ఉక్కు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉక్కు రంగంలో పెట్టుబడి

Posted On: 14 DEC 2022 2:34PM by PIB Hyderabad

ఉక్కు రంగం ఒక అనియంత్రిత రంగం కాబట్టి, ఈ రంగం అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా వసతుల కల్పనదారుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఉక్కు ఉత్పత్తిదారులకు విధానపరమైన మద్దతు, మార్గదర్శకత్వం అందించడం ద్వారా ఉక్కు ఉత్పత్తిలో “స్వయం సమృద్ధి” సాధించడానికి అనువైన వాతావరణాన్ని అందించడం జాతీయ ఉక్కు విధానం, 2017 లక్ష్యం. ఇందుకోసం తీసుకున్న చర్యలు ఇవి:

  • i. ఇది కొత్త పెట్టుబడులను తీసుకొచ్చే ప్రాజెక్టులను గుర్తించడం, ప్రాజెక్టుల క్రమాన్ని మూల్యాంకనం చేయడం, ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం కోసం ఒక ప్రాజెక్టు అభివృద్ధి విభాగం (పీడీసీ) మంత్రిత్వ శాఖలో ఏర్పాటైంది.
  1. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా దేశీయ వినియోగం & ఎగుమతి కోసం దేశంలోనే స్పెషాలిటీ స్టీల్ తయారీని ప్రోత్సహించడానికి ఉత్పత్తి-ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం కింద రూ.6,322 కోట్లు ప్రకటన.
  2. ఇటీవల దుబాయ్‌లో జరిగిన వరల్డ్ ఎక్స్‌పో వంటి కార్యక్రమాల్లో పాల్గొనడం; భారతదేశ ఉక్కు రంగ నైపుణ్యాన్ని, పెట్టుబడి అవకాశాలను, భారతదేశంలో వ్యాపార విస్తరణ అవకాశాలను వివరించేందుకు జపాన్, కొరియా, రష్యా దేశాలకు చెందిన ఉక్కు వినియోగదారులతో మంత్రిత్వ శాఖ ప్రతినిధి బృందం చర్చలు
  3. భారత్‌లో తయారీ, పీఎం గతి-శక్తి జాతీయ బృహత్తర ప్రణాళిక సహా దేశంలో ఉక్కు వినియోగం, డిమాండ్, ఉక్కు రంగంలో పెట్టుబడులను పెంపొందించడానికి రైల్వేలు, రక్షణ, పెట్రోలియం & సహజ వాయువు, గృహ నిర్మాణం, పౌర విమానయానం, రోడ్డు రవాణా & జాతీయ రహదారులు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాలు సహా సంబంధిత వినియోగదారులతో మరింత సంబంధం
  4. భారత ఉక్కు రంగంలో పోటీతత్వాన్ని పెంపొందించడానికి కొన్ని ఉక్కు ఉత్పత్తుల మీద యాంటీ-డంపింగ్ సుంకం (ఏడీడీ), కౌంటర్‌వైలింగ్ సుంకం (సీవీడీ) వంటి వాటితో పాటు ఉక్కు ఉత్పత్తులు, ముడి పదార్థాల మీద ప్రాథమిక కస్టమ్స్ సుంకంలో సవరణలు.

vi.  2016 అక్టోబర్ 27న  కేంద్ర మంత్రివర్గం సూత్రప్రాయ ఆమోదం ప్రకారం, సేలం ఉక్కు కర్మాగారం వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో ఉంది.

ప్రపంచంలో ముడి ఉక్కు ఉత్పత్తిలో భారతదేశం రెండో అతి పెద్ద దేశం. 2019-20లో ముడి ఉక్కు సామర్థ్యం 142.299 ఎం.టి.గా (మిలియన్ టన్నులు) ఉంటే, 2021-22లో 154.062 ఎం.టి.లకు పెరిగింది. రాష్ట్రాల వారీగా, సంవత్సరాల వారీగా గత మూడు సంవత్సరాల్లో ఉక్కు సామర్ధ్యం వివరాలు ఈ క్రింది పట్టికలో ఉన్నాయి:

ముడి ఉక్కు: రాష్ట్రం వారీగా సామర్థ్యం ('000 టన్నులు)

రాష్ట్రం

2019-20

2020-21

2021-22

ఆంధ్రప్రదేశ్

8391

8614

8512

అరుణాచల్ ప్రదేశ్

125

125

72

అసోం

131

131

163

బిహార్

803

830

812

చత్తీస్‌గఢ్

18785

19191

20900

దాద్రా & నగర్‌ హవేలీ

296

168

286

డామన్ & డయ్యు

46

46

50

దిల్లీ

16

16

16

గోవా

481

405

495

గుజరాత్

12754

13688

13512

హరియాణా

953

1037

1056

హిమాచల్ ప్రదేశ్

1139

1144

1740

జమ్ము & కశ్మీర్‌

189

189

189

జార్ఖండ్

19707

19488

20506

కర్ణాటక

15149

15261

14249

కేరళ

480

480

473

మధ్యప్రదేశ్

553

457

987

మహారాష్ట్ర

11961

12030

18038

మేఘాలయ

181

181

201

ఒడిశా

25370

25330

24587

పుదుచ్చేరి

340

364

451

పంజాబ్

4924

5064

5506

రాజస్థాన్

1176

1005

933

తమిళనాడు

3766

3722

3744

తెలంగాణ

1443

1605

2033

త్రిపుర

30

30

30

ఉత్తరప్రదేశ్

1617

1617

1606

ఉత్తరాఖండ్

1559

1524

1512

పశ్చిమ బంగాల్

9935

10172

11403

మొత్తం

142299

143914

154062

మూలం: జాయింట్ ప్లాంట్ కమిటీ (జేపీసీ)

 

కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే, ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానం రూపంలో ఇవాళ లోక్‌సభకు సమర్పించారు.

 

****


(Release ID: 1883451) Visitor Counter : 127


Read this release in: English , Urdu , Tamil