బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2022 నవంబర్ వరకు బొగ్గు ఉత్పత్తి, బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి

Posted On: 14 DEC 2022 1:02PM by PIB Hyderabad

జాతీయ స్థాయిలో 2021-22 సంవత్సరానికి జరిగిన మొత్తం బొగ్గు ఉత్పత్తి   778.19 మిలియన్ టన్నులు కాగా అంతకు ముందు సంవత్సరం 2020-21 లో 716.083 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగింది.  పైగా, ఈ ఆర్థియ సంవత్సరంలో నవంబర్ 2022 వరకు దేశం 524.2 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసింది. నిరుడు ఇదే కాలంలో జరిగిన ఉత్పత్తి 448.1 మొలియం టన్నులు. అంటే, ఈ సారి పెరుగుదల సుమారు 17% నమోదైంది.  కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సి ఈ ఏ) అందించిన సమాచారం 2022 డిసెంబర్ 7 నాటికి బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల దగ్గర ఉన్న బొగ్గు నిల్వ సుమారు 31 మిలియన్ టన్నులు.  85% ఉత్పతి స్థాయి చొప్పున  ఇది సగటున 11 రోజుల ఉత్పత్తికి సరిపోతుంది. అందువలన దేశంలో బొగ్గు కొరత లేదు. 

బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి వివరాలు, మొత్తం విద్యుదుత్పత్తి మొత్తం విద్యుదుత్పత్తిలో బొగ్గు ఆధారిత విద్యుత్ వాటా తదితర వివరాలను గడిచిన మూడేళ్ళ కాలపు సమాచారం దిగువన ఇవ్వబడింది.

ఇంధనం  

2020-21

2021-22

2022-23(ఏప్రిల్ నుంచి నవంబర్ దాకా )*

బొగ్గు ఆధారిత ఉత్పత్తి ( బిలియన్ యూనిట్లు)

950.9

1041.5

747.8

మొత్తం ఉత్పత్తి ( బిలియన్ యూనిట్లు)  

1381.9

1491.9

1089.9

విద్యుదాధార ఉత్పత్తి వాటా %

68.8

69.8

68.6

* తాత్కాలికం

  ఈ సమాచారం  బొగ్గు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖా  శాఖామంత్రి శ్రీ ప్రహ్లాద జోషి ఏరోజు లోక్ సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం

 

 ***


(Release ID: 1883554) Visitor Counter : 149