమైన ధరల దుకాణం (FPS) నుండి వారి ప్రస్తుత రేషన్‌ను వారి నెలవారీ అర్హత కనుగుణంగా బయోమెట్రిక్ ప్రమాణీకరణతో కార్డ్ లేదా ఆధార్ నంబర్ ను ఉయోగించి ఆహార ధాన్యాలను భాగాలుగా లేదా పూర్తిగా తీసుకోవచ్చు. ఇంటి వద్దే వున్న వారి కుటుంబ సభ్యులు, మిగిలిన భాగం ఏదైనా ఉంటే, అదే రేషన్ కార్డ్‌లోని ఆహార ధాన్యాల భాగాన్ని కూడా తీసుకోవచ్చు.
రేషన్ కార్డుల దేశవ్యాప్త బదిలీ కోసం ఒక దేశం ఒకే రేషన్ కార్డ్ (ONORC) ప్లాన్ ప్రజా పంపిణీ సమగ్ర నిర్వహణ వ్యవస్థ (ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్) (IM-PDS) కేంద్ర ప్రభుత్వ పధకం కింద అమలు చేయబడింది, ఇది ఏప్రిల్ 2018లో మొత్తం రూ. 127.3 కోట్లు గా ఉండేది. ఈ పథకం 31 మార్చి 2023 వరకు పొడిగించబడింది. ఇప్పటివరకు, రూ. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో 2020-21 (రూ.12.65 కోట్లు), 2021-22 (రూ.23.76 కోట్లు) మరియు 2022-23 (రూ. 10.45 కోట్లు)లో రాష్ట్రాలు/యుటిలు, ఎన్‌ఐసి/ఎన్‌ఐసిఎస్‌ఐ మొదలైన వాటికి 46.86 కోట్లు విడుదలయ్యాయి.
జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 (ఎన్ ఎఫ్ ఎస్ ఏ) లబ్ధిదారుల దేశవ్యాప్త బదిలీ కోసం ఒక దేశం ఒకే రేషన్ కార్డ్ ప్లాన్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 36 రాష్ట్రాలు/ యూ టీ లలో ప్రారంభించబడింది, దేశ వ్యాప్తంగా ఎన్ ఎఫ్ ఎస్ ఏ విస్తరించింది. (సుమారు 80 కోట్ల ఎన్ ఎఫ్ ఎస్ ఏ) లబ్ధిదారులు). ప్రస్తుతం దేశంలో ప్రతి నెలా సగటున దాదాపు 3.5 కోట్ల బదిలీ లావాదేవీలు ఒక దేశం ఒకే రేషన్ కార్డ్ కింద జరుగుతున్నాయి. ఇప్పటివరకు, ఒక దేశం ఒకే రేషన్ కార్డ్ కింద మొత్తం 93.31 కోట్ల బదిలీ లావాదేవీలు నమోదు చేయబడ్డాయి.
ఎన్ ఎఫ్ ఎస్ ఏ లబ్ధిదారులకు ఒక దేశం ఒకే రేషన్ కార్డ్ గురించి వివిధ రీతుల్లో అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించబడింది. 167 ఎఫ్ ఎం మరియు 91 కమ్యూనిటీ రేడియో స్టేషన్‌లు, రైల్వే స్టేషన్‌లలో ఆడియో విజువల్ స్పాట్‌లు, బ్యానర్‌లు, అవుట్‌డోర్‌లో పోస్టర్‌లు మరియు సరసమైన ధరల దుకాణాలు వద్ద ప్రచారం , బస్సులపై ప్రచారం చేస్తోంది. అంతే కాకుండా రాష్ట్రాలు/ యూ టీ లు తమ స్వంత ప్రసార మాధ్యమాలు మార్గాలను ఇటువంటి ప్రచారాల కోసం ఉపయోగిస్తున్నాయి. 13 భాషల్లో అందుబాటులో ఉన్న “మేరా రేషన్” యాప్ లో ఇప్పటివరకు దాదాపు 20 లక్షల డౌన్‌లోడ్‌లు జరిగాయి.
***
(Release ID: 1883663)
Visitor Counter : 159